Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
వేసవి ప్రతాపం శరీరంపై పడకుండా...

1. అధిక వేడికి చర్మం కమలటం ఈ కాలంలో సర్వసాధారణం. ఇలాంటప్పుడు ముఖం, చేతులు, పాదాలు లాంటివాటిని అధిక వేడి నుంచి కాపాడుకునేందుకు చందనం, పువ్వులు ఎంతగానో మేలు చేస్తాయి. ముఖ్యంగా రోజా, లిల్లీ, తామర, బంతి, చేమంతి, మల్లెపువ్వులతో వేసవిలో చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.
2. ఎండలో వెళ్లాల్సి వచ్చినపుడు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోండి. గొడుగు పట్టుకెళితే మరీ మంచిది. నీరు ఎక్కువగా తాగండి. ఎన్ని నీళ్లు తాగితే అంత మంచిది. కొబ్బరి నీరు తీసుకుంటే ఇంకా మేలు. స్మోకింగ్, డ్రింకింగ్‌కు దూరంగా ఉండండి.
3. పాదాలు కోమలత్వాన్ని సంతరించుకోవటానికి నిమ్మచెక్క తో పాదాలను రుద్దాలి. ఇలా తరచూ చేయటంవల్ల పాదాలు తెల్లగా, కోమలంగా తయారవుతాయి.
4. నిమ్మరసం, పంచదార కలిపి మిశ్రమంతో ముందుగా పాదాలను శుభ్రపరచాలి. ఇది స్క్రబ్ లా పనిచేసి చర్మం పై పేరుకున్న మృతకణాలన్ని తొలగిపోతాయి. తర్వాత పాలు, తేనె, గోధుమపిండి ఒక్కో చెంచా చొప్పున తీసుకోవాలి. వీటన్నిటినీ పేస్టులా చేసి పాదాలకు ప్యాక్ వేసుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.
5. బయట తిరిగే వారందరూ తలపై ఆచ్ఛాదనగా, టోపీ గాని, గొడుగు, తలపాగా వంటివి సిద్ధం చేసుకుని, కళ్లకు నల్లద్దాల కళ్లజోళ్లు (కూలింగ్ గ్లాసెస్) పెట్టుకుంటే వేసవి ప్రతాపం ఫిఫ్టీ పర్సెంట్ తక్కువగానే అనిపిస్తుంది. ఎన్ని సాధనాలతో బయటకు వెళ్లినా తట్టుకోలేని వేడిమి వున్న సమయంలో అసలు తిరగడం తగ్గించడమే అసలైన జాగ్రత్త. ఉదయం 10, 11 గంటలలోపు సాయంత్రం, 4, 5 గంటల తరువాత పనులు చేసుకోవటానికి బయలుదేరితే, మంచిది.



Click it and Unblock the Notifications
