Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
మంచి ఆరోగ్యానికి...మంచి దినచర్య...!

ఉదయాన్నే టిఫిన్ చేసే సమయంలో స్నాక్స్, కాఫీ, టీ, పాలు, జ్యూస్ వంటిపలు రకాల పదార్ధాలు తీసుకుంటారు చాలామంది. అవి తాగిన తర్వాత టిఫిన్ సరిగ్గా తీసుకోలేకపోతారు. ఇలా ఏవో ఒకటి తాగేసి అల్పాహారం సరిగ్గా తినకపోవడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులంటున్నారు. చాలామంది ఉద్యోగినులు ఉదయాన్నే 8 నుండి 9.30 గంటల లోపు అల్పాహారం తీసుకుంటారు. దానికి ముందు పాలు, టీ, బ్రెడ్, స్నాక్స్ వంటివి కూడా తింటారు. ముందుగా తిన్నవి జీర్ణమవ్వ మరలా వెంటనే టిఫిన్ చెయ్యడం వలన సరిపడి నంతగా తీసుకోలేరు. దాంతో మధ్యాహ్నం వరకూ పనిచేసే శక్తి ఉండదు.
ఏదైనా తిన్నా, తాగినా గంట తర్వాతే టిఫిన్ తీసుకోవాలి. లేదా అల్పాహారంతిన్న తర్వాత మిగతావాటికి ప్రాధాన్యత నివ్వాలి. అన్నీ ఒకేసారి తీసుకొని మధ్యాహ్నం వరకూ ఏమీ తిన కుండా ఉంటే గ్యాస్టిక్ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఉదయాన్నే టిఫిన్ చేసిన తర్వాత ఆఫీసుకు డ్రైనట్స్, స్నా క్స్, బ్రెడ్ లాంటివి తీసుకొని వెళ్లండి. లంచ్ తీసుకొనే లోపు మీరు తీసుకెళ్లిన వాటిని తినండి. ఖర్చు అవుతున్న కేలరీలకు తగ్గట్టుగా తిరిగి శక్తిని పొందగలుగుతారు. ముఖ్యంగా పాలు, కాఫీ తాగిన వెంటనే టిఫిన్ చెయ్యకూడదు. అలాగే టిఫెన్ చేసిన వెంటనే వాటిని తాగకూడదు. మద్యలో గంట సమయాన్నయినా తీసుకోవాలి.
త్వరగా అరిగే ఇడ్లి, ఉప్మా లాంటిలి తీసుకున్నప్పుడు అరగంట తర్వాత ఏమన్నా తిన్నా, తాగినా పర్వాలేదు. నిద్రలేవగానే ఒక్కోసారి బయటికి వెళ్లాల్సివస్తే వెంటనే టిఫిన్ చేయకుండా ప్రయాణంలో తీసుకొనే ప్రయత్నం చేయండి. ప్రతిరోజూ ఒకే సమయానికి అల్పాహారం చేసే ప్రయత్నం చేయండి. దీని వలన మీ జీర్ణవ్యవస్థ సక్రమంగా, క్రమబద్ధంగా పనిచేస్తుంది.ఈ చిట్కాలు పాటిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. జీర్ణ సంబంధ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.



Click it and Unblock the Notifications
