Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
శరీరాన్ని, కళ్ళు,గోళ్ళు-చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే గుడ్డు..!

ప్రతి రోజూ గుడ్డు తింటే బోల్డెంత ఆరోగ్యం అని కొందరంటే, గుడ్డులోని కొలెస్ట్రాల్ శరీరంలో కొవ్వును పేర్చుతుందని ఇంకొందరు అంటుంటారు. అయితే కోడుగుడ్డులో పదమూడు రకాల అత్యవరసర పోషకాలుంటాయి. విటమిన్ ‘సి' మినహా శరీరానికి అవసరమైన పోషకాలన్నీ గుడ్డులో లభిస్తాయి. శరీరానికి అత్యధిక క్వాలిటీ గల ప్రొటీన్లు, కోలిన్, ఫొలేట్, ఐరన్, జింక్ అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా గుడ్డులో పుష్కలంగా లభిస్తాయి. చాలా మంది అనుకొన్నట్లు గుడ్డు ఫ్యాట్ ను పెంచదు. నిజానికి సగటు గుడ్డులో 80 క్యాలరీలు మాత్రమే ఉంటాయి' అని చెప్తారు పోషకాహార నిపుణులు.
గుడ్డులో లభించే ప్రోటీన్ల వల్ల కండరాల శక్తి, స్ట్రెంగ్త్ పెరుగుతాయి. దేశవ్యాప్తంగా గల శాకాహారులు సైతం గుడ్డు లోని పోషకాలను గుర్తించి, నెమ్మదినెమ్మదిగా దాన్ని వారి ఆహారంలో భాగం చేసుకోవడం ఆరంభించారు. గుడ్డులో ఉండే రిబో ఫ్లేవిన్ గుడ్డును ఆహారంలో భాగం చేసుకోవడానికి మంచి కారణం. అంతే దీనిలో తొమ్మిది ఎసెన్సియల్ ఎమినో యాసిడ్స్, విటమిన్ డి ఉంటాయి. సల్ఫర్, ఇతర మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి శిరోజాలు, గోళ్ళు, చర్మానికి గుడ్లు ఎంతగానో ఉపకరిస్తాయి.
కేవలం గుడ్డులోని తెల్ల సొన మాత్రమే తినాలని మొత్తం గుడ్డు తినడం వల్ల కొవ్వు పెరుగుతుందని అనే వారు అనేకమందే ఉన్నారు. అందుకు కారణం పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉండడమే. అయితే తెల్లగుడ్డు నిస్పందేహంగా మంచిదే. అయితే రోజుకు ఒక్క పచ్చసొన అయినా తినాలి అంటారు ఆరోగ్య నిపుణులు.
బరువు తగ్గాలనుకునేవారు గుడ్డుతో రోజును ప్రారంభించాలి. గుడ్డులో ఉండే ఒక శక్తివంతమైన పదార్థం మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం తీసుకున్నప్పుడు వచ్చే కేలరీలను తగ్గిస్తుందని పోషకాహార నిపుణులు తెలిపారు. గుడ్డును ఉడకబెట్టి, వేయించి తినొచ్చు. ఉదయం తీసుకునే ఇతర టిఫిన్ల కన్నా గుడ్డు తీసుకుంటే కడుపు నిండుగా ఉంటుంది. దీని వల్ల త్వరగా ఆకలేదు. ఫలితంగా ఇతర చిరుతిళ్లు తినే అవకాశం ఉండదు.
గుడ్లను ఎలా ఉడికించాలి: చల్లని నీటిని గుడ్డు పూర్తిగా మునిగి, మరో అంగుళం పైకి ఉండే మాదిరిపోయాలి. చల్ల నీటిలోనే ఒక చెంచా ఉప్పు వేస్తే గుడ్లు ఉడికే సమయంలో పగిలి వెలుపలికి రాకుండా ఉంటాయి. గుడ్లను ఎక్కువ సమయం ఉడికించ కూడదు. మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. తర్వాత స్టౌ ఆఫ్ చేసి 10-15నిమిషాలు అలా ఉంచేయాలి. దీనివల్ల పచ్చసొన కావాల్సినంత మేరకు ఉడకుతుంది. ఎక్కువగా ఉడికి ఆకుపచ్చవర్ణంలోకి మారదు. పోషక విలువలు నష్టపోకుండా ఉంటాయి. గుడ్డులో క్యాలరీలు, ప్రొటీన్, కార్బోహైడ్రేట్స్, పూర్తి ఫ్యాట్, మోనో ఆన్ సాచురేటెడ్ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్, పాలిఅన్ సాచురేటడ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్, సోడియం వంటివి పుష్కలంగా ఉంటాయి కాబట్టి రోజుకో గుడ్డు తినడం, ఆరోగ్యానికి అందానికి కూడా మంచిదే...



Click it and Unblock the Notifications