Latest Updates
-
ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు.. ఇలా చేస్తే పర్ఫెక్ట్ గా వస్తాయి..నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతూ అమృతమే! -
పండిన అరటిపండ్లతో సింపుల్ అండ్ సూపర్ స్వీట్..హెల్తీ బనానా బర్ఫీ ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి రుచిగా, ఒంటికి చల్లగా..అన్నం, ఇడ్లీ, దోశ దేనిలోకైనా అదిరిపోయే కీర దోసకాయ పచ్చడి..ఎలా చేసుకోవాలంటే.. -
వంకాయ ఇష్టం లేని వాళ్లు కూడా లొట్టలేసుకుంటూ తినే కర్ణాటక ఫేమస్ వాంగీ బాత్..ఇంట్లోనే చేసుకోండిలా! -
భర్తలకు తెలియకుండా..సీక్రెట్ డేటింగ్ యాప్ లోకి క్యూ కడుతున్న మహిళలు..హైదరాబాద్ లోనే.. -
నెయ్యి తాలింపు,జీడిపప్పుల క్రంచ్..స్వర్గాన్ని తలపించే జొన్న పిండి ఉప్మా..టేస్ట్ వేరే లెవెల్ అంతే! -
ఘుమఘుమలాడే దోసకాయ మటన్..వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే ఆహా స్వర్గమే! -
రోజూ 10 వేల అడుగులు పూర్తి చేయాలంటే ఎన్ని కిలోమీటర్లు నడవాలి? ఎన్ని కేలరీలు కరుగుతాయి? -
వేడి వేడి అన్నంలోకి అమృతం లాంటి ధనియాల రసం.. ఇలా చేస్తే గిన్నెలు గిన్నెలు తాగేస్తారు! -
స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ ఇంట్లోనే..ఎలాంటి సాస్ లు లేకుండానే అదిరిపోయే వెల్లుల్లి కారం ఎగ్ ఫ్రైడ్ రైస్..
శరీరానికి డిటాక్స్ చేయడంతో సూపర్ గ్లో...
అందంగా అలంకరిచుకోవడం అంటే శరీరంలో అన్నీ బాగాలపై శ్రద్ద పెట్టి ప్రత్యేకంగా కనిపించేలా చేయడమే. శరీరం ఆరోగ్యంగా ఉంటే అంతకంటే అందం మరొకటి ఉండదు. ఎందుకంటే మనుషి అందంగా కనబడాలంటే చర్మం ఆరోగ్యంగా ఉండాలి. అందం అనేది బయటకు కనిపించేది మాత్రమే కాదు. లోపల ఆరోగ్యంతో కూడా ముడిపడి ఉంటుంది. సాధారణ స్నానం కన్నా సబ్బులతో రుద్దిన దానికన్నా ... డిటాక్స్ ట్రీట్ మెంట్ తో చర్మం ఎంతో పరిశుభ్రపడుతుంది. స్కిన్ పార్స్ ఓపెన్ అయ్యి డీప్ గా లోపల ఉన్న మురికిని, టాక్సిన్స్ కు బయటకు పంపుతుంది. చర్మంపై ఉండే dead cells కూడా తొలగించబడతాయి. డిటాక్స్ కారణంగా ఉత్పన్నమయ్యే వేడిమి... కండరాల నొప్పుల్ని ... తగ్గిస్తుంది.'డిటాక్స్' ఫలితంగా శరీరంలో హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. చర్మాన్ని పరిశుభ్రపరుస్తుంది. చర్మానికి మంచి గ్లో ఇస్తుంది. చెమట ద్వారా ఎన్నో టాక్సిన్స్ ను బయటకు పంపుతుంది. చర్మం మంచి మృధుత్వాన్ని పొందుతుంది. మొటిమలు, మచ్చలు రాకుండా రక్షిస్తుంది.

క్లెన్సింగ్
క్లెన్సింగ్ కూడా చర్మ సంరక్షణలో ఒక ప్రధానమైన చర్య. క్లెన్సింగ్ అప్లై చేసి ఒక నిముషంపాటు వదిలేసి తరువాత శుభ్రపరచుకుంటే దుమ్ము, ధూళి అంతా పోయి చర్మం ఎలాంటి ముడుతలూ లేకుండా తాజా పండులా తయారవుతుంది. మేకప్‌కు కూడా ఎంతో సహకరిస్తుంది.

