Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
పురుషుల కోసం శరీర హెయిర్ రిమూవల్ టెక్నిక్స్
ఒకప్పుడు వెంట్రుకలు తొలగించుకోవటం అన్నది ఆడవారికి మాత్రమే అని అనేవారు. మగవారు ఒక స్విమ్మర్, అథ్లెట్ లేదా ఒక శరీరం బిల్డర్ అయిఉంటే తప్ప వారి శరీరం మీద ఉన్న వెంట్రుకలను ముట్టుకునేవారు కాదు. ఇక అలా కాదు.
చాలామంది పురుషులు మహిళల వలె మృదువైన, జుట్టు లేని శరీరం పొందాలని కోరుకుంటారు. మగవారు అది ఒక అవసరంగా పూర్తిగా వెంట్రుకలను తొలగించాలని అనుకోరు, కాని వారు వారి ఛాతీ, వెనకాల మరియు అంగాల పైన వెంట్రుకలు పలుచగా ఉండాలని తప్పనిసరిగా కోరుకుంటారు.
అందులో మీరు ఒకరైతే, సాధారణంగా ఆరు వెంట్రుకలను తొలగించే పద్ధతులను ఇక్కడ పొందుపరుస్తున్నాము.
తాత్కాలిక పద్ధతులు

వాక్సింగ్ లేదా సుగరింగ్
వెంట్రుకలు తొలగించుకోవటం అంటే వెంటనే వాక్సింగ్ గురించి ఆలోచిస్తారు. దీనిగురించి ఆలోచించగానే నొప్పి గురించి ఆలోచిస్తారు. అవును,వాక్సింగ్ అంటే మెత్తగా ఉండదు కాని భరించలేనిది మాత్రం కాదు. ఏదిఏమైనా, ఇది మూలం నుండి జుట్టు తొలగించబడే అత్యంత ప్రభావవంతమైన పద్ధతులలో ఒకటి. వేడిగా ఉన్న మైనాన్ని మొదట వెంట్రుకలు ఉన్న ప్రదేశంలో పూస్తారు మరియు దానిపైన ఒక గుడ్డముక్కతో రుద్దుతారు మరియు ఒక్క లాగుతో ఆ ముక్కను లాగేస్తారు. ఈ పద్ధతిలాగానే సుగరింగ్ కూడా చేస్తారు. ఇందులో చక్కేరపాకం ఉపయోగిస్తారు. ఈ పాకం, పంచదార,నిమ్మరసం,నీరు మరియు సిట్రిక్ ఆసిడ్ వంటివాటితో తయారుఅవుతుంది. ఇలానే క్రమంగా చేస్తూ ఉంటే, కొన్నిరోజులకు వెంట్రుకలు పలుచగా ఉంటాయి,అలానే కుదుళ్ళు కూడా బలహీనంగా తయారవుతాయి.

షేవింగ్
ఎక్కువగా పురుషులు షేవింగ్ క్రమంతప్పకుండా చేసుకుంటుంటారు లేదా వారియొక్క జేవితాంలో ఎదోఒకరోజు చేసుకుంటారు. శరీర వెంట్రుకలు తొలగించుకోవటానికి షేవింగ్ పధ్ధతి చాలా సులభమైన మరియు అందుబాటులో ఉన్న మార్గం. ఈ షేవింగ్ పద్ధతి వలన శరీరంలోని ఏ ప్రాంతంలో అయినా చేసుకోవొచ్చు, దీనికి కావలసిందల్లా ఒక చిన్న రేజరు మరియు షేవింగ్ క్రీం. ఈ పధ్ధతిని చాలా జాగ్రత్తగా చేయాలి. మొదట ఎక్కడ షేవింగ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్రాంతాన్ని నులివెచ్చని నీటితో తడపండి. ఇలా చేయటం వలన సూక్ష్మరంధ్రాలు తెరిచేందుకు మరియు జుట్టు ఫోలికల్స్ పెంచడానికి సహాయపడుతుంది. ఒక మంచి నాణ్యత రేజర్ మరియు షేవింగ్ ఫోమ్ ను ఉపయోగించి, జుట్టు పెరుగుతున్న దిశలోనే షేవింగ్ చేయండి.

ఎలక్ట్రికల్ ట్రిమ్మింగ్
దీనిని ఉపయోగించి శరీర వెంట్రుకలను అతిసూక్ష్మంగా కూడా నిర్వహించుకోవొచ్చు మరియు శరీర వెంట్రుకలు తొలగించుకోవతంలో ఎవరైతే ప్రారంభదశలో ఉన్నారో,వారికి ఈ ఎలక్ట్రికల్ ట్రిమ్మింగ్ చాలా సరిఅయిన పధ్ధతి. అన్నిటికన్నా ఈ పధ్ధతి చాలా సురక్షితం, ఇరిటేషన్ కలుగదు, రేజర్ లాగా కాదు మరియు మీకు యెంత పొడవు వెంట్రుకలు కావాలనుకుంటారో అంతే పొడవే నిర్వహించుకోగలరు. అయితే, దీనివలన పూర్తిగా వెంట్రుకలు తీసివేయబడి, సున్నితంగా ఉండదు. సున్నితమైన చర్మం ఉన్నవారికి ఈ పధ్ధతి చాలా అనుకూలంగా ఉంటుంది.

