Latest Updates
-
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.!
వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి....?

వర్షాకాలంలో మన ఆహారపు అలవాట్లపై ఒక కన్నేసి వుంచాలి. ఏదైనా వేడి వేడిగా చూసిన వెంటనే నోరూరి మనసు లాగినా ఏదిపడితే అది ఎక్కడపడితే అక్కడ తినకూడదు. కూసింత కళ్లెం వేయాలి. ఆహారం విషయంలో పరిశుభ్రతకు, పౌష్టికతకు ఎక్కువ ప్రాధాన్య ఇవ్వాలి. శుభ్రమైన వాతావరణంలో వండిన పదార్థాలను తీసుకోవడమే మంచిది. లేకపోతే జబ్బున పడేది మనమేకదా. రోడ్లమీద నడుస్తున్నప్పుడు, చిరుజల్లులు కురుస్తున్నప్పుడు బయట బళ్లమీద వేడివేడిగా వేస్తున్న బజ్జీలు చూస్తే నోరూరుతుంది. తినాలనిపిస్తుంది. వెంటనే అక్కడికెళ్లిపోతాం. పొగలుకక్కే బజ్జీలను ఊదుకుంటూ లాగించేస్తాం. అప్పుడు బాగానే వుంటుంది. తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలతోనే సతమతమౌతాం. అందుకే చిన్ని చిన్ని జాగ్రత్తలతో ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
ముఖ్యంగా రోడ్లమీది ఆహారాన్ని పూర్తిగా నిరాకరించి వీలైతే ఇంట్లోనే తయారు చేసుకొని తినడం మంచిది. టీ, కాఫీ, బజ్జీ, పకోడీ, చాట్ వంటివి తినాలనిపించినా ఆగక తప్పదు. ఒకవేళ బయట తినాలనుకుంటే పరిశుభ్రమైన వాతావరణంలో వండే వాటిని ఎంపిక చేసుకోవడం ఉత్తమం.
బయట తయారుచేసే పళ్లరసాలకు దూరంగా వుండాలి. అందులో కలిపే ఐస్ ఒంటికి అంత మంచిది కాదు.
పచ్చి కూరగాయలు, పళ్లు తినాలనుకుంటే వాటిని శుభ్రంగా కడిగి తొక్క తీసుకుని తినాలి. తేలిగ్గా జీర్ణమయ్యే వాటిని తినడం ఉత్తమం.
విటమిన్ 'సి' వున్న పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల వానాకాలం తరచూ వచ్చే జలుబు వంటి వాటిని దూరంగా పెట్టవచ్చు.
వర్షంలోంచి ఇంటికి చేరాక వేడివేడిగా ఏదైనా తీసుకోవాలి. ఓ కప్పు వేడి పాలు, కాఫీ, టీ, గ్రీన్ టీ, సూపు తీసుకోవచ్చు. ఉడికించని పదార్థాలు, సలాడ్ వంటి వాటికి దూరంగా వుంటేనే మంచిది.
త్వరగా జీర్ణం అయ్యే తాజా పళ్లు, పాలు, మజ్జిగ వంటివి తీసుకుంటే తేలిగ్గా వుంటుంది. ఉప్పు, తీపి ఎక్కువగా వున్న పదార్థాలను దూరంగా పెట్టాలి. ముఖ్యంగా పచ్చళ్లు, స్వీట్లు తగ్గించాలి.
మాంసాహార ప్రియులు కూడా సూపులు తాగితే మంచిది. దాంతో ఆరోగ్యం కూడా తేలిగ్గా వుంటుంది. పచ్చి మాంసాన్ని ఎక్కువసేపు బయట వుంచకూడదు. ఒకవేళ వండడానికి బాగా ఆలస్యమౌతుందనుకుంటే ఫ్రిజ్జులో పెట్టేయాలి.
తరచూ కరెంటు పోవడం వల్ల రిఫ్రిజిరేటర్ లో నిల్వ వుంచిన ఆహార పదార్థాలు కూడా త్వరగా పాడయ్యే అవకాశముంది. అందుకే అవసరమైనంత మేరకే వండుకొని వేడివేడిగా తినాలి. ఫ్రిజ్జులో నిల్వ చేసే అవసరం లేకుండా తగినంత వండుకోవడం ఈ సీజన్ కు చాలా మంచిది. ఒకవేళ పెట్టినా మరలా దాన్ని తినబోయేముందు బాగా వేడి చేసుకోవడం మర్చిపోకూడదు.



Click it and Unblock the Notifications
