Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
వేసవిలో మృధువైన పెదాల సంరక్షణ ఎలా...!?

మృదువుగా అందంగా ఉండే పెదాలు మంచి ఆరోగ్యానికి చిహ్నాలని చెప్పవచ్చు. పెదాలు తడిగా ఉండేందుకు అక్కడ నూనె గ్రంధులేవీ ఉండనందువల్ల అవి తరచు పొడిగా మారు తుంటాయి. వేసవిలో పెదాలకు తడి అందక చర్మం పొడిగా మారి చాలా చోట్ల పగుళ్లు ఏర్పడడం, చిట్లిపోవడం జరుగుతుంది. కాబట్టి పెదాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
1. పెదాలు చిట్లిపోతే తడిగా ఉండేందుకు నాలికతో తడి చేసుకోకూడదు. అలా చేయడం వల్ల తాత్కాలిక ఉపశమనం ఉంటుంది కాని తడి ఆరిన తర్వాత నొప్పి ఎక్కువ అవుతుంది.
2. వేసవిలో కనీసం రోజుకు పది గ్లాసుల నీరు తాగాలి. వేసవిలో మినరల్స్, విటమిన్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం, పెదాలు తడి ఆరకుండా సున్నితంగా తయారవుతాయి. వీటితో పాటు తాజా కూరగాయలు పండ్లు కూడా ప్రతి రోజూ ఆహారంలో ఉండేటట్లు చూసుకోవాలి.
3. చవకరకం లిప్‌స్టిక్స్ వాడకూదు. పెట్రోలియం జెల్లీని రాసుకోవాలి. విటమిన్ ఇ ఆయింట్‌మెంట్ రాసుకుంటే పెదాల పగుళ్లు మానుతాయి. వేజలైన్ చెంత వుంటే పెదాలకు భద్రత చేకూరినట్లే. ఖరీదైన ‘బామ్స్’ జోలికి పోనవసరం లేదు.
4. పెదాలు పగిలితే కర్పూరం, మెంధాల్ మిశ్రిత బామ్‌ను వాడాలి. దీని వాడకం కారణంగా బాధ ఉండదు.
5. కలబంద రసాన్ని పూయడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. కీరా ముక్కను పెదాలపై రాయడం వల్ల పెదాలు మృదువుగా ఉంటాయి.
6. రాత్రిళ్ళు పడుకునే ముందు పెదాలకు నెయ్యి రాయడం వల్ల ఉదయాని కంతా పెదాలు మృదువుగా, మెరుస్తూ కనిపిస్తాయి.
7. మార్కెట్‌లో దొరికే టీ బ్యాగును గోరువెచ్చని నీటిలో ముంచి పెదాలపై నాలుగైదు నిమిషాల సేపు ఉంచడం వల్ల పెదాలకు కావలసిన తేమ ఏర్పడి నిగారింపు వస్తుంది.
8. విటమిన్ ఎ, బి, సి, బీ2, ఇ లోపాల వల్ల కూడా పెదాలు చిట్లిపోతాయి. కాబట్టి ఈ విటమిన్లు దొరికే కూర గాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం మంచిది.
9. నాజూకైన బ్రష్ తో నెమ్మదిగా పెదాలపై గుండ్రంగా బ్రష్ చేయాలి. లిప్ స్టిక్ ను కవర్ చేస్తుండాలి. లిప్ లైనర్ ను వాడొచ్చు.
10. సూర్య రశ్మి నేరుగా చర్మం మీద, పెదాల మీద పడకుండా జాగ్రత్త పడాలి. అందుకోసం పెదాలకు లిప్ బామ్, లిప్ స్టిక్ వాడాలి. దాంతో డైరెక్ట్ సూర్య రశ్మినుండి పెదాలకు రక్షణ కల్పిస్తుంది.



Click it and Unblock the Notifications