హెయిర్ తొలగించే క్రీములు
వీటిని డేపిలటోరీస్ అని కూడా అంటారు, శరీరంపైన ఉన్న అదనపు వెంట్రుకలను నొప్పిలేకుండా ఈ పధ్ధతి ద్వారా తొలగించవొచ్చు. ఏ ప్రాంతంలో వెంట్రుకలు తొలగించాలని అనుకుంటారో, అక్కడ ఈ క్రీం ను రాయండి. ఇలా రాసినందువలన జుట్టు పోగు యొక్క ప్రోటీన్ నిర్మాణం కరిగి, తద్వారా నిర్మూలించడం సులభం అవుతుంది. అయితే, ఈ రకాల కొన్ని ఉత్పత్తులు మీ చర్మంపై కొద్దిగా కఠినమైనవిగా ఉంటాయి మరియు చిక్కని, మందమైన జుట్టు మీద ఎక్కువ పనిచేయవు. ఒక్క సలహా-కరపత్రం అందించిన అన్ని సూచనలను అనుసరించండి మరియు ముందుగా వీటివలన ఏమైన ప్రతిచర్యలు జరుగుతాయా అని తెలుసుకునేందుకు, చర్మంపై ఒక చిన్న ప్రాంతంలో ఒక ప్యాచ్ టెస్ట్ చేసుకోండి.
శాశ్వత పద్ధతులు

లేజర్ జుట్టు-తొలగింపు
FDA ఆమోదం పొందిన ఈ లేజర్ చికిత్సలో లేజర్ కిరణం పంపటం ద్వారా జుట్టు గ్రంధితిత్తి జీవాణువులు వేడెక్కి మరియు నిద్రాణ స్థితిలో ఉండి పెరుగుదల ఉండదు. ఫలితాలు మీ చర్మం రంగు మరియు మీ జుట్టు రంగు మీద ఆధారపడి ఉంటుంది, కాబట్టి మీరు ఈ పద్ధతికి సరిపడతారో లేదో చూసుకోండి.ఈ లేజర్ చికిత్స ద్వారా జుట్టుయొక్క పరిమాణం మరియు నాణ్యతకు శాశ్వత తగ్గింపు అందిస్తుంది మరియు ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. అందుకే దీనిని అన్ని జుట్టు తొలగింపు పద్ధతులకు తల్లివంటిది అని చెపుతారు.
అందువలన, మీరు శాశ్వతంగా ఏ ప్రదేశంలో వెంట్రుకలను తొలగించుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోండి, మిగతా శరీరంలో ఇతర ప్రదేశాలకు వాక్సింగ్ ఉపయోగించుకోవొచ్చు.

ఎలక్ట్రాలసిస్
ఒక ఆల్ట్రా-స్లిమ్ సూదిని ప్రతి ఒక్కొక్క జుట్టు షాఫ్ట్లో చొప్పింఛి, జుట్టు గ్రంధితిత్తి జీవాణువులలో విద్యుత్తును పంపి అవరోధాలు అందించటంవలన, జుట్టు పెరగడానికి సహాయపడే కణాలు చంపడం ఈ పధ్ధతి ద్వారా చేస్తారు. ఒకసారి,ఈ కణాలు వెళ్లిపోయాయి అంటే, తిరిగి అవి పెరగవు. ఇది శాశ్వత ఫలితాలు అందిస్తుంది, కానీ ఒక వ్యక్తికీ, ఇంకొక వ్యక్తికీ ఎటువంటి హామీ ఉండదు మరియు ప్రభావం కూడా మారుతుంది. ఎక్కువగా శరీరంలో వెంట్రుకలు తొలగించే భాగాలు,కనుబొమ్మలు,మెడ వెనుకభాగం మరియు శరీరంపై చెదురుమదురుగా ఉండే వెంట్రుకలు. ఈ పధ్ధతి వలన వెంట్రుకలు తొలగించటానికి చాలా సమయం తీసుకుంటుంది మరియు చాలా ఖర్చుతో కూడుకున్నది. దీనివలన శరీరంపై వెంట్రుకలు పూర్తిగా తొలగించటానికి కనీసం ఒక సంవత్సరం పట్టవొచ్చు.
ఏ పధ్ధతి మీకు సరిపడుతుందో చూసుకొని, దానికి అనుగుణంగా అనుసరించండి.



Click it and Unblock the Notifications











