Latest Updates
-
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా
గోళ్ళ సమస్యలకు 7 సులభ మార్గాలు
శరీరంలో ముఖం తర్వాత అందరూ గమనించేది చేతులు. తర్వాత చేతివేళ్ళు, గోళ్ళు. ముఖ్యంగా స్త్రీలు ఇంటి పనులు, వంట పనులు చేయడం వల్ల చేతులు చాలా కఠినంగా తయారవ్వడమే కాకుండా గోళ్ళు కట్ అయిపోతుంటాయి. అటువంటి గోళ్ళు ఆరోగ్యంగా పెరగాలన్నా, అందమైన ఆకృతిలో ఉండాలన్నా నెలకొకసారైనా ‘మెనిక్యూర్' చేయాలి. ప్రతిరోజూ చేతి, కాలి వేళ్లమీద పేరుకునే మృత కణాలను తొలగిస్తుండాలి. మాయిశ్చరైజర్ లేదా కొబ్బరినూనెతో మునివేళ్లను మర్దనా చేస్తే రక్తప్రసరణ బాగా జరిగి గోళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
గోళ్లపై మచ్చలు, గుంటలు, పగుళ్లు, గోరు చుట్టూ చీము పుట్టడం.. లాంటివి గోళ్లకు సంబంధించిన వ్యాధులు. సహజంగా సొరియాసిస్, ఎగ్జిమా మొదలైన చర్మ వ్యాధులతో పాటు ఫంగస్ ఇన్ఫెక్షన్ల వల్ల అందమైన గోళ్లు పాడవుతుంటాయి. చిన్నదే కదా అని అశ్రద్ధ చేయటం వల్ల గోళ్ల సమస్య అధికమవుతుంది. ముఖ్యంగా అతి శుభ్రత కోసం ఎక్కువ సమయం డిటర్జెంట్ సబ్బులతో బట్టలు ఉతకడం, నీటిలో ఎక్కువగా గోళ్లు నానడం, కడిగిన గిన్నెలనే పదే పదే కడగటం చేసే స్త్రీలలో గోళ్ల సమస్యలు ఎక్కువ.

గోరింటాకు
మెత్తగా రుబ్బిన గోరింటాకు ముద్దలో కొద్దిగా పసుపు, నిమ్మరసం కలిపి పేస్టులా చేసుకొని గోళ్లకు రాత్రి పూట పట్టించాలి. గోరింటాకు రాలిపోకుండా పలచని తెల్లగుడ్డను చుట్టి పడుకుని ఉదయాన్నే కడిగేయాలి. దీని వల్ల ఫంగస్ ఏర్పడిన పిప్పి గోళ్లు, పగుళ్లు, ముడతలు, మచ్చలు మొదలైన సమస్యలు తగ్గిపోతాయి.

బంగాళదుంప
పై పొరను తీసిన బంగాళదుంపను మెత్తగా పేస్ట్ చేయాలి. ఆ మిశ్రమానికి కొద్దిగా పసుపు కలిపి రాత్రి గోళ్లకు పట్టించి ఉదయాన్నే కడగాలి. ఇలా చేస్తే ఫంగస్ వల్ల ఏర్పడిన నలుపుదనం పోయి గోళ్లు కాంతివంతంగా తయారవుతాయి.

పసుపు
కొద్దిగా పసుపు తీసుకుని నీటితో గాని, నిమ్మరసంలో గాని కలిపి ముద్దగా చేసి వ్యాధి సోకిన భాగాల్లో గోళ్లకు పట్టించి రాలిపోకుండా తెల్లని పలుచని గుడ్డను కట్టి రాత్రి పడుకుని ఉదయాన్నే కడిగేయాలి. ఇలా చేస్తుంటే గోళ్ల సమస్యలు త్వరగా తగ్గిపోతాయి.

నిమ్మరసం
రాత్రి పడుకునే ముందు పలుచని తెల్లగుడ్డను నిమ్మరసంలో కొద్దిసేపు తడిపి వ్యాధి సోకిన గోళ్లకు చుట్టాలి. ఇలా చేస్తుంటే గోళ్ల సమస్యలు రావు. దీంతో పాటు గోళ్లపై ఉండే సహజమైన రంగు పోకుండా ఉంటుంది.

ఉల్లిపాయ రసం
పల్చటి తెల్ల గుడ్డను ఉల్లిపాయ రసంలో బాగా తడిపి వ్యాధి ఉండే గోళ్లకు చుట్టాలి. దీని వల్ల చక్కని ఫలితం కలుగుతుంది.

దోసకాయ
కూరల్లో వాడుకునే దోసకాయ ముక్కల్ని తరచుగా తింటుంటే పిప్పి గోళ్లు, గోళ్ల పగుళ్లు, మచ్చలు తగ్గిపోతాయి.

ఆలివ్ ఆయిల్:
స్వచ్చమైన ఆలివ్ నూనె గోళ్ళ సంరక్షణ తో సహా చాలా సౌందర్య సూత్రాలకు సంప్రదాయంగా గృహ చికిత్సలో భాగంగా వాడబడుతోంది. మీ చేతి లేదా కాలి వేళ్ళ గోళ్ళు అందంగా ఉండాలన్నా, మేర్వాలన్నా వాటి మీద రోజూ ఆలివ్ నూనె రాస్తూ వుంటే చాలా గుణం కనబడుతుంది.



Click it and Unblock the Notifications
