Latest Updates
-
ఆర్థరైటిస్ పేషెంట్లకు అలర్ట్.. ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా.? -
నేటి రాత్రి ఆకాశంలో అద్భుతం.. శుక్రుడి సంచారంతో ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది! -
జూన్ 19 నుంచి ధన రాజయోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
పొగాకు నమిలితే క్యాన్సర్, గుండెపోటు మాత్రమే కాదు.. మరో ప్రమాదం ఉందని తెలుసా.? -
ఎక్కువ కాలం బతకాలా? ఈ వ్యాయామాలు చేస్తే మరణ ప్రమాదం తగ్గుతుంది.. -
విజయవాడ కనక దుర్గమ్మ తల్లి ఆ కొండపై ఎందుకు కూర్చుంది? అసలు కథ -
ధాబా స్టైల్ టీ ఇంట్లోనే కావాలా? అయితే ఈ 3 సీక్రెట్ మసాలాలు వాడాల్సిందే! -
జూన్ 18, 2026: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధన లాభం, కెరీర్లో సంచలనం! -
కర్కాటక, సింహ, ధనస్సు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. మీ అదృష్టం ఎలా ఉంది? - గురువారం, 18 జూన్ 2026 -
ఇకపై గోవా వెళ్లక్కర్లేదు బాస్..మన ఏపీ బీచ్ ల్లోనే ఆ అదిరిపోయే లైఫ్..జీవో జారీ
మీ చర్మను కాంతివంతంగా మార్చే ఎఫెక్టివ్ హోం రెమెడీస్
సహజంగా మన చర్మంను గమనించినట్లైతే చర్మం యొక్క రంగులో అప్పుడప్పుడు మార్పులు వస్తుంటాయి. వాతావారణాన్ని బట్టి కూడా చర్మంలో మార్పులు వస్తుంటాయి. ఎందుకంటే, శరీరంలో చాలా సున్నితమైనది. కఠినమైన రసాయనాలు కలిగిన ఉత్పత్తులను వాడటం కూడా చర్మానికి చాలా హాని జరుగుతుంది. వాతావరణ ప్రభావం లేదా, ఎండవేడిమి వల్ల చర్మం రంగులో మార్పులు వస్తే తిరిగి మన చర్మం యొక్క అసలు రంగును మార్చుకోవడానికి కెమికల్ ప్రొడక్ట్స్ కాకుండా, నేచురల్ హోం రెమెడీస్ ను ఉపయోగించడం వల్ల చర్మఛాయలో మార్పులు తీసుకురావడం మాత్రమే కాదు, ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
మీ చర్మం యొక్క రంగులో తక్షణం మార్పు కోరుకుంటున్నట్లై కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మ ఛాయను మీకు నచ్చిన విధంగా మెరుగుపరుచుకోవడానికి కొన్ని హోం మేడ్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల తక్షణ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ హోం మేడ్ చిట్కాలను ఉపయోగించడం చాలా సులభం కూడా.
READ MORE:13 నేచురల్ హోం మేడ్ ఫేస్ ప్యాక్: తెల్లగా మారడానికి
చర్మఛాయను మెరుగుపరుచుకోవడం నేచురల్ ప్రొడక్ట్స్ ను ఎంపిక చేసుకోవడం కష్టమైన పనికాదు. ఎందుకంటే మార్కెట్లో అందుబాటులో ఉండే నేచురల్ ప్రొడక్ట్స్ కంటే, మన వంటగదిలో ఉండే నేచురల్ ప్రొడక్ట్స్ అధికంగా ఉన్నాయి. వీటి ఉపయోగం వల్ల చర్మాన్ని నునుపుగా మరియు షైనీగా మార్చుతుంది. అందుకు మీరు కొంత సమయం మరియు కొద్దిగా శ్రమపడితే చాలు మీరు కోరుకున్న ఫలితాలను పొందవచ్చు. వీకెండ్ పార్టీ లేదా ఇతర ఫంక్షన్లకైనా సరే వెంటనే మీ చర్మ యొక్క రంగులో మార్పులు తీసుకొస్తుంది. మరి అలా ఇన్ స్టాంట్ గ్లో తీసుకొచ్చే చర్మం నేచురల్ ప్రొడక్ట్స్ ఏంటో ఒకసారి చూద్దాం...

