Latest Updates
-
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి! -
5 నిమిషాల్లో అదిరిపోయే ఎగ్ బర్గర్.. టేస్ట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! -
అక్షయ తృతీయ 2026: ఈ సమయం దాటితే పూజ ఫలితం ఉండదా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. ఎవరికి అదృష్టం వరించనుంది? - సోమవారం, 20 ఏప్రిల్ 2026 -
ఎండలను ఎదిరించే కమ్మని పానీయం..మసాలా మజ్జిగ తయారీ విధానం ఇదే! -
మద్యం తాగకపోయినా లివర్ డ్యామేజ్? కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి, వాటికి దూరంగా ఉండండి! -
అక్షయ తృతీయ వేళ పెళ్లిళ్ల సందడి.. కోర్టు మ్యారేజీల వైపు జంటల మొగ్గు! -
చూస్తే కలర్ ఫుల్, తింటే క్రంచీ..ఈ ఎండాకాలంలో టమాటా వడియాలు రుచి చూడాల్సిందే!
వేసవిలో ట్రిమ్ హెయిర్ స్టైల్ తో ఉండడానికి 10 కారణాలు
అందంగా కనిపించే వ్యక్తి వేసవిలో ట్రిమ్ హెయిర్ స్టైల్ ని ఎందుకు ఎంచుకుంటాడో మీకు తెలుసా? సరే, మీరు నిజంగా అటువంటి స్టైల్ కోసం తాపత్రయ పడుతుంటే, అది మీకు ఎంతో సౌకర్యవంతంగా అలాగే అపరిమిత స్వేచ్చని ఇస్తుంది అందుకని ట్రిమ్ హెయిర్ స్టైల్ ని తప్పక ప్రయత్నించండి. ఇది చాలా సరదాగా, చూడడానికి అందంగా కూడా ఉంటుంది. ట్రిమ్ హెయిర్ స్టైల్ మీరు అందంగా కనిపించేటట్లు చేయడమే కాకుండా మీ రంగు, ఎత్తు, సహజమైన జుట్టు, ఇతర భౌతిక రూపుని కూడా అందంగా చేస్తుంది. ఇది పురుషులందరికీ అనువుగా ఉండే ఏకైక శైలి.
పురుషులు వేసవిలో ట్రిమ్ హెయిర్ స్టైల్ కి, శీతాకాలంలో ఎక్కువ జుట్టుకి ప్రాధాన్యతనిస్తారు. మీరు మీ హెయిర్ స్టైల్ ని చాలా జాగ్రత్తగా ఎంచుకోవడం అవసరం, ఇది మీరు ఎలాంటి వ్యక్తో తెలియచేస్తుంది. మీరు అసహ్యంగా ఉంటే, జనాలు మిమ్మల్ని పట్టించుకోరు; కానీ మీరు ట్రిమ్ హెయిర్ స్టైల్ వల్ల మీకు నప్పే రకమైన శైలి గురించి ఆలోచిస్తూ మీరు మీ తలను వంచుకోవాల్సిన అవసరం లేదు. మీరు సులభంగా మీ జుట్టును నిర్వహించుకోగలరు.

ఇది స్థిరమైనది
అవును, మీ జుట్టు పొట్టిగా ఉంటె మీ పాకెట్ లో దువ్వెన ఉంచుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి, హరికేన్ వచ్చినా అది స్థిరంగా ఉంటుంది కాబట్టి దువ్వెన అవసరం లేదు. ఆ చిన్న జుట్టును నిర్వహణలో గోప్పతనముంది. దీనికి తక్కువ నిర్వహణ అవసరం.

చల్లదనాన్ని ఆస్వాదించండి
జుట్టు తక్కువగా ఉన్నపుడు మీ జుట్టు గాలిని ఆస్వాదిస్తుంది. వేసవిలో, ఎండ మీ తలను మండింప చేస్తుంటే, మీరు ట్రిమ్ వేసవి హెయిర్ స్టైల్ తో వేడి నుండి తప్పించుకోవచ్చు.

