Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్‌వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
చలికాలంలో పాదాల పగుళ్ళ నివారణకు చిట్కాలు
చలికాలం కాస్త గిలి..గిలిగా ఉన్నా.. ఎన్నో చర్మ సమస్యలనే కలిగిస్తుంది. ఈ కాలంలో చర్మం చాలా సమస్యల్ని ఎదుర్కొంటుంది. అందులో పాదాలు పగలటం ఓ సమస్య. పాదాలు పగలటమేంటీ ఇది ఒక్క ఆడవారి సమస్య అని అనుకుంటున్నారా? కానేకాదు. ఈ సమస్య ఈ కాలంలో అందరినీ పట్టి పీడిస్తుంది.
చలికాలం ఎంత జాగ్రత్తగా ఉన్నా పాదాల మీద పగుళ్లు ఏర్పడతాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే చర్మం ఊడి గాయాలుగా మారి ఇన్‌ఫెక్షన్లు మొదలవుతాయి. అందుకే ఈ సమస్యకు ప్రారంభంలోనే ఫుల్‌స్టాప్ పెట్టేయాలి. ఇందుకోసం పాదాల మీద పగుళ్లు కనిపించగానే ఈ చిట్కాలు మొదలుపెట్టండి.

1. వంటనూనెతో:
నువ్వుల నూనె, శనగ నూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్, కొబ్బరి నూనె... ఇలా ఎలాంటి వంటనూనెనైనా పాదాలకు ఉపయోగించవచ్చు. అయితే చర్మంలోకి చొచ్చుకుపోయి మంఫలితం దక్కాలంటే రాత్రి పడుకునేముందు మాత్రమే ఈ నూనెలను పాదాలకు అప్లై చేయాలి.
నూనెలను మర్దించేముందు...
పాదాలను ప్యూమిస్ స్టోన్‌తో రుద్ది మృత చర్మం, మురికి వదిలించాలి. తర్వాత శుభ్రంగా కడిగి తుడినూనె అప్లై చేయాలి.
తర్వాత సాక్స్ వేసుకుని పడుకోవాలి. తెల్లారేసరికి పాదాలు మృదువుగా మారి ఉంటాయి.
ఇలా క్రమం తప్పక కొన్ని రోజులపాటు చేస్తే పాదాలు పగుళ్లు వదిలి నునుపుగా తయారవుతాయి.

2. బియ్యం పిండితో:
ఎక్స్‌ఫోలియేటింగ్ వల్ల పొడిబారి, పగిలిన చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఎక్స్‌ఫోలియేటింగ్ స్క్రబ్‌గా బియ్యం పిండి బాగా ఉపయోగపడుతుంది.
బియ్యం పిండికి కొద్ది చుక్కల తేనె, యాపిల్ సెడార్ వెనిగర్ చేర్చి పేస్ట్‌లా తయారుచేయాలి. పాదాల మీద పగుళ్లు ఎక్కువగా ఉంటే బాదం లేదా ఆలివ్ ఆయిల్ చేర్చాలి.
గోరు వెచ్చని నీటిలో 10 నిమిషాలపాటు పాదాలను నానబెట్టి ఈ పేస్ట్‌తో రుద్ది శుభ్రంగా కడగాలి.
తడి లేకుండా తుడినూనె పూసుకుని సాక్స్ వేసుకుని పడుకోవాలి.

3. వేపాకుతో:
యాంటీఫంగల్ లక్షణాలుండే వేప పాదాల పగుళ్లను కూడా వదిలిస్తుంది.
గుప్పెడు వేపాకుకు స్పూను పసుపు కలిపి మెత్తగా రుబ్బాలి.
ఈ పేస్ట్‌ను పాదాల పగుళ్లకు అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రంగా కడగాలి. తడి ఆరాక నూనెతో మర్దించాలి.

4. రోజ్ వాటర్, గ్లిజరిన్
పాదాల పగుళ్లకు అద్భుతమైన చికిత్స రోజ్ వాటర్, గ్లిజరిన్ కాంబినేషన్. గ్లిజరిన్ చర్మాన్ని మృదువుగా తయారుచేస్తే రోజ్ వాటర్‌లోని ఎ, డి, ఇ, సి, బి3 విటమిన్లు చర్మానికి పోషణనిస్తాయి. కాబట్టి ఈ రెండిటినీ సమపాళ్లలో కలిపి రోజూ నిద్రకు ముందు పాదాలకు అప్లై చేసి ఉదయాన్నే కడిగేసుకోవాలి.

5. ప్యారాఫిన్ వ్యాక్స్
పగుళ్లు పెద్దవై బాధపెడుతూ ఉంటే ప్యారాఫిన్ వ్యాక్స్‌తో తక్షణ ఉపశమనం లభిస్తుంది.
పారాఫిన్ వ్యాక్స్‌కు ఆవ నూనె లేదా కొబ్బరి నూనెలో కలిపి వేడిచేయాలి. వ్యాక్స్ పూర్తిగా కరిగేంతవరకూ వేడిచేసి పూర్తిగా చల్లార్చాలి.
రాత్రి పడుకునేముందు ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి ఉదయాన్నే కడిగేయాలి.



Click it and Unblock the Notifications