Latest Updates
-
India’s One Day Capital: ఒక్క రోజు మాత్రమే భారతదేశ రాజధానిగా ఉన్న నగరం ఏదో మీకు తెలుసా? -
ఇడ్లీ, దోశెలను వదలనివ్వని అద్భుతమైన మదురై స్పెషల్ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
చలికాలంలో ఈ సాంబార్ చేసుకుంటే..జలుబు, తలనొప్పి అన్నీ పరార్! -
కోట్ల ఆస్తి, డ్రైవర్ తో ఎఫైర్.. ప్రియుడి మోజులో కన్నకొడుకునే బలిచ్చిన తల్లి.. -
బజార్ స్వీట్లు ఇక ఆపేయండి.. సొరకాయతో అద్భుతమైన కలకండ్ ఇలా చేసుకోండి.. -
చలికాలంలో గొంతు నొప్పి, గరగర వేధిస్తున్నాయా? వంటింట్లో దొరికే ఈ పదార్థాలతో చిటికెలో రిలీఫ్.. -
100 ఏళ్లు గుర్తుండిపోయే పచ్చిమిర్చి పచ్చడి..ఎందులోకి అయినా అమృతమే! -
ఖాళీ స్వీట్ బాక్సులు పారేస్తున్నారా?.. ఈ ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు! -
హోటల్ స్టైల్ పూరీ మసాలా ఇంట్లోనే.. ఈ సీక్రెట్ టిప్స్ తో చేసి చూడండి! -
నెల రోజులు నిల్వ ఉండే ఆరోగ్యకరమైన మరమరాల లడ్డు..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
స్త్రీ, పురుషులు కోసం శీతాకాల చర్మ సంరక్షణ చిట్కాలు
మహిళలకు, పురుషులకు చలికాలపు చర్మ సంరక్షణా చిట్కాలు ! చలికాలం వచ్చిందంటే చాలు, పురుషులైనా, స్త్రీలైనా పొడి చర్మ సమస్యలు ఎదుర్కొనాల్సిందే. వేసవి కాలంలో గాలిలో తేమ వుంటుంది. కనుక మనం శరీరం చెమట రూపంలో తేమను నిలుపుకుంటుంది. కాని శీతాకాలం లేదా చలి కాలంలో, అందరూ చర్మ సమస్యలు ఎదుర్కొంటారు. పొడిబారిన తెల్లటి ముఖం, చుర చుర మంటూ నొప్పులు కలిగించే ఇతర చర్మ సమస్యలు బాధిస్తాయి. ఇక అపుడు స్కిన్ కేర్ ఉత్పత్తుల ఉపయోగం తప్పనిసరిగా వుంటుంది. ఈ సమస్యలు, మహిళలకే కాక పురుషులకు కూడా వుంటాయి.
చలికాల శరీర సంరక్షణా చిట్కాలు !
నిగ నిగ లాడే మెత్తటి చర్మం కొరకు సహజమైన మాయిస్చరైసర్ లు రాయండి. చలికాలంలో చేసే వేడి నీటి స్నానాలు కూడా చర్మానికి హాని కలిగిస్తాయి. అవి మీ చర్మ తేమను తొలగించి చర్మాన్ని పొడి చేసి, పెళుసుగా చేస్తాయి. కనుక ఎక్కువ సేపు లేదా తరచుగాను స్నానం చేయకండి. చర్మం పగుళ్ళు చూపిన చోట పెట్రోలియం జెల్లీ వాడకం చేయండి. ప్రతి రోజూ నిద్రించేముందు, ఆల్మండ్ నూనెను ముఖానికి రాయండి. చల్లని గాలి నుండి మీ చర్మాన్ని దూరంగా వుంచండి. వూల్లెన్ క్లోత్ లేదా ఒక బట్టతో మీ శారీరక భాగాలను కప్పి ఉంచేందుకు ప్రయత్నించండి.

చలికాలంలో పురుషులకు, మహిళలకు పెదవుల సంరక్షణ ఎలా ? .
చలికాలంలో మీ పెదవుల రక్షణకై లిప్ కేర్ పూతలు తప్పక వేయాలి. వీలు వున్ననంతవరకు ఇంటిలోని సహజ పదార్దాలైన నెయ్యి, వెన్న, కొబ్బరి నూనె వంటివి రాయండి. శరీర తేమ నిలువకు గాను నీరు అధికంగా త్రాగండి. చాలామంది తమ పెదవులను నోటితో టచ్ చేసి తేమగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు. కాని ఇది సరికాదు. ఈ చర్య పెదవులని మరింత తరచుగాపొడి చేస్తుంది. పెదవి భాగాలను మరింత పగిలేలా చేస్తుంది. కనుక పెదవులను నోటితో తడి చేసే అలవాటు మానండి.
పురుషులకు , మహిళలకు పాద సంరక్షణలో చిట్కాలు!
వింటర్ వచ్చిందంటే చాలు చాలా మంది కాలి మడమ పగుళ్ళ సమస్యలను కలిగి వుంటారు. ఈ సమస్యలకు పరిష్కారంగా ఇంటి చిట్కాలు కొన్ని పాటించవచ్చు. ఒక పెద్ద గిన్నె లో ఒక మాదిరి నులి వెచ్చని వేడినీటిని తీసుకొని దానిలో నిమ్మ రసం కలిపి, ఆ నీటిలో మీ పాదాలను కనీసం 30 నిమిషాలపాటు వుంచండి. తర్వాత పాదాలను బయటకు తీసి, వాటిని స్క్రబ్బర్ లేదా గట్టి సాధనంతో రుద్దండి. పాదాలకు కల మృతకణాలు తొలగిపోతాయి. చర్మం ఆరోగ్యంగా వుంటుంది. ఇపుడు, పెట్రోలియం జెల్లీ లేదా ఇతర స్కిన్ ఆయంట్ మెంట్ లు పాదాలకు రాయండి. వీలైనంత వరకు పాదాలకు చలి గాలి తగలకుండా సాక్స్ ఉపయోగించండి.
చలికాలంలో హెయిర్ కేర్ టిప్స్ ఎలా ?
చలికాలంలో జుట్టు ఊడటం లేదా చిట్లడం సాధారణంగా గమనించవచ్చు. ఈ కాలంలో కేశ సంరక్షణ ప్రధానం. ఈ కాలంలోనే తలకు చుండ్రు వ్యాధి కూడా వచ్చే అవకాశం వుంటుంది. చుండ్రు వ్యాధిని తొలగించాలంటే, వెంట్రుకలను శుభ్రపరచే ముందు, కొట్టిపాటి నిమ్మ రసం రాయండి. కొద్దిసేపు వుంచి శుభ్రమైన వేడి నీటితో కడిగేయాలి. ఈ కాలంలో జుట్టు ను అతిగా దువ్వటం కూడా మంచిది కాదు. సహజమైన నూనెలతో తగినంత సేపు మర్దన చేసి నూనెలు తల చర్మపు పొరలకు ఇంకిపోయేలా చూడండి.



Click it and Unblock the Notifications
