Latest Updates
-
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.! -
కేవలం 1 స్పూన్ నూనెతో కుక్కర్ లో పానీ పూరీలు..డీప్ ఫ్రై లేకుండానే బండి మీది టేస్ట్! -
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం!
అలంకరణ విషయంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు
అందంగా కనిపించాలనే తాపత్రయంలో తెలిసీ తెలియక కొన్ని సార్లు అలంకరణ విషయంలో పొరపాట్లు చేస్తుంటాం. అవి ఆరోగ్యానికే కాదు మేనికీ మంచివికావు. సొగసు ఏ మాత్రం వన్నె తగ్గకుండా మెరిసిపోవాలంటే కొన్ని జాగ్రత్తలు తెలుసుకోవాల్సిందే.

చాలా మంది ముఖం జిడ్డుగా ఉందా? పొడిబారి ఉందా? అని తెలుసుకోవడానికి తరచూ చేతులతో ముఖాన్ని తాకుతుంటారు. కానీ ఇది చర్మానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఎందుకంటే మన చేతులు ఎన్నో బ్యాక్టీరియలకు నిలయంగా ఉంటాయి. వాటితోనే ముఖాన్ని నేరుగా తాకడం వల్ల జలుబుతో పాటు యాశ్నె, మెటిమలు రావడానికి కారణం అవుతాయి.
చర్మానికి తేమ అందితే నిగనిగలాడుతుంది. కొత్త చర్మాన్ని ఉత్తేజ పరుస్తుంది. అందుకనే చాలా మంది అతిగా మాయిశ్చరైజర్ ను వాడుతుంటారు. అయితే ఇలా అతిగా ఉపయోగించడం వల్ల ఓ ప్రమాదం కూడా ఉంది. చర్మ రంధ్రాలు మూసుకుపోయి. యాక్నే, మొటిమలు, వైట్ హెడ్స్ సమస్య మొదలవుతుంది. అందుకే మాయిశ్చరైజర్ ను పరిమితికి మించకుండా ఉంటే మేలు.
శరీర వర్ణం మెరసిపోవాలి అన్న ఉద్దేశంతో చాలామంది బ్లీచింగ్ అవసరానికి మించి వాడుతుంటారు. మనం వాడే ముఖ క్రీముల్లో బ్లీచింగ్ ఎంత శాతం ఉంది. అన్న దానిని నిరంతరం సమీక్షించుకోవాలి. అతిగా బ్లీచింగ్ చెయ్యడం వల్ల రంగు రావడం మాటెలా ఉన్నా సున్నితమైన చర్మ కణాలు దెబ్బతింటాయి. వయసుకు మించి పెద్దవారిలా కనిపించే ప్రమాదం ఉంది. పైగా ముఖంపై జుట్టు శాశ్వతంగా తెల్లగా లేదా పసుపు వర్ణంలోనికి మారే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.
శరీరం ఆకృతి కోసం, అందం కోసం పెడిక్యూర్, మెనిక్యూర్ సరే మరో అడగు ముందుకేసి స్పా సెంటర్లలో స్వాంతన పొందడం బాగానే ఉంది కానీ అవి చేసే బ్యూటీపార్లర్లు, స్పాలు ఎంత వరకు శుభ్రం అన్న విషయాన్ని అవగాహన చేసుకొని వెళితేనే మేలు. ఎందుకంటే అక్కడ ఉపయోగించే కొన్ని వస్తులువు, నీళ్లు అపరిశుభ్రంగా ఉన్నట్లైతే ఇన్ ఫెక్షన్ రావడానికి అవకాశాలున్నాయి.
గరుకు ఉండి మృతకణాలను తొలగించే స్ర్కబ్బర్లని తరచూ ఉపయోగించడం వల్ల చర్మం కాంతులీనడం మాటెలాఉన్న హాని జరిగే ప్రమాదం ఉంది. అందుకు కారణం లోతుగా స్ర్కబ్బింగ్ చేయడం వల్ల కొన్నిసార్లు వైట్ హెడ్స్ రావడానికి అవకాశం ఉంది. చర్మం మరీ సున్నితంగా మారిపోయి అలర్జీలు రావడం పెరుగుతుంది. చర్మ రంధ్రాలు తెరచుకొని ముఖంలో సహజసిద్ద నిగారింపు తగ్గిపోతుంది.
చర్మాన్ని శుభ్రపరిచే క్లెన్సర్లని ఏవి పడితే అవి వాడకూడదు. సాధారణంగా పొడి చర్మం వారికి క్లెన్సింగ్ మిల్స్ ఉపయోగపడితే, మిగిలిన వారికి సబ్బులేని ఫ్రీ క్లెన్సర్ బాగా ఉపయోగపడుతుంది. అదే ఏవి పడితే అవి ఉపయోగించడం వల్ల చర్మం రంధ్రాలు పాడవుతాయి. ఇబ్బందులు తలెత్తుతాయి.
రింగులు తిరిగిన శిరోజాలు సాఫీగా చేయించుకొనే స్ట్రెయిటనింగ్.. సిల్కీగా జాలువారరేలా కనిపంచేలా తీర్చిదిద్దుకొనే ఫర్మింగ్ లకు అప్పుడప్పుడు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి. నిత్యం కొత్తగా కనిపించాలని వారానికోసారి చేయించుకంుటే బట్టతల రావడం, జుట్టు పొడిబారిపోవడం జరుగుతుంది.
నూనె రాయకపోతే జుట్టు రాలిపోతుందేమో అనుకొని చాలా మంది శిరోజాలకి నూనెని అతిగా రాస్తుంటారు. కానీ ఈ అభిప్రాయంలో నిజం లేదు పైగా నూనెని అతిగా రాయడం వల్ల చుండ్రు వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది నూనె మంచి కండిషనింగ్ కారకమే కానీ జుట్టు రాలిపోవడానికి నూనె రాయకపోవడమే కారణ అని మాత్రం అనుకోవద్దు.



Click it and Unblock the Notifications