ఏ డ్రస్ అయినా నప్పుతుంది
చాలాసార్లు, మీరు మీ జుట్టు శైలి కి తగ్గట్టుగా బట్టలను ధరించడానికి కంగారుపడుతుంటారు. మీ హెయిర్ స్టైల్, మీ డ్రస్ ఒకదానికొకటి సంబంధం లేకపోతే, మీ మొత్తం రూపు అయోమయంగా కనిపిస్తుంది. కానీ మీరు ట్రిమ్ హెయిర్ స్టైల్ చేయించుకుంటే, ఇలాంటి విషయాల గురించి మీరు ఎక్కువ బాధపడాల్సిన పనిలేదు ఎందుకంటే కేవలం ఈ హెయిర్ స్టైల్ మాత్రమే అన్నిరకాల బట్టలకు దాదాపు సరిపోతుంది.

విశ్వాసం
పొట్టి జుట్టు మీ విశ్వాసాన్ని పెంచుతుంది. ఎప్పుడైతే మీ జుట్టు పద్ధతి లేకుండా, మురికిగా ఉంటుందో, సంఘంలో మీరు చాలా అసౌకర్యంగా ఉంటారు, కానీ మీ జుట్టు ట్రిమ్, పొట్టిగా, శుభ్రంగా ఉంటే, మీరు సామాజిక పరిస్థితులలో ఎవరితోనైనా కలవడానికి విశ్వాసంగా ఉంటారు. ఇది చాలా మంచి విభాగం.

యువకులుగా కనిపించడం
మీరు పురుషుల ట్రిమ్ హెయిర్ స్టైల్ చేయించుకుంటే, మీ అసలు వయసు కంటే చాలా తక్కువ వయసు ఉన్నట్లు కనిపిస్తారన్న నిజం మీకు తెలుసా? ఇది చాలా మంచి విషయం. వేసవి తాపాన్ని ఓడించడానికి తయారవండి.

డబ్బు ఆదాచేయడం
తక్కువ జుట్టు కలవారికి దానిని నిర్వహించడం తేలిక, అంటే తక్కువ మోతాదులో అన్ని రకాల జుట్టు సంరక్షణ ఉత్పత్తులను వాడవచ్చు. ఇదేవిధంగా, మీరు మీ జుట్టు సంరక్షణ ఉత్పత్తులకు డబ్బును కూడా ఆదా చేయవచ్చు.

చాలా అందంగా, అధునాతనంగా కనిపిస్తారు
అందమైన హెయిర్ స్టైల్ వల్ల అందరి దృష్టినీ మీరే ఆకర్షించడం మొదటి విషయం. పొట్టి జుట్టు మిమ్మల్ని అందంగా, మీమీద మొదటి అభిప్రాయం పడిపోతుంది.

జెంటిల్ మెన్ లా కనిపించడం
ఆడపిల్లలు ట్రిమ్ హెయిర్ స్టైల్ ఉన్న అబ్బాయిలను మరింత పురుషత్వం ఉన్నవారుగా భావిస్తారని ఇటీవలి అధ్యనంలో తెలిసింది. అందువల్ల, ఎందుకు మీరు ఈ వేసవిలో ఇలాంటి హెయిర్ స్టైల్ ని ప్రయత్నం చేసి మీకు ఇష్టమైన అమ్మాయిలకు ఆకర్షణీయంగా కనిపించకూడదు? అందుకనే పురుషులు వేసవిలో ట్రిమ్ హెయిర్ స్టైల్ కి ప్రాధాన్యతనిస్తారు.

మీకు బట్టతల ఉన్నా అది మీకు నప్పుతుంది
మీకు బట్టతల ఉంటే, మీకు బాగా నప్పే ట్రిమ్ హెయిర్ స్టైల్ చేయించుకోవడానికి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. నిజానికి, మీ తలపై తక్కువ జుట్టు ఉన్నపుడు వేసవి ట్రిమ్ హెయిర్ స్టైల్ కి మించి ఏ ఇతర హెయిర్ స్టైల్ మీకు నప్పుదు.

ప్రొఫెషనల్ గా కనిపిస్తారు
మీరు జాబ్ చేసేవారైతే, ట్రిమ్ హెయిర్ స్టైల్ మిమ్మల్ని ప్రొఫెషనల్ గా కనిపించేట్లు చేస్తుంది. ఇది మీ వ్యక్తిత్వం గురించి, మీరు ఎంత తీవ్రమైన, బలమైన వ్యక్తిత్వం కలవారో తెలియచేస్తుంది.



Click it and Unblock the Notifications











