Latest Updates
-
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.!
కళ్ల కింద క్యారీ బ్యాగులు మీ అందాన్ని దెబ్బతీస్తున్నాయా ?
ఎరుపెక్కిన బుగ్గలు, పదనిసలు పలికే పెదాలు, సూటిగా ముక్కుతో చందమామలా ముఖమంతా మెరిసిపోయే ముఖం అందరి చూపుని ఆకర్షిస్తుంది. కానీ కలువల్లా రెపరెపలాడాల్సిన కళ్లు మాత్రం నల్లటి వలయాలతో అందవిహీనంగా కనిపిస్తూ ఉంటాయి. కళ్ల కింద క్యారీ బ్యాగ్ లు వయసుని, అందాన్ని దెబ్బతీసేలా కనిపిస్తూ ఉంటాయి. కళ్ల కింద ఏర్పడే ఈ నల్లటి వలయాలు పోగొట్టుకోవడానికి చేయని ప్రయత్నమంటూ ఉండదు. కానీ ఫలితం మాత్రం దొరకలేదు అని చాలా మంది ఢీలాపడుతుంటారు.
READ MORE: కళ్ల ఆకారం చెప్పె ఆశ్చర్యకర అంశాలు
క్రీములు, ఆయింట్ మెంట్స్ వాడినా ఫలితం కనిపించక విసిగిపోయింటారు. అయితే ఖర్చు పెట్టి బ్యూటీ ప్రాడక్ట్స్ తో కళ్ల కింద క్యారీ బ్యాగ్ లు తొలగించే ప్రయత్నం కంటే.. ఇంట్లోనే ఉండే చక్కటి చిట్కాలు ఫాలో అవడం మంచిది. హోం రెమిడీస్ వల్ల సులభంగా, త్వరగా కళ్ల కింద నల్లటి వలయాలు తొలగించుకోవచ్చు. అలాంటి ఈజీ టిప్స్ ఏంటో మీరే చూడండి.

బంగాళదుంప
బంగాళదుంప తినడానికి చాలా మంది ఇష్టపడతారు. ఇది రుచినే కాదు.. మీ కళ్ల కింద ఉండే డార్క్ నెస్ ని కూడా ఈజీగా తొలగిస్తుంది. కొన్ని నిమిషాలు బంగాళదుంపను ఫ్రిజ్ లో ఉంచాలి. తర్వాత రెండు ముక్కలుగా కట్ చేయాలి. తర్వాత కళ్లు మూసుకుని.. కళ్ల కింద ఈ బంగాళదుంప ముక్కతో మసాజ్ చేయాలి. కాసేపటి తర్వాత ఒక్కో కంటిపై ఒక్కో బంగాళదుంపను పెట్టుకోవాలి. అలాగే 20 నిమిషాలు పెట్టుకోవాలి.

గుడ్డులోని తెల్లసొన
కొంచెం గుడ్డులోని తెల్లసొన తీసుకోవాలి. దాన్ని కళ్ల కింద నల్లగా ఉన్న ప్రాంతంలో రాసుకోవాలి. అది ఆరిపోయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెంటనే ఫలితం ఉంటుంది.

పాలు
ఫ్రిజ్ లో పెట్టి తీసిన పాలు కొన్ని తీసుకోవాలి. అందులో దూది ముంచి తీసి.. దాన్ని కళ్లపై పెట్టుకోవాలి. అలా 20 నుంచి 30 నిమిషాలు పెట్టుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి.

టీ బ్యాగ్స్
చల్లటినీటిలో రెండు బ్యాగులు ఉంచాలి. తర్వాత కొన్ని నిమిషాలు ఫ్రిజ్ లో పెట్టాలి. తర్వాత వాటిని కళ్లపై పెట్టుకుని 25 నుంచి 30 నిమిషాల తర్వాత తీసేసి.. చల్లటినీటితో ముఖం కడుక్కోవాలి. అయితే ముఖం తుడవడానికి టవల్ ఉపయోగించకుండా అలానే ఆరనివ్వాలి.

స్పూన్స్
స్పూన్ ఎలా కళ్లకింద నలుపుని పోగొడతాయి అనుకుంటున్నారా ? నిజమే ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. రెండు స్పూన్లు తీసుకుని చల్లటి ఐస్ వాటర్ లో పెట్టాలి. తర్వాత స్పూన్లు తీసి కళ్లపై పెట్టుకోవాలి. కళ్లపైపెట్టుకున్నప్పుడు మరో రెండు స్పూన్లను ఐస్ వాటర్ లో ఉంచాలి. ఇలా అరగంటపాటు కళ్లపై ఈ స్పూన్స్ పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

టమోటారసం
రెండు స్పూన్ల టమోటా రసంలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి నల్లమచ్చలపై రాసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

రోజ్ వాటర్
రోజ్ వాటర్ లో దూదిని ముంచి అప్పుడప్పుడు కళ్లకింద తుడుస్తూ ఉంటే నల్లమచ్చలు క్రమంగా తగ్గిపోతాయి.

ఎర్రకందిపప్పు
ఎర్రకందిపప్పును పొడిగా చేసి అందులో చిటికెడు పసుపు, టమోటా, నిమ్మరసం కలిపి మిశ్రమంలా తయారు చేసుకుని కళ్లకింద అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే.. కళ్లకింద నలుపుదనం తగ్గిపోతుంది.

బాదం ఆయిల్
బాదం ఆయిల్ ని రోజూ రాత్రి పడుకునే ముందు కళ్ల కింద రాసుకుని మర్దనా చేసుకుంటే క్రమంగా నల్లటి వలయాలు తగ్గుతాయి.



Click it and Unblock the Notifications