నిమ్మకాయ:
నిమ్మరసంలో యాంటీఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. నిమ్మరసంను డార్క్ స్పాట్స్ లో మీద అప్లై చేసి 10నిముషాల తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే తక్షణ చర్మఛాయను పొందవచ్చు.

తేనె కాంబినేషన్:
నిమ్మరసంకు కొద్దిగా తేనె మిక్స్ చేసి, చర్మంకు అప్లై చేయడం వల్ల చర్మఛాయలో మార్పు వస్తుంది . చర్మఛాయలో వెంటనే మార్పు రావాలంటే ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ.

కీరదోసకాయ:
తేనె మరియు కీరదోసకాయ రసం కాంబినేషన్ లో ఫ్యాక్ వేసుకోవడం వల్ల ఎఫెక్టివ్ ఫలితాలను పొందవచ్చు . ఆయిల్ స్కిన్ కలవారు తేనె మరియు పాల మిశ్రమంతో బాడీ మాస్క్ వేసుకోవడం వల్ల తక్షణం మార్పులు గమనించవచ్చు.

ఓట్ మీల్ ప్యాక్:
నిమ్మరసంతో ఓట్ మీల్ మరియు పసుపు వేసి, మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. కొన్ని నిముషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

అరటి పండ్లు:
అరటి పండ్లు ఆరోగ్యానికి మాత్రమే కాదు, బ్యూటీకి కూడా చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ఎందుకంటే అరటిపండులో మినిరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది చర్మానికి ఉపయోగపడుతుంది.

టమోటో:
టమోటోలో స్కిన్ లైటనింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, ఇది చర్మంలోని తేమను పీల్చుకొని, చర్మరంద్రాలను తెరచుకొనేలా చేసి, శుభ్రం చేస్తుంది. దాంతో చర్మానికి ఇన్ స్టాంట్ గ్లో వస్తుంది.

ఫ్రూట్ ప్యాక్ :
అవొకాడో, బొప్పాయి మరియు కీరదోసకాయ మూడింటిని మిక్స్ చేసి ప్యాక్ వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిముషాలు తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసి చూడండి. మార్పు మీకే తెలుస్తుంది.

ఎగ్ ప్యాక్:
గుడ్డును ఉపయోగించడం వల్ల చర్మఛాయలో మార్పు రాదు. అయితే కొన్ని సహజ మార్పులు తీసుకొస్తుంది. ఎగ్ వైట్ ను ముఖానికి అప్లై చేసి పూర్తిగా ఎండే వరకూ ఉండి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

హాట్ ఆయిల్ మసాజ్:
హాట్ ఆయిల్ మసాన్ ను కనీసం వారానికి ఒక సారి చేసుకోవాలి. హాట్ ఆయిల్ మసాజ్ కోసం వేప మరియు తులసి ఆకులను కూడా వేసి బాడీ మసాజ్ చేసుకోవడం వల్ల శరీరంలో బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుంది. స్కిన్ టాన్ తగ్గుతుంది.

పాలు, ఆయిల్ మరియు నిమ్మరసం:
ఈ రెండింటి కాంబినేషన్ లో చర్మానికి చాలా ఉపయోగపడుతుంది. పాలపౌడర్, నిమ్మరసం మరియు బాదం ఆయిల్ మిక్స్ చేసి మాస్క్ వేసుకోవాలి.

బంగాళదుంప:
చర్మంలో తక్షణ మార్పును తీసుకురావడానికి బంగాళదుంపలు అద్భుతంగా సహాయపడుతాయి. ఇది ఒక బ్లీచింగ్ ఏజెంట్ గా ఉపయోపడుతుంది . మీరు బంగాళదుంపును స్లైస్ గా కట్ చేసి ముఖం మీద రబ్ చేయాలి.

సాండిల్ వుడ్:
గందం ఒక ట్రెడిషినల్ హోం రెమెడీ. దీని వల్ల ఇన్ స్టాంట్ గ్లో పెరుగుతుంది . గందంలో బాదం ఆయిల్ మిక్స్ చేసి మాస్క్ గా వేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications