Latest Updates
-
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి!
అతివల అందాలను రెట్టింపు చేసే ఆలివ్ ఆయిల్ !
అందరకు అందుబాటులో వుండే ఆలివ్ ఆయిల్ ఎంతో సహజ చర్మ, కేశ సంరక్షణా విలువలు కలిగి వుంది. ఈ ఆయిల్ ప్రయోజనాలు ఎన్నో శతాబ్దాలనుండి మనకు ఉపయోగబడుతున్నాయి. ఆలివ్ ఆయిల్ ను బ్యూటీ ప్రోడక్ట్ లలో ఒకటిగా పాశ్చాత్యులు కనుగొన్నప్పటికీ, దీని ప్రయోజనాలు, అందాల సాధనలో కల రహస్యాలు ప్రపంచం అంతా వ్యాపించాయి. అమెరికా మార్కెట్ లలో నేడు హెయిర్ మరియు స్కిన్ కేర్ ఉత్పత్తులు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఈ ఉత్పత్తుల అత్యధిక అమ్మకాలు అక్కడి ప్రజల ఆసక్తిని చాటుతాయి.
అయితే, రసాయనిక పదార్ధాలు కలిగిన ఈ ఉత్పత్తులను తొలగించి సహజ ఉత్పత్తులను ఉపయోగించటం ఉత్తమ మార్గం. ఈ సహజ ఉత్పత్తులు పూర్తిగా సురక్షితమే కాక జీవితకాలం పాటు అద్భుత ఫలితాలనిస్తాయి. ఇటువంటి ఉత్పత్తుల తయారీలో ఆలివ్ ఆయిల్ ను ఒక ప్రధాన పదార్ధంగా ఉపయోగించవచ్చు. ఆలివ్ ఆయిల్ సహజమైనది మరియు చర్మానికి మంచి ఔషధం. అందమైన, ప్రకాశవంతమైన చర్మ సౌందర్యాన్ని ఈ ఆయిల్ అందిస్తుంది. ఇన్ని సహజ విలువలు కల ఈ ఆయిల్ ఇచ్చే అద్భుత ప్రయోజనాలు పరిశీలిద్దాం

1.స్కిన్ మాయిస్చరైసర్ గా ఆలివ్ ఆయిల్
ముఖంపైన లేదా శరీర భాగాల పైనా ఈ ఆయిల్ రాస్తే, అది చర్మ కణాలలోకి పూర్తిగా చొచ్చుకొని పోయి ఇంకి, చర్మానికి ఒక పోషకంగా ఉపయోగపడుతుంది. ఈ ఆయిల్ రాత్రి లేదా పగలు రాయవచ్చు. పొడి చర్మానికి మరింత మంచింది. మీ చర్మం కాన్తివంతంగా, నిగ నిగాలాడుతూ ఉండాలంటే, ఆలివ్ ఆయిల్ లో కొద్దిపాటి నిమ్మ రసాన్ని కూడా కలపండి. అది చర్మాన్ని మరింత మృదువుగా వుంచుతుంది. ఈ రకమైన ఆలివ్ ఆయిల్ మాత్రమే కాక అది కలుపబడిన ఇతర ఉత్పత్తులను కూడా ఉపయోగించి మంచి ఫలితాలు పొందవచ్చు.
2. పెళుసు చర్మానికి ఆలివ్ ఆయిల్ !
చర్మం పొడి బారిందా ? లేదా పొలుసులు కట్టేస్తోందా ? ఇటువంటప్పుడు ఆలివ్ ఆయిల్ రాయండి. ఆలివ్ ఆయిల్ ను సముద్రపు ఉప్పు లేదా సి సాల్ట్ తో కలిపి చర్మం పై రాస్తే, అది మృత, పొడి చర్మ కణాలను తొలగించి, కొత్త చర్మాన్ని ఇస్తుంది. ఆలివ్ ఆయిల్ లో కొద్ది చుక్కల లవెండర్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమాన్ని నీటిలో కలిపి స్నానం చేస్తే చర్మం మెత్తబడి రక్షణగా వుంటుంది. ప్రతి ఒక్క చర్మ కణం పునరుజ్జీవితమవుతుంది.
3. గోళ్ళు, వేళ్ళ కణుపుల సంరక్షణ లో ఆలివ్ ఆయిల్ !
సాధారణంగా గోళ్ళు, వేళ్ళ కణుపులు,వాటిపై భాగాలు వాతావరణం, శరీర ఉష్ణం కారణంగా కొంత డామేజ్ అయిపోతూ వుంటాయి. వీటి సమస్యల పరిష్కారానికి స్వచ్చమైన ఆలివ్ ఆయిల్ రాయటం చక్కని పరిష్కారం. ఆలివ్ ఆయిల్ గట్టిగా రాయాల్సిన పని కూడా లేదు. సున్నితంగా రాస్తే చాలు, చక్కని మాయిస్చరైసర్ గా పని చేసి మంచి ఫలితాలు ఇస్తుంది.
4.మీ కళ్ళకు వేసిన మేకప్ తొలగించాలా ? ఆలివ్ ఆయిల్ !
సాధారణంగా, సున్నితమైన, అందమైన కళ్ళకు మనం మేకప్ వేస్తాం. దీనిని తొలగించాలంటే, ఆలివ్ ఆయిల్ ఒక మరింత సున్నిత సాధనంగా ఉపయోగపడుతుంది. ఒకటి లేదా రెండు చుక్కలు వేసి మెల్లిగా తుడిస్తే చాలు, మీరు తొలగించాలనుకునే మేకప్ మటుమాయం. ఈ రకంగా ప్రతి రోజూ రెగ్యులర్ గా చేస్తూ వుంటే, కళ్ళ చుట్టూ వుండే ముడుతలు సైతం తొలగిపోతాయి.
5. కేశ సౌందర్య రక్షణలో ఆలివ్ ఆయిల్ !
కేశ సౌందర్య రక్షణలో ఆలివ్ ఆయిల్ పాత్ర ప్రధానమైనది. చిట్లి పోయిన మీ కేశాలను మరొక్కమారు నిగ నిగలా, పట్టు వలే మెత్తగా చేసి ఆకర్షణీయం చేయాలంటే, ఆలివ్ ఆయిల్ వాడకం తప్పనిసరి. రెగ్యులర్ గా కురులకు ఉపయోగిస్తే, చుండ్రు వ్యాధిని నియంత్రించటం మాత్రమే కాక, ఒక కండిషనర్ గా కూడా పని చేస్తుంది. కేశాలను షాంపూ చేసిన తర్వాత కొద్ది చుక్కల ఆలివ్ ఆయిల్ ను నీటిలో కలిపి తల పైభాగాన్ని మసాజ్ చేయండి. 5 నిమిషాలు అలానే వుంచి నీటితో శుభ్రంగా కడిగేయండి. ఇక పట్టువంటి మెత్తటి కురులు మీ సొంతం. తరచుగా చేసే ఈ చర్య మీ కురుల సంరక్షణలో అద్భుత ఫలితాలనిస్తుంది.



Click it and Unblock the Notifications











