Latest Updates
-
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ!
అప్పర్ లిప్ హెయిర్ తొలగించడానికి 6 నేచురల్ హోం రెమెడీస్
పెదాలు అందంగా ఉంటే, ఆ ముఖ సౌందర్యం మరింత అందంగా కనిపిస్తుంది. అదే పైపెదవి మీద సన్నని హెయిర్ ఉన్నట్లైతే, అవి బయటకు కనబడుతుంటే, ఆ పెదాలకు లిప్ స్టిక్ వేసినా, అందవిహీనంగా మారిపోతుంది. అందమైన ముఖంలో పెదాల మీద సన్నగా వెంట్రుకలు కనబడుట వల్ల పురుషల వలే కనబడితే చాలా ఇబ్బందిగా ఉండేది. కాబట్టి, ఎట్టువంటి నొప్పి లేకుండా నేచురల్ గా అప్పర్ లిప్ హెయిర్ తొలగించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి.
అప్పర్ లిప్ హెయిర్ తొలగించుకోవడానికి హోం రెమెడీస్ ను సరైన సమయంలో సరిగా ఉపయోగించే మంచి ఫలితం ఉంటుంది. అందువల్ల, ఈ క్రింద తెలిపిన వివిధ రకాల టిప్స్ ను మీకు అందిస్తోంది. ఈ టిప్స్ ను క్రమంగా ఉపయోగిస్తే, అప్పర్ లిప్ హెయిర్ ను చాలా సున్నితంగా తొలగించుకోవచ్చు .
సూచన: చాలా సున్నితమైన చర్మతత్వం కలిగిన వారు,ఈ హోం రెమెడీస్ ఉపయోగించడానికి ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. మరి ఆ హోం రెమెడీస్ ఏంటో ఒక సారి చూద్దాం...

హోం రెమెడీస్ ఉపయోగించడానికి ముందు, ప్యాట్ టెస్ట్ ను చెవులకు వెనుకభాగంలో వేయాలి. ఏదైనా లైట్ గా దురద, ఎర్రగా మారినట్లైతే, అది మీ అప్పర్ లిప్ హెయిర్ తొలగించడానికి కష్టం అవుతుంది. ఏటువంటి మార్పు లేకుంటే, ఈ నేచురల్ హోం రెమెడీస్ ను మీరు ఉపయోగించవచ్చు.

పెరుగు మిక్స్:
పెరుగు, శెనగపిండి మరియు పసుపు ఒక బౌల్లో వేసి, బాగా మిక్స్ చేసి, చిక్కగా పేస్ట్ అయిన తర్వాత, ఈ పేస్ట్ ను పై పెదవి మీద వేసి 15 నుండి 20 నిముషాలు అలాగే ఉంచి, డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేయాలి.

పంచదార:
నిమ్మరసంలో కొద్దిగా పంచదార వేసి బాగా మిక్స్ చేసి, వేడి చేయాలి. తర్వాత చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత, కాటన్ క్లాత్ తో అప్లై చేసి, గుండ్రంగా రుద్దాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేయాలి.

గోదుమపిండి :
అప్పర్ లిప్ హెయిర్ ను నేచరుల్ గా తగ్గించాడానికి పసుపు గ్రేట్ గా సహాయపడుతుంది . మైదా లేదా గోధుమపిండిలో కొద్దిగా పసుపు వేసి, పాలు మిక్స్ చేసి, తయారైన క్రీమ్ పేస్ట్ ను పై పెదవి మీద అప్లై చేసి 15 నిముషాలు ఎండిన తర్వాత రుద్ది, గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగి నేచురల్ గా తొలగించుకోవచ్చు.

పాలు:
ఒక గ్లాసు పాలలో కొద్దిగా పసుపు వేసి చిక్కగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను అప్పర్ లిప్ మీద , డ్రై అయిన తర్వాత రుద్ది, గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగవచ్చు.

గుడ్డు తెల్లసొన:
అప్పర్ లిప్ హెయిర్ నేచురల్ గా తొలగించడానికి ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ. ఒక టేబుల్ స్పూన్ గోదుమపిండి, పంచదారలో ఎగ్ వైట్ వేసి బాగా మిక్స్ చేసి, పేస్ట్ ను అప్పర్ లిప్ మీద అప్లై చేసి తర్వాత రుద్ది కడగాలి.

నిమ్మరసం:
నిమ్మరసంలో , కొద్దిగా నీళ్ళు, పంచదార మిక్స్ చేసి అప్పర్ లిప్ మీద అప్లై చేసి, తర్వాత డ్రై అయిన తర్వాత నీళ్లతో శుభ్రం చేసేసుకోవాలి.



Click it and Unblock the Notifications
