ఛాతీ క్రింది భాగంలో రాషెష్ (దద్దర్లు) తొలగించే హోం రెమెడీస్

By Super

ఛాతిక్రింద రాషెష్ ఏర్పడటం సాధారణ సమస్య. ఇది చాలా వరకూ చర్మం ముడుతలు పడటం వల్ల చర్మం ముడతులు పడిన ప్రదేశంలో ఇన్ఫ్లమేషన్ కు గురిఅయ్యి, రాషెష్ ఏర్పుడుతాయి. బ్రెస్ట్ రాషెష్ కు అత్యంత ముఖ్యమైన కారణం, ముడుతలు పడిన ప్రదేశంలో చెమట ఎక్కువగా పట్టడం, వేడి, సరిగా గాలితోలకపోవడం మరియు బిగుతుగా ఉండే బ్రాలు ధరించడం వల్ల, బ్రెస్ట్ వద్ద రాసుకోవడం వల్ల రాషెష్ ఏర్పడుతాయి. అంతే కాదు, వాతావరణంలో వేడి మరియు ఊబకాయం కూడా ఈ సమస్యకు ప్రధాన కారణం.

ఇలాంటి సమయంలో ఆ ప్రదేశంలో ఈస్ట్ లేదా ఇతర రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్ , ముఖ్యంగా వాతావరణ ప్రభావం వల్ల జర్మ్స్ పెరుగుతాయి. కొన్ని సార్లు, అలర్జి ప్రభావం వల్ల కూడా ఇన్ఫెక్షన్, బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. దీని వల్ల ఎరుపు ప్యాచ్లు, మంటగా ఉండటం, దురదపెట్టడం, పొడిభారడం మరియు ఎక్కువ అసౌకర్యంగా ఉంటుంది.

ఈ సమస్య నుండి బయటపడాలంటే కొన్ని సింపుల్ నేచురల్ హోం రెమెడీస్ ఉన్నాయి. ఈ సమస్యల నుండి తక్షణ ఉపశమనం అందిస్తుంది. ఇలాంటి ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ముఖ్యంగా చాతీక్రింద ఉండే రాషెష్ ను తగ్గించడానికి 10 ఉత్తమ మార్గాలున్నాయి.

1. కోల్డ్ కంప్రెసర్ :

1. కోల్డ్ కంప్రెసర్ :

చాతిక్రింద ఏర్పడే రాషెష్ ను, దురదు మరియు బర్నింగ్ సెన్షేషన్ , కోల్డ్ కంప్రెషర్ తగ్గిస్తుంది. ఒక పల్చటికాటన్ టవల్లో కొద్దిగాఐస్ తీసుకొని, ప్రభావిత ప్రాంతంలో 5నుండి 10నిముషాల వరకూ పెట్టాలి . 10 నిముషాల తర్వాత చిన్న పాటి విరామం తీసుకొని తిరిగి ప్రారంభించాలి. వెన్న తీసిన పాలను అప్లై చేయడం మరియు చల్లటి నీటితో కడగడం వల్ల దురద మరియు వాపు వంటివి తగ్గిస్తుంది. ఇది మరోక ఉత్తమ మార్గం. మరియు చల్లటి నీటితో స్నానం చేయడం. ఇలా చేయడం వల్లచర్మ రంద్రాలు శుభ్రపడి చెమట పట్టుటను నివారిస్తుంది . రాషెష్ కనపడకుండా నివారిస్తుంది.

2. కాటన్ :

2. కాటన్ :

బ్రెస్ట్ రాషెష్ ను నివారించడానికి మరో ఉత్తమ మార్గం ఛాతీ చుట్టు చెమటపట్టకుండాచూసుకోవడం. ఛాతీదిగువన కొద్దిగా కాటన్పెట్టుకోవడం వల్లచెమటనుగ్రహించేస్తుంది.దాంతో స్కిన్ రాషెష్ సమస్యఉండదు. అలాగే సాప్ట్ గా ఉండే పేపర్ టవల్స్ లేదాడిన్నర్ నాప్కిన్స్ నుఉపయోగించవచ్చు. మరియు తేలికగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి . కాటన్ దుస్తులు చెమటను సులభంగాగ్రహించేస్తుంది.

