Latest Updates
-
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.!
ఆక్సిజన్ లేకుండా ‘మెదడు’ జీవించగలదా...?

ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మెదడు బరువు 1230 గ్రాములు. సగటు బరువు కంటే 70 నుంచి 170 గ్రాములు తక్కువే (మనిషి మెదడు 1300 నుంచి 1400 గ్రాములు బరువు ఉంటుంది).
బ్రెయిన్ పగటి పూట కంటే రాత్రే చురుగ్గా పనిచేస్తుంది. మనం నిద్రలో ఉన్నప్పుడు తాజా జ్ఞాపకాలను భద్రపరచుకోవడంలో బిజీగా ఉంటుంది. అందుకే, నిద్రలేమి ప్రభావం జ్ఞాపకశక్తి మీద పడతుంది. మనిషి బతికున్నంతకాలం మెదడుకు విశ్రాంతి ఉండదు.
మెదడుకు నొప్పి తెలియదు. ఒక్కసారి కపాలాన్ని తెరిచారంటే, మత్తు మందు లేకుండానే శస్త్రచికిత్స చేయవచ్చు. మెదడు కుడిభాగం శరీరంలోని ఎడమ భాగాన్ని మెదడు ఎడమభాగం శరీరంలోని కుడిభాగాన్ని నియంత్రిస్తాయి.
మల్లేపూల పరిమళం మెదడును ఇట్టే ఆకర్షిస్తుంది. మెదడులోని 70 నుంచి 80 శాతం నీళ్లే. డీహైడ్రేషన్ ప్రభావం మెదడు మీద ఎక్కువగా ఉంటుంది. మెదడు వినియోగించే శక్తితో 25 వాట్స్ బల్బును మాత్రమే వెలిగించగలం.
మనిషి మెదడులోని నాడీ కణాలను ఒక్కొక్కటిగా లెక్కబెడతూ కూర్చుంటే, ఆ పని పూర్తవడానికి మూడువేల సంవత్సరాల పడుతుంది. మెదడు రోజుకు 70 వేల ఆలోచనలను సృష్టించగలదు. మొత్తంగా వెయ్యి టెరాబైట్ల సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోగలదు. మెదడులో నాడీకణాల మధ్య సమాచార మార్పిడి వేగం.. సెకనుకు 0.5 మీటర్ల నుంచి 120 మీటర్ల మధ్య ఉంటుంది.



Click it and Unblock the Notifications
