Latest Updates
-
ఐరన్, విటమిన్స్ నిండిన మునగాకు గోధుమ దోసె..బరువు తగ్గాలనుకునేటోళ్లకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ -
ఫోన్ పగలగొట్టాడని తండ్రిని దారుణంగా చంపిన కూతురు! -
కాలిఫ్లవర్ తో ఇలా చేస్తే పకోడీ కూడా పనికిరాదు.. టేస్ట్ అదుర్స్! -
నడుము నొప్పితో విసిగిపోయారా? మీ వెన్నెముకను ఉక్కులా మార్చేసే చిట్కా ఇదే! -
కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ పులిహోర..చాలా కమ్మని రుచిగా చేసుకోండిలా.. -
ఎముకలు బలంగా అవ్వడానికి,బాడీలో రక్తం పట్టాలంటే ఈ స్వీట్ తినండి..చేయడం చాలా సింపుల్.. -
నెయ్యి గురించి చాలామందికి తెలియని నిజం ఇదే.. -
బీహార్ స్పెషల్ దాల్ పూరీ.. శనగపప్పు స్టఫింగ్ తో పర్ఫెక్ట్ రెసిపీ -
జస్ట్ 20 నిమిషాల్లో ది బెస్ట్ సాంబార్ రైస్.. రెస్టారెంట్ ని మించిన రుచితో ఎలా చేసుకోవాలంటే.. -
మలబద్దకంతో బాధపడుతున్నారా? మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఈ ఫుడ్స్ తినండి
మీ చెవిని శుభ్రం చేయడానికి సమర్థవంతమైన చిట్కాలు
చెవి అనేది మన శరీరంలో ఒక ముఖ్యమైన అవయవము. చెవులను రెగ్యులర్ గా శుభ్రం చేయవలసిన అవసరం ఉంది. చెవుల కోసం ప్రత్యెక రక్షణ పొర లేదు. చెవి లోపల చిన్న కణాలు పేరుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చెవిలో ఈ కణాలు గులిమిగా తయారయ్యి అవరోధం ఏర్పడవచ్చు. అలాగే దుమ్ము మరియు ధూళి వలన కూడా గులిమి ఏర్పడుతుంది.
అదనపు గులిమి మరియు మలినాన్ని తొలగించడానికి చెవులను శుభ్రం చేయాలి. గులిమి అనేది చెవి వినికిడి సామర్థ్యాలను బ్లాక్ చేయుట మరియు అడ్డుకొంటుంది. చెవులలో బాక్టీరియా వ్యాధులకు కారణం అయిన దుమ్ము మరియు ధూళి వంటి వాటిని కూడా తొలగించాలి. చెవులను శుభ్రం చేయటానికి ఉపయోగించే పద్ధతులు కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఈ క్రింద తెలుసుకుందాము.

1. ఇంట్లో తయారుచేసుకొనే చెవి ద్రావకాలు
గులిమిని మృదువుగా మరియు కరిగించటానికి ఇంట్లో అనేక సహజ పదార్థాలు ఉన్నాయి. ఇంట్లో చెవి ద్రావకంను తయారుచేయటానికి హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్లిజరిన్ మరియు మినరల్ నూనెలను వాడవచ్చు. వీటిని ఒక మిశ్రమంగా చేసి గులిమి ద్రావకంగా ఉపయోగించవచ్చు. పైన చెప్పిన ద్రావనాలను 2-3 స్పూన్స్ ఉపయోగించండి. చెవిలో ఈ మిశ్రమంను 2-3 చుక్కలు వేయండి. రాత్రిపూట వేసుకొని ఆపై చెవి బడ్స్ సహాయంతో మలినాన్ని తొలగించండి.
2. వేడి నూనె చికిత్స
చెవుల నుండి మలినాన్ని తొలగించడానికి మీరు కొబ్బరి నూనె వంటి వేడి నూనెలను ఉపయోగించవచ్చు. ఒక బౌల్ లో కొద్దిగా కొబ్బరి నూనె తీసుకోని గోరువెచ్చగా చేయాలి. ఈ నూనెను రెండు చెవులలో 3-4 చుక్కలు పోయాలి. వెచ్చని నూనె ఒక ద్రావకంలా పనిచేస్తుంది. అంతేకాక గులిమి కరిగటానికి మరియు తొలగించడానికి సులభం చేస్తుంది. నూనె పోసిన తర్వాత చెవులను ముందుకు నూనె కోసం వ్యతిరేక దిశలో వంచాలి. నూనెను రాత్రిపూట ఉంచేందుకు చెవిలో పత్తి ప్లగ్స్ ఉంచండి. తరువాతి రోజు చెవులను శుభ్రపరచడం మరియు అదనపు నూనె తొలగించడానికి మీ చెవులలో కొంత నీటిని పోయాలి.
3. ఇయర్ బడ్స్
సాధారణ క్లీనింగ్ కొరకు మృదువైన ఇయర్ బడ్స్ ను ఉపయోగించి చెవులను శుభ్రం చేయటం మంచిది. మీ చెవులను శుభ్రం చేయటానికి అవసరం అయినప్పుడు మాత్రమే ఇయర్ బడ్స్ ను ఉపయోగించండి. హార్డ్ బడ్స్ లేదా పదునైన సాధనాలను ఉపయోగించకండి. ఎందుకంటే అవి చెవి అంతర్గత భాగాలకు హాని కలిగించవచ్చు. మంచి నాణ్యత గల చెవి బడ్స్ మెడికల్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి.
4. మేడికేటేడ్ చెవి ద్రావకాలు
మేడికేటేడ్ చెవి గులిమి ద్రావకాలు ఖచ్చితంగా చెవులను శుభ్రం చేయటానికి ప్రభావవంతమైనవి. ఈ కెమికల్ మోతాదులు వైద్య స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. వినియోగదారుల కోసం ఈ ద్రవ సీసాలపై ప్రత్యేక సూచనలు ఉన్నాయి. ఒక డ్రాప్ మాత్రమే ఉపయోగించటం మంచిది. చెవి ద్రావకాలను కనీసం వారానికి ఒకసారి ఉపయోగించాలి. ఇది మీ చెవులను శుభ్రం చేయడానికి ఒక సులభమైన ఎంపిక. మీరు చెవులకు రసాయనిక ఆధారిత ఉత్పత్తులను ఉపయోగించినప్పుడు సంరక్షణ తీసుకోవాలి. ఎందుకంటే చెవులు చాలా సున్నితమైన అవయవ భాగం.
5. డాక్టర్
మీ చెవులను శుభ్రం చేయడానికి ఇతర పద్ధతులను ప్రయత్నించినప్పుడు కూడా మళ్లీ అవరోధం ఏర్పడితే ఒక డాక్టర్ ను సంప్రదించాలి. చెవి నొప్పి మరియు గులిమి చేరడం వంటివి చెవి సంబంధిత వ్యాధుల లక్షణాలుగా ఉండవచ్చు. చెవి నొప్పి ఎక్కువగా మరియు తరచూగా సంభవించినపుడు ఒక తీవ్రమైన విషయంగా పరిగణించాలి. వైద్యులు వైద్య పరికరాలతో మీ చెవులలో గులిమి లేకుండా చేయగలరు. చెవిలో ఉన్న దుమ్ము సులభంగా పోదు. దీనికి సాధారణ క్లీనింగ్ మరియు నిర్వహణ అవసరం. చెవులకు అన్ని ఇతర అవయవాలతో పాటు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి.



Click it and Unblock the Notifications
