Latest Updates
-
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.! -
సాయంత్రం వేళ ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగించాలి?అష్టైశ్వర్యాలు తెచ్చే అద్భుతమైన మార్గం.. -
చేతి గోళ్లు ఇలా ఉంటే కిడ్నీల ఆరోగ్యానికి వార్నింగ్.. మీకూ ఇలా ఉందా.? -
ఈ పద్ధతిలో అల్లం చట్నీ చేస్తే.. ఎవరైనా సరే నాలుగు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి సొరకాయ దోశ..అప్పటికప్పుడు ఈజీగా చేసుకోండిలా.. -
మంచి భర్త కోసం ఉపవాసం చేస్తున్నారా.. కానీ శివారాధనలో అమ్మాయిలు చేసే పొరపాట్లు ఇవే.! -
కుజ- చంద్రుల కలయికతో మహాలక్ష్మి రాజయోగం.. ఎనలేని సంపద సిద్ధించే ఈ రాశుల్లో మీరు ఉన్నారా.! -
చపాతీలో ఫేవరెట్ పనీర్ మెంతి కర్రీ.. రెస్టారెంట్ స్టైల్లో ఇలా అదరగొట్టేయండి.! -
ఒకసారి స్టెంట్ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.!
బ్యూటిఫుల్ బాడీ షేప్ ఇలా సొంతం...!
సాధారణంగా మహిళలు అందంగా ఉంటారంటుంటారు. అందుకే కాబోలు కవులు స్త్రీ అందం గురించి ఒక్కో కవి ఒక్కో విధంగా కవితలు అల్లుంటారు. అయితే స్త్రీ అందంగా , కలర్ ఫుల్ గా ఉంటే సరిసోదు. అందానికి తగ్గ ఫర్ ఫెక్ట్ బాడీ షేప్ కలిగి ఉండాలి. అప్పుడే సంపూర్ణంగా అందంగా కనిపిస్తుంది. పర్ ఫెక్ట్ బాడీ షేప్ కలిగి ఉన్నప్పుడు ఆమె చర్మం కూడా చూస్తూనే తాకాలనిపించే ఫీలింగ్ కలిగే విధంగా ఉండాలి. అప్పుడు ఎదుటి వారిని ఆకర్షించ గలరు. కాబట్టి చర్మ సంరక్షణతో పాటు శరీరంలో ఇతర భాగాలపై కూడా శ్రద్ద తీసుకొన్నట్లైతే అందమైన శరీర సౌష్టవంతో పాటు సౌందర్యం స్త్రీ సొంతం అవుతుంది. అయితే శరీరంలోని కొన్ని ప్రదేశాలు చాలా సున్నితంగా ఉంటాయి . ముఖ్యంగా చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే ముందుగా చర్మ సంరక్షణ కొరకు, శరీరంలో ఇతర భాగాల అందం కోసం ఎక్కువగా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది.

మెడ(నెక్): శరీరంలో ప్రతి భాగంఅందంగా, చక్కటి ఆకతి కలిగి ఉంటేనే. ఎందుకంటే కొంత మంది స్త్రీలలో బాడీ అంతా అందంగా ఆకర్షణీయంగా ఉండి, మెడ దగ్గర కు వచ్చే సరికి సరైన జాగ్రత్తలు తీసుకోక మెడ నల్లబడటం లేదా ముడతలు, లేదా చారలు పడటం చూడటానికి అందవిహీనంగా కనబడుతుంటుంది. శంఖంలాంటి మెడ ఆకతి కోసం తగిన జాగ్రత్త తీసుకొంటే అందమైన మెడ మీ సొంతం అవుతుంది. సాధారణంగా ప్రతి రోజూ ముఖానికి అప్లై చేసే క్రీములనే మెడకు కూడా అప్లై చేస్తుండాలి. చర్మంలోని మృతకణాలను తొలగించడానికి, చర్మం ఏ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేదుంకు వారానికి ఒకసారి బాడీ స్ర్కబ్ తో రబ్ చేసి చర్మంలో పేరుకొన్న మలినాన్ని, దుమ్ము, ధూళిని తొలగించి తర్వాత మాయిశ్చరైజర్ రాస్తుండాలి. ఇలా చేయడం వల్ల ముఖం ఎంత కాంతివంతంగా ఉంటుందో అదే విధంగా మెడ కూడా ముఖ ఛాయకు సరిపోయే విధంగా తయారవుతుంది.
