Latest Updates
-
వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ఈ 'దేశీ' చిట్కాలు పాటించండి.. ఎండల నుంచి ఉపశమనం ఎలా? -
మండే ఎండలకు చెక్.. ఇంట్లో ఉండే పండ్లతోనే చల్లటి, క్రీమీ ఐస్ క్రీమ్ తయారీ! -
మీ చుట్టూ ఉన్న తేనె పూసిన కత్తులను ఎలా గుర్తించాలి? -
నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులు వచ్చేస్తున్నాయి.. డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
జిమ్ వద్దు, కఠిన డైట్ వద్దు..3 నెలల్లో 12 కిలోలు తగ్గిన డాక్టర్ సీక్రెట్ ఇదే! -
రవి యోగం, సిద్ధ యోగం కలయిక.. ఏప్రిల్ 26న ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
వేళ్లు కూడా నాకి నాకి తినే కొత్తిమీర పన్నీర్ కర్రీ..రోటీ, నాన్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
సండే స్పెషల్: పుల్లపుల్లగా, కారంకారంగా మామిడికాయ మటన్ కర్రీ.. టేస్ట్ కిర్రాక్! -
ఎండలు మండిపోతున్నాయా? వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు ఇవే! -
మోహినీ ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే పారణ సమయాలు, నియమాలు తప్పక తెలుసుకోండి!
జుట్టు సంరక్షణకు కొన్ని కుక్కింగ్ ఆయిల్స్
అందం విషయంలో జుట్టు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదే సమయంలో, ఆరోగ్యకరమైన జుట్టు మన ఆరోగ్యాన్ని కూడా తెలుపుతుంది. మహిళలు, వారి జుట్టు సంరక్షణ కోసం, మందంగా, పొడవుగా జుట్టు పెంచుకోవడం కోసం ఏమైనా చేస్తూనే ఉంటారు. కానీ, చాలా మంది ప్రయత్నించడంలోనే విఫలం అవుతుంటారు. అందమైన జుట్టు పొందడానికి సురక్షితమైన మార్గాలను అనుసరించడం చాలా అవసరం. అందుకోసం ఒక సురక్షితమైన హెయిర్ కేర్ టిప్స్ ను అనుసరించి మంచి ఫలితాలను పొందవచ్చు.
అందమైన జుట్టు పొందడానికి, జుట్టు సంరక్షణ కోసం బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరగనవసరం లేదు. కమర్షియల్ గా మనకు అందుబాటులో ఉండే రసాయనిక ఉత్పత్తులు జుట్టుకు హాని కగించవచ్చు . అందుకు నేచురల్ పద్దతులను అనుసరించడం చాలా సురక్షితం. మరియు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంట్లోనే అనుసరించాల్సిన అనేక నేచురల్ పద్దతులు ఉన్నాయి. అవి సురక్షితం కూడా.
జుట్టు సంరక్షణ కొరకు కుక్కింగ్ ఆయిల్స్ (వంటనూనెలు)ఉపయోగించడం కూడా ఒక సురక్షితమైన పద్దతి. జుట్టు సంరక్షణ కొరకు కుక్కింగ్ ఆయిల్స్ ను ఉపయోగించడం వల్ల, జుట్టు చిక్కుబడటం నివారిస్తుంది, జుట్టు రాలడాన్ని అరికడుతుంది, మరియు డ్యామేజ్ అయిన జుట్టును పునరుద్దరిస్తుంది. మరి ఈ సమస్యలన్నింటిని నివారించి కొన్ని కుక్కింగ్ ఆయిల్స్ మీకోసం....

