Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
స్క్రబ్బింగ్ తో మేని మెరుపులు...

1. టమోటా, కీర, క్యారెట్టు రసాలను సమపాళ్ళలో కలుపుకుని అందులో రెండు చుక్కల నిమ్మరసాన్నికలుపుకోండి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు ముఖం, శరీరం, కాళ్ళు, చేతులకు అరగంటసేపు రుద్దుకోండి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖం, కాళ్ళు, చేతులు శరీరాన్ని శుభ్రపరచుకోండి. కొన్ని రోజుల్లోనే మీ శరీర చర్మంతోపాటు ముఖంలోను నిగారింపు కనపడుతుంది.
2. సాధారణ చర్మం గలవారు ఓట్ మీల్ పొడిలో పాలను కలిపి ముఖానికి రాయాలి. ఐదు నుంచి పదినిమిషాలు మెల్లగా మర్దనా చేయాలి తర్వాత కాసేపు ఆరనివ్వాలి. ఇప్పుడు పాలల్లో దూదిని ముంచి సున్నితంగా ముఖంపై అద్దాలి. మరో అయిదు నిమిషాల తర్వాత గోరు నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు తప్పనిసరిగా చేస్తే, చర్మం కోమలంగా, కాంతివంతంగా తయారవుతుంది.
3. పొడి చర్మం గలవారు పది బాదం పప్పులను కాసేపు నానేసి గ్రైండ్ చేసుకోండి. దానిని ముఖానికి రాసుకోని ఐదు పది నిమిషాలు మసాజ్ చేసే చర్మం మీద ఉన్న మృత కణాలు తొలగిపోతాయి. అప్పుడు మీ ముఖం మరింత అందంగా కనిపిస్తుంది.
4. అలాగే అరటిపండు గుజ్జు, ఓట్‌మీల్ పొడి, తేనే, రోజ్ వాటర్ ని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాస్తూ పైకి, కిందికి మర్దనా చేయాలి. ఆరిన తర్వాత రోజ్ వాటర్ తో తుడవాలి. ఇప్పుడు చల్లని నీటితో కడిగేయాలి. వారానికి రెండుసార్లు తప్పనిసరిగా స్క్రబింగ్ చేయాలి. దీనివల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.
5. జిడ్డు చర్మంకలవారు పొప్పడి పండు గుజ్జు, బియ్యం పిండి కలిపి ముఖానికి పట్టించాలి. దీనివల్ల చర్మం మీద బ్లాక్ హెడ్స్ తగ్గిపోతాయి. మొటిమల మచ్చలు కూడా తగ్గుతాయి.



Click it and Unblock the Notifications