బాడీ బ్రష్
పొడి బారిన శరీరాన్ని(చర్మాన్ని) బ్రష్ తో రుద్దడం(తోమడం) వల్ల, చర్మంలో ఉన్న మృత కణాలను తొలగించి, చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. ఇలా బాడీ బ్రష్ చేయడం వల్ల శరీరంలోని అన్ని బాగాలకు రక్త ప్రసరణ జరిగి, శోషరస వ్యవస్థ బాగా మెరుగుపడుతుంది.

క్లే(మట్టితో) ప్యాక్
మట్టిని రకరకాల సౌందర్య చికిత్సల్లో వాడటం కొందరికి మాత్రమే తెలుసు. దీనివల్ల చర్మం నునుపు తేలి, మృదువుగా మారుతుంది. చర్మంపై మచ్చల్లాంటివి తగ్గి.. మంచి రంగు రావాలంటే.. ఈ క్లేలకు అదనంగా మరికొన్ని పదార్థాలు కలిపి చికిత్స తీసుకోవాలి.

యాపిల్ సైడర్ వెనిగర్
మనం తినే ఆహారం పైనే అందం ఆధారపడి వుంటుంది. మంచి పోషకాహారాలు తీసుకోవడం వల్ల చర్మం అందంగా, ఆరోగ్యంగా కన్పిస్తుంది. ఇందులో రోగనిర్మూలన శక్తి అధికంగా వుంటుంది.