కొబ్బరి నూనె:
చర్మం మరియు జుట్టు సంరక్షణలో అద్భుతంగా సహాయపడే కుక్కింగ్ ఆయిల్ కొబ్బరి నూనె. కొబ్బరి నూనె జుట్టుకు మంచి కండీషనర్ గా పనిచేస్తుంది. కొబ్బరి నూనె మీ జుట్టుకు కండీషనర్ గా మాత్రమే కాదు, మీ జుట్టు మందగా పెరగడానికి కూడా సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో యాంటీ సెప్టిక్ లక్షణాలున్నాయి. అందువల్ల ఇది స్లాప్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

నువ్వుల నూనె:
జుట్టు సంరక్షణలో కుక్కింగ్ ఆయిల్ విషయంలో, నువ్వుల నూనె లేకుండా పట్టిక పూర్తి కాదు. జుట్టు సంరక్షణకు నువ్వులను నూనెను ఎంపిక చేసుకోవడం ఒక మంచి ఎంపిక. నువ్వుల నూనెతో మీ తలకు మసాజ్ చేయడం వల్ల తలలో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగుతుంది మరియు దాంతో జుట్టు పెరుగుదల ప్రారంభమౌతుంది.

ఆలివ్ ఆయిల్ :
ఆలివ్ ఆయిల్ (గాడ్ మదర్ ఆఫ్ హెయిర్' గా భావిస్తారు మరియు ఇది జుట్టు సంరక్షణలో అద్భుతాలను స్రుష్టిస్తుంది. ఇది జుట్టుకు అవసరం అయ్యే తేమను, పోషకాలను అధిస్తుంది మరియు లోతైన కండీషనర్ గాను ఉపయోగపడుతుంది. ఇంకా ఇది కేశాలకు బలాన్ని అధిస్తుంది మరియు చుండ్రును నివారిస్తుంది. ఆలివ్ ఆయిల్ కు కొద్దిగా తేనె మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి.

మస్టర్డ్ ఆయిల్(ఆవనూనె):
మందపాటి జుట్టు..నల్లటి జుట్టు పొందాలంటే మస్టర్డ్ ఆయిల్ ను ఉపయోగించవచ్చ. మస్టర్డ్ ఆయిల్ తలలో బ్లడ్ సర్కులేషన్ పెంచి జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఆవనూనెలో మినిరల్స్ : సెలీనియం, మరియు జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఇందులో విటమిన్ ఎ, డి, ఇ మరియు కెలు కూడా ఉన్నాయి.

బాదాం నూనె:
బాదాం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల హెయిర్ గ్రోత్ కు బాగా సహాయపడుతుంది. ఇది కూడా కొబ్బరి మరియు ఆమ్లా నూనెలు మాదిరే ఉంటుంది. అతి త్వరగా జుట్టు పెరగాలనుకొనే వారు బాదాం నూనెను ప్రతి రోజూ తలకు పట్టించాలి.

సన్ ఫ్లవర్ ఆయిల్:
సన్ ఫ్లవర్ ఆయిల్ ఎమోలియంట్ గా పనిచేస్తుంది, ఇది మీ జుట్టు గల జుట్టుకు కండిషనర్ గా పనిచేస్తుంది. సన్ ఫ్లవర్ ఆయిల్ హెయిర్ గ్రోత్ ను పెంచుతుంది మరియు హెయిర్ బ్రేకేజ్ ను నివారిస్తుంది. జుట్టు సంరక్షణలో కుక్కింగ్ ఆయిల్స్ లో కొబ్బరి నూనె తర్వాత అత్యంత ఎఫెక్టివ్ గా పనిచేసే కుక్కింగ్ ఆయిల్ సన్ ఫ్లవర్ ఆయిల్.

కనోలా ఆయిల్:
మీకు డ్రై హెయిర్ ఉన్నట్లైతే, అందుకు ఒక బెస్ట్ కుక్కింగ్ ఆయిల్ కనోలా ఆయిల్. కనోలా ఆయిల్ చిక్కును తొలగిస్తుంది. పొడి జుట్టును నివారిస్తుంది. జుట్టును స్మూత్ గా మరియు షైనీగా మార్చుతుంది. అలాగే, జుట్టు చివర్లను అరికడుతుంది, జుట్టు తిరిగి డ్యామేజ్ కాకుండా రక్షణ కల్పిస్తుంది.



Click it and Unblock the Notifications