చేతులు: అందమైన స్త్రీ అనడానికి చేతులను అందంగా ఉంచుకోవడాన్ని బట్టి చేప్పేయచ్చు. అందుకోసం మీరు ఎంత కేర్ తీసుకొంటే అంత అందంగా కనబడుతారు. మీ చేతులను క్లీన్ గా, మాయిశ్చరైజింగ్ చేసుకోవడం వల్ల మీ అందం మరింత రెట్టింపు అవుతుంది. కాబట్టి మీరు ఎక్కడు వెళ్ళినా మాయిశ్చరైజ్ క్రీము బాగులో తప్పనిసరిగా ఉండేట్లు చూసుకోవాలి. చేతులు శుభ్రం చేసుకొన్నప్పుడల్లా తప్పనిసరిగా మాయిశ్చరైజర్ ను అప్లై చేస్తుండాలి. చేతులు అందంగా ఆకర్షణీయంగా కనబడుతాయి. లేదంటే చేతులు కూడా నిర్జీవంగా, జాయింట్స్ లోనూ, మోచేతులు నలుపుగా ఉంటాయి. అందుకోసం తప్పనిసరిగా వైటనింగ్ క్రీమ్ లను అప్లై చేస్తే శరీర సంరక్షణలో ఇది ఒక ముఖ్య చిట్కా..
వెన్ను భాగం(వీపు): శరీరంలో బహిర్గంతంగా కనిపించే ప్రదేశం వీపు భాగం. మరి వీపు చూడగానే ఆకర్షించే విధంగా ఉండాలి. అందుకోసం వారంలో ఒకటి లేదా రెండు సార్లు ఆయిల్ మసాజ్ చేయించుకొన్నట్లైతే బ్యాక్ స్కిన్ కూడా కాంతి వంతంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల చర్మాన్ని తేమగా ఉంచుతుంది. తర్వాత స్నానం చేసిన ప్రతి సారి తప్పకుండా మాయిశ్చరైజర్ ను అప్లై చేస్తుండాలి. దాంతో చర్మం పొడి బారకుండా తేమగా ఉంచుతుంది. ఇలా చేయడం వల్ల శరీర ఛాయను పెరుగు పరచి మెరిసేలా చేసి ఆకర్షణగా ఉంటుంది.
పొట్ట భాగం: శరీరంలో అన్ని భాగాలతో పాటు పొట్ట బాగం కూడా శుభ్రంగా, మాయిశ్చరైజింగ్ గా ఉంచుకోవాలి. అందుకోసం మాయిశ్చరైజింగ్ క్రీమును పొట్ట బాగంలో కూడా రాసి మర్ధన చేసుకొని మరింత ఆకర్షణగా కనబడేవిధంగా చేయాలి.
కాళ్ళు: చేతులకు ఎంత ప్రాధాన్యతను ఇస్తామో.. కాళ్ళ కూడా అంతే ప్రాధన్యతను ఇవ్వాలి. మోకాళ్ళ దగ్గర, మడమల దగ్గర చర్మ నల్లగా మారినట్లైతే వెంటనే వైటనింగ్ క్రీమును తప్పకుండా రాస్తుండాలి. దాంతో జాయింట్స్, మోకాళ్ళ దగ్గర శుభ్రం పడి కాంతివంతంగా మారుతుంది. కాళ్ళు, మొడిమలు శుభ్రంగా ఉండేందుకు ఫ్యూమిస్ స్టోన్ తో రుద్ది శుభ్ర పరచుకోవాలి. తర్వాత ఫూట్ క్రీమ్ ను అప్లై చేయాలి. ఇలా రెగ్యులర్ గా బాడీ కేర్ తీసుకొన్నట్లైతే అందమై శరీరంతో పాటు, చక్కటి సౌందర్యం మీ సొంత అవుతుంది.



Click it and Unblock the Notifications