Latest Updates
-
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం!
చలికాలంలో చర్మం పగుళ్ళు మాయం చేసే సాల్ట్ బాడీ స్క్రబ్
శీతాకాలంలో, చలికి బయట పోలేక, ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేయడానికి చాలా సమయం ఉంటుంది. అయితే మన చర్మం సంగతేంటి? చలికాలం మనకులాగే, మన చర్మానికి కూడా నచ్చుతుంది?శీతాకాలంలో బాడీ స్క్రబ్ చాలా అవసరం. అందులోనూ మీరెప్పుడైనా సాల్ట్ బాడీ స్ర్కబ్ ను అనుసరించారా? చలికాలంలో మన చర్మం డ్రైగా, రఫ్ గా మరియు ప్యాచ్ ప్యాచ్ లుగా మార్చేస్తుంది . ఈ సమస్యలన్నింటిని మాయం చేసే సాల్ట్ బాడీ స్ర్కబ్బింగ్ వల్ల చర్మం స్మూత్ గా మరియు ప్రకాశవంతంగా మారుతుంది.
హోం మేడ్ సాల్ట్ బాడీ స్ర్కబ్ రిసిపి చర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది మరియు చేతులు, కాళ్ళు, పాదాలకు తగినంత తేమను అందిస్తుంది. చలికాలంలో సాల్ట్ బాడీ స్క్రబ్ వల్ల చర్మంను సాప్ట్ గా మరియు సిల్కీగా ఉంచుతుంది . సాల్ట్ బాడీ స్ర్కబ్ రిసిపి చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు మరియు చాలా తక్కువ సమయం పడుతుంది.
దీన్ని మనమే స్వయంగా తయారుచేసుకోగల ఒక గొప్ప బహుమతి వంటిది. ఫ్యాన్సీ బాటిల్స్ లేదా జార్ లో లో నింపి, మీకు నచ్చిన వారికి కూడా శీతాకాల బహుమతిగా అందివ్వొచ్చు.
ఈ హోం రెమెడీ సాల్ట్ బాడీ స్ర్కబ్ చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. సాల్ట్ బాడీ స్ర్కబ్ చౌకైనది మరియు అద్భుతమైన ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది . శీతాకాలంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, చర్మం దురద మరియు చిరాకుకు గురిచేస్తుంది . శీతాకాలంలో చర్మం సంరక్షణకోసం తీసుకోవల్సి జాగ్రత్తల్లో సాల్ట్ బాడీ స్కిన్ కేట్ టిప్స్ కొన్ని ఈ క్రింది విధంగా...

ఒక బౌల్లో 1/4కప్పు సాల్ట్ తీసుకొని, అందులో 1/4కప్పు కొబ్బరి నూనె మరియు 6చుక్కల రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ వేయాలి . ఈ మిశ్రమాన్ని స్పూన్ తో బాగా మిక్స్ చేసి, మూత గట్టిగా ఉన్న డబ్బలో నిల్వ చేసుకోవాలి. ఇది ఒక సింపుల్ హోం రెమెడీ సాల్ట్ బాడీ స్ర్కబ్ రిసిపి. ఈ సాల్ట్ ను మీకు అవసరం అనుకొన్నప్పుడు బాడీకి అప్లై చేసి స్ర్కబ్ చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

హేర్బల్ స్ర్కబ్ :
రెండు కప్పులు ఎప్సమ్ సాల్ట్ లో, 3/4కప్పు బేకింగ్ సోడా మరియు 3/4కప్పు హెర్బల్ పౌడర్స్ మిక్స్ చేయాలి . బాగా మిక్స్ చేసి గాలి చొరబడని డబ్బలో నిల్వచేసుకోవాలి. ఈబాడీ స్ర్కబ్ ను ఉపయోగించడానికి ముందు కొన్ని చుక్కల ల్యావెండర్ ఆయిల్ మరియు సాండిల్ వుడ్ ఆయిల్ ను మిక్స్ చేసి, చర్మానికి అప్లై చేయాలి . ల్యావెండర్ ఆయిల్ చర్మానికి విశ్రాంతి కలిగిస్తుంది.

అయోడైజ్డ్ కాని సీసాల్ట్ ను ఒక కప్పులో తీసుకొని అందులో 1/2కప్పు బాదం నూనె వేసి, 15చుక్కల హైక్వాలిటీ లెమన్ గ్రాస్ ఆయిల్ ను వేయాలి. ఈ మూడింటి మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి మూత గట్టిగా ఉండే కంటైనర్ లో వేసి ప్రతి రోజూ ఉపయోగించుకోవచ్చు. లెమన్ గ్రాస్ రిఫ్రెషింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. మిమ్మల్ని ఫ్రెష్ గా ఉంచుతుంది . బాదం ఆయిల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ చర్మంను సాఫ్ట్ గా మరియు తేమగా ఉండేట్లు చేస్తుంది.

అలొవెరా స్ర్కబ్:
రెండు కప్పుల సీసాల్ట్ లో ఒకటిన్నర్ కప్పు అలొవెరా జెల్ మిక్స్ చేసి, అందులో రెండు చెంచాల తేనె వేసి, మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గాలి చొరబడని ఒక డబ్బాలో వేసి నిల్వచేసుకోవాలి. దీన్ని చర్మం మొత్తానికి అప్లై చేసి,కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ఆలివ్ ఆయిల్ స్ర్కబ్:
సీసాల్ట్ మరియు ఆలివ్ ఆయిల్ రెండింటిని సమంగా తీసుకొని, బాగా మిక్స్ చేయాలి. ఆలివ్ ఆయిల్లో సీసాల్ట్ బాగా నాననివ్వాలి. ఈ మిశ్రమాన్ని
శరీరానికి పట్టించి, స్ర్కబ్ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల చర్మం స్మూత్ గా మారుతుంది. చలికాలంలో ఈ హోం రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది.

రోజ్మెరీలాగే ఈ పెప్పర్ మింట్ ఆయిల్ చర్మంను నునుపుగా మార్చడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఒక కప్పు ఆలివ్ ఆయిల్ మరియు 1/4కప్పు గ్లిజరిన్ సోప్ లిక్విడ్ వేసి గోరువెచ్చగా చేయాలి. తర్వాత అందులో రెండు కప్పుల సీసాల్ట్ వేసి, అందులోనే 5చుక్కల సీసాల్ట్ మరియు పెప్పర్ మింట్ ఆయిల్ వేసి మిక్స్ చేసి, చల్లారిన తర్వాత బాడీ స్ర్కబ్ గా ఉపయోగించుకోవాలి.



Click it and Unblock the Notifications
