Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
నిద్రించే ముందు తప్పనిసరిగా తెలుసుకోవాల్సినవి
సాధారణంగా నిద్ర లేవగానే పళ్ళను బ్రెష్ చేసి శుభ్రం చేసుకొంటాం.. ఎందుకంటే నిద్రించే సమయంలో కొన్ని అవయావాలు పనిచేయవు కాబట్టి నోట్లో క్రిములు ఏర్పడతాయని, రాత్రి తినేటప్పుడు పళ్ళ సందుల్లో ఏదైనా చిక్కుకొన్నా అది దుర్వాసనకు దారితీస్తుంది. కాబట్టి నిద్రకు ఉపక్రమించే ముందు, నిద్రలేచిన తర్వాత దంతాలను ఎలా సంరక్షించుకొంటామో అదే విధంగా చర్మ సౌందర్యాన్ని కేశ సౌందర్యాన్ని కూడా కాపాడుకోగలిగినప్పుడు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మానవ శరీరంలో దంతాలు, చర్మం, కేశాలు ప్రధాన పాత్రను పోషిస్తాయి కాబట్టి వాటి సంరక్షణ, భద్రత కూడా అవసరం.

కేశ సంరక్షణకు తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు:
1. డర్టీ హెయిర్ తో ఎప్పుడు కానీ నిద్రపోకూడదు. మాసిన జుట్టుతో అలాగే నిద్రించడం వల్ల తలలోని చర్మ రంద్రాలు దుమ్ము, ధూళితో ఇన్ఫెక్షన్, చుండ్రు వంటివి ఏర్పడటానికి అవకాశం కల్పించిన వారవుతారు. కాబట్టి హెయిర్ డర్టీగా ఉన్నప్పుడు రాత్రి పడుకొనే ముందు తప్పనిసరిగా తలస్నానం చేసి తల ఆరిన తర్వాత నిద్రకు ఉపక్రమించడం వల్ల కురుల సంరక్షణతో పాటు ఉదయం సమయం పొదుపు చేసుకోవచ్చు.
2. తలస్నానం చేసిన తర్వాత తడి జుట్టుతో నిద్రపోకూడదు. జుట్టు ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి.
3. తలస్నానం చేసిన తర్వాత తలను మంచి, శుభ్రమైన దువ్వెనతో తలను దువ్వడం వల్ల మెదడుకు వత్తడి తగిలి, కేశ కణాలకు రక్త ప్రసరణ బాగా అంది, నిద్ర బాగా పట్టేలా చేస్తాయి.
4. పడుకొనే ముందు జుట్టును టైట్ గా లేకుండా లూజుగా ఉండేలా చూసుకోవాలి. హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్పులను కేశాలను బందించకూడదు.
5. విటమిన్ ఇ, కేశ సౌందర్యానికి(చర్మానికి) బాగా ఉపయోగపడుతాయి. విటమిన్ ఇ టాబ్లెట్స్ ను కట్ చేసి లోపల ఉన్న పదార్థాన్ని తలలోని హెయిర్ సమస్య ఉన్న ప్రదేశంలో అప్లై చేసినట్లైతే.. హెయిర్ ఫాల్, పొడిజుట్టు, జుట్టు పలుచబడటం, చివర్లు చిట్లడం వంటి అన్ని సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది.
ముఖం:
1. క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్ మరియు సన్ ప్రొటెక్షన్ ఈ మూడు గోల్డెన్ పదాలు.. చర్మ సౌందర్యాన్ని కాపాడటంలో అత్యధికంగా ఉపయోగపడుతాయి.
2. క్లెన్సింగ్ లోషన్ తో ముఖాన్ని శుభ్రం చేసి మేకప్ ను పూర్తిగా తొలగించాలి.
3. మంచి మేలైన ఫేష్ వాష్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
4. మీ చర్మ తత్వాన్ని బట్టి యాంటీఆక్సిండెట్స్ కలిగినటువంటి మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మ నునుపుగా మారి మీరు యవ్వనంగా కనబడేలా చేస్తుంది.
5. ఇండియన్ క్లైమట్ ప్రకారం, చర్మం పొడబారేలా చేస్తుంది కాబట్టి సన్ టాన్ నుండి బయట పడాలంటే స్కిన్ లైటనింగ్ ఏజెంట్ ను అప్లై చేయాలి.
కళ్ళు:
కళ్ళు చుట్టు నల్లటి వలయాలు, గీతలు ఏర్పడి కళ్ళు నిర్జీవంగా కనబడుతుంటే స్లైట్లీ స్ట్రాంగర్ యాంటీ ఏజింగ్ క్రీమ్ ను కళ్ళ చుట్టు అప్లై చేయాలి.
చేతులు మరియు కాళ్ళు:
కాళ్ళు, చేతుల మీదు నూనె గ్రంధులు లేకపోవడం చేత అవి ఎప్పుడు పొడిబారి ఉండి, వయస్సు పైబడిన వారిలా కనబడేలా చేస్తాయి. చాలా మంది ముఖానికి, జుట్టుకు ఇచ్చినంత ప్రిఫరెన్స్ కాళ్ళకు, చేతులకు ఇవ్వరు. కాబట్టి క్రీమ్ ప్రొడక్ట్స్ (ఆల్ట్రా హైడ్రాక్స్ ఆసిడ్స్ )తో తయారు చేసినటువంటి క్రీమ్ లను ఉపయోగించడం మంచిది.



Click it and Unblock the Notifications
