Latest Updates
-
ఆర్థరైటిస్ పేషెంట్లకు అలర్ట్.. ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా.? -
నేటి రాత్రి ఆకాశంలో అద్భుతం.. శుక్రుడి సంచారంతో ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది! -
జూన్ 19 నుంచి ధన రాజయోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
పొగాకు నమిలితే క్యాన్సర్, గుండెపోటు మాత్రమే కాదు.. మరో ప్రమాదం ఉందని తెలుసా.? -
ఎక్కువ కాలం బతకాలా? ఈ వ్యాయామాలు చేస్తే మరణ ప్రమాదం తగ్గుతుంది.. -
విజయవాడ కనక దుర్గమ్మ తల్లి ఆ కొండపై ఎందుకు కూర్చుంది? అసలు కథ -
ధాబా స్టైల్ టీ ఇంట్లోనే కావాలా? అయితే ఈ 3 సీక్రెట్ మసాలాలు వాడాల్సిందే! -
జూన్ 18, 2026: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధన లాభం, కెరీర్లో సంచలనం! -
కర్కాటక, సింహ, ధనస్సు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. మీ అదృష్టం ఎలా ఉంది? - గురువారం, 18 జూన్ 2026 -
ఇకపై గోవా వెళ్లక్కర్లేదు బాస్..మన ఏపీ బీచ్ ల్లోనే ఆ అదిరిపోయే లైఫ్..జీవో జారీ
బ్యూటిఫుల్ స్కిన్ &హెయిర్ కు ఎగ్ ఎలా ఉపయోగించాలి
ప్రపంచంలోని ప్రతీ ఒక్కరు, తమ చర్మ సౌందర్యం కోసం, జుట్టు సం రక్షణ కోసం ఎంతగానో అలోచిస్తారు. అయితే మీరు కూడా మీ జుట్టు పొడవుగా, అందంగా,ఉండాలని కోరుకుంటు న్నారా, లేదా, మృదువైన చర్మం కోసం ఏమిచేయాలి అని సతమతమవుతున్నారా, అయితే తక్కువ ఖర్చుతో మీ ఇంట్లోనే మీ ప్రశ్నలకు సమాధానం లబిస్తుంది. అది ఏమిటంటే,
ఈ ప్రశ్నలన్నింటికి కోడి గుడ్డ్లు చెప్పే చిట్కాలు చూద్దామ.
కోడి గుడ్డ్లలోని "లూటిన్" మీ చర్మాన్ని "ఎలాస్టిక్" గా చేయడానికి, మరియు "హైడ్రేట్" చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇవి మీ చర్మ కణాలని సుద్దిచేసి, మీ చర్మాన్ని గట్టిగా చేస్తాయి. అంతేకాకుండా మీ జుట్టుకి బలంతో పాటు , మెరుపుని ఇస్తాయి. వీటిలోని "ప్రొటీన్లు" మనలోని జుట్టు మరియు గోళ్ళు పెరుగుటలో ఎంతో సహాయ పడతాయి. మీరు అందమైన చర్మం, సహజమైన జుట్టు పొందాలంటే, మీరు రోజూ తినే ఆహారంలో కోడి గుడ్డుని కూడా కలిపి తీసుకోండి. మీ అందం పైన, మీ జుట్టు పైన మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.
మీ చర్మ సౌందర్యం కోసం కోడి గుడ్డ్లు వాటి ప్రయోజనాలు.

మీ మెరుగైన చర్మం కోసం:
ఒక గుడ్డు తీసుకుని,దానిలోని సోనని ముఖానికి పట్టించి అది గట్టి పడిన తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే, చర్మం గట్టిపడడమే కాకుండా, మంచి కాంతివంతముగా మెరుస్తుంది.
మీ చర్మం యొక్క గట్టిదనం కోసం:
ఒక గుడ్డు తీసుకుని, దానిలోని పచ్చ సొన, తెల్ల సొన రెండింటిని వేరు చేసి,తెల్లసొనని ఒక గిన్నెలో బాగా కలిపి ముఖానికి పట్టించాలి, అది గట్టి పడిన తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే అది మన చర్మ కణాలని గట్టి పరచడమే కాకుండా, మొటిమలును తగ్గించేందుకు సహాయపడుతుంది
కళ్ళ కింద సహజత్వం కోల్పోయిన, లేదా ఉబ్బిన చర్మం కోసం:
మీరు మీ కంటి కింద చర్మం వాపుతోటి బాధపడుతున్నారా,ఎంతో అలసటగా అనిపిస్తుందా అయితే ఒక గుడ్డు తీసుకుని, దానిలోని తెల్ల సొనని ఆ వాచిన ప్రదేశం పై రాసి ఒక 10 నిమిషాల తరువాత చల్లని నీటితో శుబ్రపరుచుకుంటే, ఆ వాపులు తగ్గి మంచి సత్ఫలితాన్నిస్తుంది.
