Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
మసాజ్ తో పాదాల సౌందర్యం...
కాలి పాదాలు కూడా ఆరోగ్యాన్ని సూచిస్తాయి. సున్నితమైన, పాదాలు చూడడానికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. కాలిమునివేళ్ల రంగు మారితే ఇన్ ఫెక్షన్ అయినా కారణం కావచ్చురక్తప్రసరణ సక్రమంగా లేకపోవడం అన్నాకావచ్చు. మునివేళ్ళు ఎరుపు లేదా పర్పల్ కలర్ లేదా నీలిరంగులో మారినప్పుడు పైసమస్యలకు సూచికలుగా భావించాలి. రక్తప్రసరన సక్రమంగా జరగనప్పుడు మాత్రం కింది విధంగా చేసినట్టయితే కొంత వరకు ఫలితం ఉంటుంది.
మీ వేలితో కాలిబొటనవేలిని అదిమి పట్టి ఉంచాలి. అలా ఐదు నుంచి పది సెకన్ల వరకూ చేయాలి. ఇలా చేయడం వలన గోళ్లు సాధారణ రంగుకు వచ్చే అవకాశం ఉంది. దెబ్బలు తగిలినప్పుడు అశ్రద్ద చేయకుండా వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. చాలా మంది పాదాలకు తగిలే దెబ్బల గురించి పెద్దగా పట్టించుకోరు. దీని వలన కూడా పాదాల ఫిట్ నెస్ దెబ్బతింటుంది. వీటితో పాటు చిన్న చిన్న ఎక్సర్ సైజ్ ల ద్వారా పాదాలను బలంగా ఉంచుకోవచ్చు. చిన్నటవల్ ను. కానీ గోళీకాయను కానీ కాలి మునివేళ్లతో పైకి లేపగలగాలి.

అలా చేయగలిగినప్పుడే మీ పాదాలు, కాలి వేళ్లు బలంగా ఉన్నట్లు లెక్క.. పై రెండింటిలో దేనిని మీరు లేపలేకపోయినా కాలి వేళ్లు ఆరోగ్యంగా లేనట్లు భావించాలి. తిరిగి వీటికి మునుపటి బలాన్ని తీసుకురావడానికి మసాజ్ అవసరమవుతుంది. క్రమం తప్పకుండా మసాజ్ చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అదే విధంగా పాదాలకు చెప్పులు కానీ. షూస్ కానీ వేసుకోకుండా కనీసం వందగజాలు రోజూ పరిగెత్తండి. ఇంత దూరం లేకుండా నాలుగైదుసార్లగా పరిగెట్టాలి. ఈ విధమైన ఎక్సర్ సైజ్ వలన పాదాలు, కాలి వేళ్లు ఆరోగ్యంగా మారతాయి. అదే విధంగా ఈ కాలం వచ్చే పగుళ్లను ఏమాత్రం అశ్రద్ద చేయకుండా అయింట్ మెంట్ ను పూయాలి.
కాలి పగుళ్ల ద్వారా మట్టి, క్రిములు శరీరంలోకి ప్రవేశించి ఇన్ ఫెక్షన్ కారణమవుతాయి. ఇన్ ఫెక్షన్ శరీరంలో ఎక్కువ కాలం ఉంటే దాని ప్రభావం ఆరోగ్యం మీద, కాలి పాదాల మీద తీవ్రంగా ఉంటుంది. పాదాలకి చలి ఎక్కువగా సోకకుండా వాడేసిన సాక్స్ ను వేసుకుంటే మంచిది. సాక్స్ వేసుకోవడం వలన మట్టి, క్రిములు శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉండదు..



Click it and Unblock the Notifications
