Latest Updates
-
ఇడ్లీ, దోశెలను వదలనివ్వని అద్భుతమైన మదురై స్పెషల్ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
చలికాలంలో ఈ సాంబార్ చేసుకుంటే..జలుబు, తలనొప్పి అన్నీ పరార్! -
కోట్ల ఆస్తి, డ్రైవర్ తో ఎఫైర్.. ప్రియుడి మోజులో కన్నకొడుకునే బలిచ్చిన తల్లి.. -
బజార్ స్వీట్లు ఇక ఆపేయండి.. సొరకాయతో అద్భుతమైన కలకండ్ ఇలా చేసుకోండి.. -
చలికాలంలో గొంతు నొప్పి, గరగర వేధిస్తున్నాయా? వంటింట్లో దొరికే ఈ పదార్థాలతో చిటికెలో రిలీఫ్.. -
100 ఏళ్లు గుర్తుండిపోయే పచ్చిమిర్చి పచ్చడి..ఎందులోకి అయినా అమృతమే! -
ఖాళీ స్వీట్ బాక్సులు పారేస్తున్నారా?.. ఈ ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు! -
హోటల్ స్టైల్ పూరీ మసాలా ఇంట్లోనే.. ఈ సీక్రెట్ టిప్స్ తో చేసి చూడండి! -
నెల రోజులు నిల్వ ఉండే ఆరోగ్యకరమైన మరమరాల లడ్డు..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోరూరించే రుచి, ఆరోగ్యానికి మేలు..క్రీమీ పనీర్ నూడుల్స్ ఒక్కసారి రుచి చూశారంటే రోజూ ఇదే కావాలంటారు..
శరీరంపై వెంట్రుకల ఎదుగుదల అరికట్టటం ఎలా?

మేము సూచించే పద్ధతులన్ని మీ శరీర వెంట్రుకల ఎదుగుదలను తక్కువ చేస్తాయి. మీ సెలూన్ ట్రిప్పులను తగ్గిస్తాయి. మరి అవేమిటో పరిశీలించండి.
శరీర వెంట్రుకల ఎదుగుదల నిదానించేందుకు మార్గాలు
1. షేవ్ చేయటం ఆపండి - ముందుగా మీ శరీర వెంట్రుకలను తీయటానికి రేజర్ ఉపయోగించకండి. రేజర్ ఉపయోగిస్తే, మరింత వేగంగా పెరిగిపోతాయి. రెండు లేదా మూడు సార్లు రేజర్ తో షేవ్ చేస్తే చాలు మీరొక ఎలుగుబంటి అయిపోతారు. ఒక సారి ఈ పరిస్ధితి వస్తే, ఇక మీరు ఎపుడూ రేజర్ వేసి చేయాల్సిందే. కనుక రేజర్ ఉపయోగించకండి.
2. ట్వీజర్లు వాడండి - ట్వీజర్ తో ప్రతి వెంట్రుక కత్తిరించటం చాలా కష్టం. కాని ట్వీజర్ వెంట్రుకను కుదుళ్ళతో సహా పీకేస్తుంది. 4 నుండి 6 వారాల వరకు మరల వెంట్రుక రాకుండా చేస్తుంది. ఫేషియల్ వెంట్రుకలకు బాగా పనిచేసినప్పటికి ఛాతీ భాగాల వెంట్రుకలకు ఇది సరికాకపోవచ్చు.
3. వ్యాక్సింగ్ - వ్యాక్స్ చేయటం వెంట్రుకల ఎదుగుదల పూర్తిగా ఆపలేదు కాని కొంత కాలం చేస్తే వాటి ఎదుగుదల ఆపగలదు. వెంట్రుకలు బాగా ఏర్పడిన తర్వాత వ్యాక్సింగ్ సూచించదగినది. వెంట్రుకలన్నీ ఒకే సారి ఊడి వస్తాయి.
4. సోయా తినండి - శరీరంపై వెంట్రుకలు టెస్టోస్టిరోన్ అనే పురుష హార్మోన్ అధికం అవటం వల్ల వస్తాయి. ఈ హార్మోన్ మహిళలలో కూడా కొద్దిపాటిగా వుంటుంది. అందుకనే మహిళలకు సైతం ఛాతీ వంటి భాగాల్లో వెంట్రుకలు వస్తాయి. సోయా ఉత్పత్తి మీలోని అంటే మహిళలోని ఈస్ట్రోజన్ పెంచుతుంది పురుష హార్మోన్ ను అణచి వేస్తుంది. సోయా బీన్, పాలు, ఇతరసోయా ఉత్పత్తులు తినటం ఈ అంశంలో బాగా సహకరిస్తుంది.
5. కండలు నిర్మించండి - మహిళలకు సోయా వలెనే పురుషులు తమ కండలను నిర్మించుకొని శరీర భాగ వెంట్రుకలను నిర్మూలించవచ్చు. పొట్ట వ్యాయామాలు శరీర కండలు వీటిని సహజంగా అరికడతాయి. కండలు నిర్మిస్తే, చర్మం సాగుతుంది అది వెంట్రుకల దట్టాన్ని అరికడతాయి.
6. వెంట్రుకల ఎదుగుదలను అరికట్టే లోషన్లు - కాస్మెటిక్ లేదా ఫార్మస్యూటికల్ కంపెనీలు శరీర వెంట్రుకలను నిలుపు చేయటానికి ఎన్నో లోషన్లను తయారు చేస్తున్నాయి. ఈ లోషన్లు ప్రధానంగా సోయా పదార్ధాలు కలిగి వుంటాయి. వీటిని కొనేటపుడు ప్యాక్ పై మీ శరీరానికిఅలర్జీ కలిగించే పదార్ధాలు అందులో ఏవైనా వున్నాయా అనేది పరిశీలించండి.
పైన చెప్పిన ఈ పద్ధతులు, శరీరంపై వెంట్రుకల ఎదుగుదలను తగ్గిస్తాయి. కాని పూర్తిగా తొలగించలేవు. మరి మీకు పూర్తిగా తొలగిపోవాలంటే, ఖరీదైన శాశ్వత ఎలక్ట్రోలిసిస్ లేదా లేజర్ ట్రీట్ మెంట్ చేయించుకొని శరీర వెంట్రుకల ఎదుగుదల అరికట్టవచ్చు.



Click it and Unblock the Notifications