కోడి గుడ్లతో తయారు చేసుకునే "ఫేస్ ప్యాక్స్", వాటి ప్రయోజనాలు:
గుడ్డులోని తెల్ల సొనని తీసుకుని,కొంచెం కొబ్బరి నూనె కలిపి ,బాగా మిక్స్ చేసి మీ ముఖానికి , మెడకి పట్టించాలి, తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి, ఇలా చేస్తే మీ చర్మము జిడ్డు లేకుండా కాంతివంతంగా అవుతుంది, ఈ పద్దతి మీ జిడ్డుని పొగొట్టుకోవడానికి ఎంతో సులభమైనది.
మీ పొడిబారిన చర్మం కోసం:
గుడ్డులోని పచ్చ సొన తీసి, కొంచెం నిమ్మ రసం,కొంచెం పచ్చి ఆలివ్ నూనె కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, కాసేపటి తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే,మీ పొడి చర్మం ఎంతో అందంగా మారుతుంది, ఈ పద్దతి పొడి చర్మంతో బాదపడే వారికి ఎంతో ఉపయోగకరం.
మీ మృదువైన, తేజోవంతమైన, మెరిసే చర్మం కోసం:
గుడ్డు,ఒక స్పూన్ తేనే, కొంచెం ఆలీవ్ నూనే, 2 స్పూన్లు రోజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి,20 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే, మృదువైన, ఎంతో కాంతివంతమైన చర్మంతో పాటు, నల్ల మచ్చలు సైతం తొలగిపోతాయి.
మీ మెరిసే చర్మం కోసం:
గుడ్డులోని పచ్చ సొనలో కొంచెం తేనే, పెరుగు కలిపి మీ ముఖానికి పట్టించి, 20 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే, మెరిసే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది.
మీ చర్మం యొక్క మెరుగైన చాయ కోసం:
గుడ్డులోని తెల్ల సొనని తీసుకుని ఒక స్పూన్ తేనె కలిపి మీ ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే, నల్ల మచ్చలు పోయి, మీ చర్మం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది.
అందమైన జుట్టు కోసం కోడి గుడ్డు చిట్కాలు :
ఒక గుడ్డు, పెరుగు, 1 స్పూన్ పచ్చి ఆలీవ్ నూనె, కొంచెం బాదం నూనె కలిపి, ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకి పట్టించి 45 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే, మిల మిల మెరిసే జుట్టు మీ సొంతం అవుతుంది.
గుడ్డు, నిమ్మరసం హయిర్ కండీషనర్:
కొంచెం నిమ్మరసం తీసుకుని, గుడ్డుని కలిపి మీ జుట్టుకి పూర్తిగా పట్టించాలి, ఒక అరగంట తరువాత మీ షాంపూతో తలస్నానం చేయాలి,ఈ పద్దతి వల్ల మీ జుట్టు బాగ పెరగడమే కాకుండా, ఎంతో మృదువుగా కూడా అవుతుంది.
అందం కోసం కోడి గుడ్డు చిట్కాలు:
మీ జుట్టు పొడిగా,జిడ్డుగా, నిర్జీవంగా ఉంటుందా, అయితే ఈ చిట్కా మీ కోసమే, గుడ్డులోని తెల్ల సొన తీసుకుని మీ జుట్టుకి పట్టించి, అరగంట తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేస్తే, మంచి ఫలితం లబిస్తుంది.
పొడి జుట్టు కొసం గుడ్డు, వెన్న తీసిన పాల మిశ్రమము: ఒక కప్పు వెన్న తీసేసిన పాలలో గుడ్డు కలిపి, మీ జుట్టికి పట్టించి 30 నిమిషాల తరువాత షాంపూతో స్నానం చేస్తే ఎండిపొయినట్లు, జీవం కోల్పోయినట్లు ఉన్న జుట్టుకి మంచి మెరుపు లభిస్తుంది.



Click it and Unblock the Notifications