Latest Updates
-
బంగాళదుంపలు ఉడకబెట్టేటప్పుడు ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే.. రుచి అదుర్స్! -
Wolrd Blood Donor Day 2026: రక్తదానం చేస్తే ఇన్ని ప్రయోజనాలుంటాయా? -
అమృత సిద్ధి యోగం: ఈ 3 రాశుల వారికి రాత్రికి రాత్రే అదృష్టం, తలరాత మారబోతోంది! -
పెసరపప్పుతో దూది లాంటి ఇడ్లీలు..పొట్టకు తేలికగా,ప్రయోజనాలు మెండుగా ఉండే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ -
ఈరోజు రాత్రి అరుదైన యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీదే! -
శని దోషం ఉందా? ఈ 7 పరిహారాలు వెంటనే మొదలుపెట్టండి -
ఆదివారం స్పెషల్: నోరూరించే కర్ణాటక స్టైల్ నాటు కోడి కూర రెసిపీ ఇదే! -
సోమవతి అమావాస్య: ఈ చిన్న పరిహారాలతో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు! -
మిథున, సింహ, తుల రాశుల వారికి భారీ అదృష్టం.. మీ రాశి ఉందా? - ఆదివారం, 14 జూన్ 2026 -
మిథున, సింహ, ధనుస్సు రాశుల వారికి ఈ వారం రాజయోగం.. మీ జాతకం ఎలా ఉంది? - 14 నుండి 20 జూన్ 2026 వరకు
ఇలా చేస్తే బరువు తగ్గటం తేలికే...!

బరువు తగ్గాలనుకొనే వారు కడుపు మాడ్చుకోవలసిన అవసరం లేదు: కడుపు మాడ్చుకొని ఉపవాసలు చేయాల్సిన పనిలేదు. రోజు మొత్తం మీద తీసుకునే ఆహారాన్నే నాలుగైదు భాగాలుగా విభజించుకొని తీసుకోవాలి. కొద్దికొద్దిగా ఎన్ని సార్లు తిన్నా ఎంత తిన్నా ఫర్వాలేదని డైటీషన్లు చెపుతున్నారు. బాగా ఆకలివేసినప్పుడు మాత్రమే తినాలి తప్పించి కొద్దిగా ఆకలి వేయగానే తినేయడం అంత మంచి అలవాటు కాదు.
కాల్షియం అత్యవసరం: బరువు తగ్గడంలో కాల్షియం ముఖ్యం పాత్ర వహిస్తుంది. ఆహారంలో కాల్షియం తప్పనిసరిగా వుండేటట్లు చూసుకోవాలి. కొవ్వు తక్కువగా ఉన్న పెరుగు, పనీర్ చాలా బాగా పనిచేస్తాయి. పాలలో వుండే మీగడలో క్యాలరీలు అధికంగా వుంటాయి. పాలను నేరుగా తీసుకోవడం కన్నీ మజ్జిగ రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
స్టాట్యుటరీ ఫాట్ ను తగ్గించాలి: నూనె, నెయ్యిలలో స్టాట్యూటరీ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. వంటకాలలో వీటిని సాధ్యమైనంత తక్కువ ఉపయోగిస్తూనే మరికొన్నింటిలో పూర్తిగా మానేయొచ్చు. చపాతీలలోనూనె కన్నా పుల్కాలు ఆరోగ్యకరం. దోశ, వడ కన్నా ఆవిరి మీద తయారు చేసిన ఇడ్లీమేలు. రోజూవారీ భోజనంలో ఉపయోగించే నెయ్యిని కూడా పూర్తిగా నిషేధించాల్సిందే..
నీరే అమృతం: రోజుకి పదిగ్లాసుల నీరు తాగితే అమృతంలా పనిచేస్తుంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు మీ దరిచేరవు. నీరు ఎక్కువ తాగడం వలన ఆకలి త్వరగా వేయదు. నీరు ఎక్కువగా తాగడం వల్ల ఎక్కువ తినాలన్న కోరిక కలగదు. తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకొంటారు. నాన్ స్టిక్ పాత్రలలో వంట చేయడం వల్ల నూనె తక్కువ పట్టడంతో పాటు పదార్థాలలో పోషకవిలువలు పోకుండా ఉంటాయి. అప్పడాలను వేయించుకునే బదులు కాల్చుకొని తింటే వాటిని తినాలన్న కోరిక తీరుతుంది. నూనెనుండి తప్పించుకున్నట్లు ఉంటుంది.
తృణధాన్యాలు బెటర్: ఉదయం నిద్రలేచిన తర్వాత భారీ ఎత్తున తీసుకునే బ్రేక్ ఫాస్ట్ సంగతి మరిచిపోండి. కడుపు నిండుగా వుండి క్యాలరీలు తక్కువగా వుండే తృణధాన్యాలను ఉపాహారం కింద తీసుకుంటే మంచిది. ముందు రోజూ నానబెట్టి మొలకలు వచ్చిన తృణధాన్యాలలో కొద్దిగా ఉప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, నిమ్మరసం కలిపి తింటే రుచిగా వుంటాయి. ప్రతి రోజూ తినలేకపోయినా వారానికి రెండు మూడు సార్లు తప్పనిసరిగా తృణధాన్యాలు తీసుకునే అలవాటు చేసుకోండి.
ఫైబర్ తప్పనిసరి-పళ్ళు మరవద్దు: తీసుకొనే ఆహారంలో ఫైబర్ వుండేట్లు చూసుకోవాలి. ఆకు కూరల్లో ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. రోజు మొత్తం మీద కనీసం ఒక పెద్ద పండన్నా తీసుకోవాలి. ప్రతి పండులోనూ పోషక విలువలు, ఫైవర్ ఎక్కువగానే లభిస్తాయి. ఫైబర్ తో పాటు చర్మం సౌందర్యానికి పళ్లు బాగా పనిచేస్తాయి.
మాంసాహారం: మాంసాహారం లేకుండా ముద్ద దిగని వారు ఎందరో ఉన్నారు. మాంసాహారం వండేటప్పుడు చర్మం తీసేసి వండాలి. దీని వలన వందక్యాలరీలు తగ్గిపోతాయి. దీని తయారీలో నూనెకు బదులు నీటిని వాడితే కొవ్వు చేరకుండా జాగ్రత్తపడవచ్చు. చేపలలో తక్కువ పరిమాణంలో కొవ్వు ఉంటుంది. చికెన్, మటన్ కి బదులుగా చేపలు తినడం అలవాటు చేసుకుంటే మంచిది.



Click it and Unblock the Notifications