Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ఐశ్వర్య అందం.. చదం వెనుక ఉన్న బ్యూటీ సీక్రెట్...
ప్రపంచం మెచ్చిన సౌందర్యరాశి ఐశ్వర్య రాయ్ సంవత్సరాల తరబడి వన్నె తరగని అందంతో మెరిసిపోతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు పొందిన బాలీవుడ్ బ్యూటీ ఈమె. ఫిల్మ్ మేకర్స్ మొదలు టీనేజ్ బాయ్స్ వరకూ ఆమెను ఆరాధించే వారే. 1994 లో మిస్ వరల్డ్ టైటిల్ పొందినది మొదలు ఐశ్వర్య రాయ్ భారతీయ మహిళలను ఎంతగానో ప్రభావితం చేసారు. సాంప్రదాయ సుడిగుండంలో చిక్కుకోకుండా ఐష్ తన ప్రతిభకు మెరుగులు పెడుతూనే ఉన్నారు. వివాహానంతరం కూడా ఆమె తన కెరీర్ గ్రాఫ్ నూ పెంచుకుంటూనే వచ్చారు.
అందం అంటే ఆమెదే.. ప్రపంచం ఆమె అందానికి దాసోహం అంది. కుర్రకారు మొదలుకుని సినీ నిర్మాతల వరకూ ఆమె అందానికి ఆకర్షితులే.. ఒకటి కాదు.. రెండుకాదు. ప్రపంచ సుందరి కిరీటాన్ని తన సిగలో చేర్చుకున్న తరువాత కూడా ఆమె దాదాపు పద్దెనిమిది ఏళ్ళపాటు అదే అందచందాలను ఒలకపోసింది... ఆమె ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సి న అవసరం లేదు. ఆమె ఐశ్వర్యరాయ్ అని అందరికి ఇట్టే తెలిసిపోతుంది.
1994 లో మిస్ వరల్డ్ టైటిల్ పొందినది మొదలు ఐశ్వర్య రాయ్ భారతీయ మహిళలను ఎంతగానో ప్రభావితం చేసారు. సాంప్రదాయ సుడిగుండంలో చిక్కుకోకుండా ఐష్ తన ప్రతిభకు మెరుగులు పెడుతూనే వచ్చారు. వివాహానంతరం కూడా ఆమె తన కెరీర్ గ్రాఫ్ నూ పెంచుకుంటూనే వచ్చారు. బిడ్డ పుట్టిన తరువాత కాస్త శరీరానికి విరామం ఇచ్చారు. ఇంత కాలం ఐష్ అంతటి అందాన్ని ఎలా కాపాడుకోగలిగారనేది చాలా మందికి తెలియదు. ఆమెలో దాగున్న అందం వెనుక స్కిన్ క్వాలిటీ. ఐశ్వర్య రాయ్ తన చర్మ, కేశ సౌందర్యానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. చర్మ, కేశ సౌందర్యానికి ఏమీ చేసేవారనేది ఆసక్తికరమైన అంశం

నీళ్ళు:
ప్రతి రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీటిని తప్పనిసరిగా తాగేవారు. దీని వలన ఆమె శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి. సాధ్యం అయితే పది నుండి పన్నెండు గ్లాసుల నీళ్ళను తాగడం వల్ల చర్మానికి కావల్సినంత డీహైడ్రేషన్ అందుతుంది. రోజూ ఉదయమే గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మకాయ రసం కలుపుకుని తాగితే చర్మానికి నిగారింపుకు దోహదం చేస్తుంది.

బ్యూటీ కిట్:
శెనగపిండి లేదా పెసరపిండి తనకు ఇష్టపమైన నేచురల్ సౌందర్య సాధనాలు. చర్మకాంతిని పెంపొందించడానికి శెనగపిండి మరియు పాలు చాలా అద్భుతమైనటువంటి ఫేస్ ప్యాక్.

కీరదోసకాయ:
అంతటి అందలా సుందరి ఇటువంటి నేచురల్ ఉత్పత్తులను వినియోగిస్తారంటే ఆశ్చర్యం కలుగకమానదు. తన షూటింగ్ ముగించుకొని వచ్చిన తర్వాత, మేకప్ ను తొలగించి, చర్మానికి చల్లదనాన్ని చేకూర్చడానికి మరియు రిలాక్స్ అవ్వడానికి కీరదోసకాయ బాగా ఉపయోగపడుతుంది.

వైన్ ఫేషియల్:
ఐశ్యర్య రాయ్ వైన్ ఫేషియల్ కు గ్రేట్ ఫ్యాన్ అనే చెప్పాలి. ఫ్రెంచ్ క్రియేషన్ లో తయారయ్యే ఈ ఫేషియల్ ఆమె తరచూ ఉపయోగిస్తుంటారు.

పాజిటివ్ గా ఆలోచించడం:
అందంగా కనబడాలంటే అందం ఒక్కటే సరిపోదు. ఆరోగ్యంగాను, మరియు సంతోషంగాను ఉన్నప్పుడే ముఖంలో మరింత ఆకర్షణ ఏర్పడుతుంది. అందుకే ఆమె ఎక్కువగా పాజిటివ్ థికింగ్ ను కలిగి ఉంటారు.

అందంగా మెరిసే కళ్ళు:
మెరిసే కళ్ళు అందానికి ప్రతి రూపాలు అరోగ్యకరమైన లైఫ్ స్టైల్ మరియు రెగ్యులర్ స్లీప్ ఉన్నప్పుడు అది సాద్యం అంటారు. ఎటువంటం పరిస్థితుల్లోనూ నిద్రను అలక్ష్యం చేయనని కూడా చెబుతోంది. ఆరు గంటలు గాఢంగా నిద్ర పోయేవారు.

కొబ్బరి నూనె:
ఇక ఆమె హెయిర్ కేర్ లో ఎక్కువగా ఉపయోగించే కొబ్బరి నూనె, పామ్ కెర్నల్ ఆయిల్ తో ఆమె కురుల అందాన్ని మరింత మెరిసేలా చేస్తుంది.

మేకప్ :
తేలికపాటి మేకప్ తోనే అందంగా కనిపించవచ్చు.అతిగా మేకప్ చేయడం వల్ల అందాన్ని దెబ్బతీస్తుంది.



Click it and Unblock the Notifications