స్ర్కబ్బింగ్
ఒకప్పటి కాలంలో ప్రతివారం సున్నిపిండితో శరీరానికి నలుగు పెట్టి చక్కగా తలంటి పోసుకునేవారు.ఆ సమయంలో స్క్రబ్ గా సున్నిపిండి ఉపయోగపడేది.
క్లెన్సింగ్: క్లెన్సింగ్ కూడా చర్మ సంరక్షణలో ఒక ప్రధానమైన చర్య. క్లెన్సింగ్ అప్లై చేసి ఒక నిముషంపాటు వదిలేసి తరువాత శుభ్రపరచుకుంటే దుమ్ము, ధూళి అంతా పోయి చర్మం ఎలాంటి ముడుతలూ లేకుండా తాజా పండులా తయారవుతుంది. మేకప్‌కు కూడా ఎంతో సహకరిస్తుంది. చర్మాన్ని మృదువుగా ఉంచేందుకు, కాంతివంతంగా చేసేందుకు క్లెన్సింగ్ ఫేస్ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది. ఇది సున్నితంగా చర్మాన్ని శుభ్రపరచి స్వచ్ఛంగా, అందంగా ఉండేలా చేస్తుంది. ఈ ఫోమింగ్ ఫేషియల్ వాష్ ప్రభావంతంగా పనిచేసి అన్ని రకాల కాలుష్యాలను తొలగిస్తుంది. చర్మానికి ఎటువంటి నష్టం కలగనీయకుండా అన్నిరకాల చర్మతత్వాలకూ ఉపకరిస్తుంది. నిమ్మరసం, గ్లిజరిన్ సమపాళ్లలో కలుపుకోవాలి. ఈ క్రీమ్‌ను వేళ్లతో అద్దుకుని ముఖానికి రాసుకోవాలి. జిడ్డు చర్మం ఉన్నవారికి ఇది మంచి క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ముఖానికి ఏదైనా క్లెన్సింగ్ ఫేస్ ప్యాక్ వేసిన, శుభ్రపరిచిన తర్వాత ఎటువంటి క్రీములను ఉపయోగించకూడదు.
బాడీ బ్రష్: పొడి బారిన శరీరాన్ని(చర్మాన్ని) బ్రష్ తో రుద్దడం(తోమడం) వల్ల, చర్మంలో ఉన్న మృత కణాలను తొలగించి, చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. ఇలా బాడీ బ్రష్ చేయడం వల్ల శరీరంలోని అన్ని బాగాలకు రక్త ప్రసరణ జరిగి, శోషరస వ్యవస్థ బాగా మెరుగుపడుతుంది. దాంతో మళ్ళీ శరీరంలోని మలినాల్ని బయటకు విడదుల చేయడాన్ని ప్రారంభిస్తుంది. శరీరంలోని మలినం ఎప్పుడుతే చమట, మూత్ర విసర్జన రూపంలో బయటకు విసర్జించ బడుతాయో అప్పుడు చర్మ రంద్రాలు తెరచుకొని, చర్మంలోని మృతకణాలను తొలగింస్తుంది. దాంతో చర్మం కాంతివంతంగా మారుతుంది.
క్లే(మట్టితో) ప్యాక్: మట్టిని రకరకాల సౌందర్య చికిత్సల్లో వాడటం కొందరికి మాత్రమే తెలుసు. దీనివల్ల చర్మం నునుపు తేలి, మృదువుగా మారుతుంది. చర్మంపై మచ్చల్లాంటివి తగ్గి.. మంచి రంగు రావాలంటే.. ఈ క్లేలకు అదనంగా మరికొన్ని పదార్థాలు కలిపి చికిత్స తీసుకోవాలి. దీనివల్ల జిడ్డు సమస్య అదుపులో ఉంటుంది. ముడతలు మాయమవుతాయి. చర్మం బిగుతుగా మారుతుంది. ఇలాంటి ప్యాక్‌లు వేసుకున్న తరవాత పదిహేను నిమిషాలకు కచ్చితంగా తొలగించాలి. ఈ చికిత్స తీసుకుంటున్నప్పుడు నవ్వటం, మాట్లాడటం లాంటి కదలికలు ముఖంలో ఉండకూడదు. పూతకోసం వాడే మట్టి ముల్తానీ, చైనా క్లే, వండర్ మట్టి, గ్రీన్ క్లే, బ్లాక్ క్లే.. వంటి రకాల్లో దొరుకుతుంది. చర్మతత్వాన్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది.
యాపిల్ సైడర్ వెనిగర్: మనం తినే ఆహారం పైనే అందం ఆధారపడి వుంటుంది. మంచి పోషకాహారాలు తీసుకోవడం వల్ల చర్మం అందంగా, ఆరోగ్యంగా కన్పిస్తుంది. ఇందులో రోగనిర్మూలన శక్తి అధికంగా వుంటుంది. అదీ కాకుండా ఇందులోని సైడర్ వెనిగర్ చర్మాన్ని మృదువుగా, ముడతలు పడనీకుండా వుంచుతుంది. మృతకణాలను నిర్మూలించే ఎంజైమ్స్ యాపిల్‌లో అధికంగా వుంటాయి. దీనిలో కొవ్వును కరిగించే శక్తి వుంది. ఆహారాన్ని తేలికగా జీర్ణింపజేస్తుంది. ఒక బకెట్ వేడినీటిలో ఒక కప్పు యాపిల్ సైడర్ వెనిగర్ ను మిక్స్ చేసి స్నానం చేస్తే చర్మంలోని మృతకణాలను పోగొట్టి కాంతివంతం చేస్తుంది. దీన్ని వారానికి రెండు మూడు సార్లు ఇలా చేయొచ్చు. దాంతో ముఖంలో ఉన్న మొటిమలు, ముడుతులను పొగొడుతుంది.
స్ర్కబ్బింగ్: ఒకప్పటి కాలంలో ప్రతివారం సున్నిపిండితో శరీరానికి నలుగు పెట్టి చక్కగా తలంటి పోసుకునేవారు.ఆ సమయంలో స్క్రబ్ గా సున్నిపిండి ఉపయోగపడేది. ఇప్పుడు ఎవరికీ అంత సమయం లేకపోవడం వల్ల బ్యూటీపార్లర్ల మీదనో లేక మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్పత్తుల మీదనో ఆధారడుతున్నారు. చక్కెర, ఉప్పు, తవుడు, జోజోబా మొలకలు, కాఫీ గింజల పొడి వంటివన్నీ కూడా చర్మంపై ఉన్న మృత కణాలను తొలగిస్తాయి. దీనితో చర్మం మృదువుగా, యవ్వనవంతంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.సాధారణంగా చర్మం పై పొర మృతకణాలకు వేదికగా ఉంటుంది. అయితే వారానికి ఒకసారో, రెండుసార్లో స్క్రబ్‌ను ఉపయోగించడం వల్ల అవి తొలగిపోయి చర్మం ఆరోగ్యంగా కనుపిస్తుంది. స్క్రబ్ చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగడమే కాదు సెల్యులైట్‌ను తగ్గించి, చర్మ రంధ్రాలను శుభ్ర పరచడమే కాకుండా పెచ్చులు లేకుండా చేస్తుంది. ఒకమాటలో చెప్పాలంటే స్క్రబ్ చర్మాన్ని పునరుజ్జీవింపచేస్తుంది.



Click it and Unblock the Notifications