3. వెనిగర్ :

3. వెనిగర్ :

కొన్ని సమయాల్లోదుస్తుల్లో ఉండే కెమికల్ ప్రభావం వల్లబ్రెష్ట్ రాషెష్ఏర్పడటానికికారణం అవుతుంది. ఈ సమస్యనువెనిగర్ తో పరిష్కరించవచ్చు. అరబకెట్ వేడినీళ్లలో అరకప్పువైట్ వెనిగర్ నుమిక్స్ చేసిఛాతీని శుభ్రంగా కడిగా తడినినేచురల్ గా ఎండలో నిలబడి తడి ఆరనివ్వాలి. మరో మార్గం, రాషెష్ మరియుదురద ఉన్న ప్రదేశంలో ఆపిల్ సైడర్ వెనిగర్ ను అప్లై చేయాలి . ఇన్ఫెక్షన్ అయిన ప్రదేశంలో సోప్ వాటర్ తో కడిగి, చల్లటి మంచినీటితో శుభ్రం చేసుకొని డ్రై చేసుకోవాలి. ఒక కప్పు నీళ్ళలో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్చేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. దీన్ని రోజుకు రెండు, మూడు సార్లు చేయాలి.

4. కార్న్ స్టార్చ్:

4. కార్న్ స్టార్చ్:

మొక్కజొన్న పిండి, చాతీ క్రిందిభాగంలో రాషెష్ వల్లఇన్ఫెక్షన్, దురద, మంట వంటి సమస్యనునివారించడానికి కార్న్ స్టార్చ్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది చర్మం డ్రై అవ్వడానికి సహాయపడుతుంది. ఒక వేళ ఫంగల్ రాషెష్ ఉన్నట్లైతే, టాల్కం పౌడర్ ను ఉపయోగించవచ్చు. ముందుగా ప్రభావితమైన ప్రదేశాన్నిసోపు నీళ్ళతోశుభ్రం చేసుకొని , తర్వాత టవల్ తో తడి ఆర్పుకోవాలి. పూర్తిగా తడిఆరిన తర్వాత, ఆ ప్రదేశంలో కార్న్ స్టార్చ్ ను పౌడర్ వేసుకొన్నట్లు వేసుకోవాలి . ఇలా రోజుకు రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది.

సూచన: కార్న్ స్టార్చ్ ను తడి చర్మం మీద వేసుకోకూడదు. అలా వేసుకొన్నట్లైతే ఫంగల్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది.

5. కొబ్బరి నూనె :

5. కొబ్బరి నూనె :

చర్మానికి చల్లదనాన్ని, సున్నితత్వాన్ని కలిగించేది కొబ్బరినూనె . రాషెష్ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది . మరియు ఈ నూనె జిడ్డుగా ఉండటం వల్ల రాషెష్ కు కారణం అయ్యే ఫ్రిక్షన్ తగ్గిస్తుంది. మరియు ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది. స్వచ్చమైన కొబ్బరి నూనెను ప్రభావితమైన ప్రదేశంలో అప్లై చేయడం వల్ల ఇది చర్మం పూర్తిగా గ్రహించుకోబడుతుంది . దీన్ని రోజుకు రెండు లేదా మూడు సార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల రాషెష్ తగ్గిపోతాయి.

6. క్యాలమైన్ లోషన్:

6. క్యాలమైన్ లోషన్:

బ్రెస్ట్ రాషెష్ నివారించుకోవడానికి క్యాలమైన్ లోషన్ ఉపయోగించుకోవచ్చు , తక్షణ ఉపశమనం కలిగించడంతో పాటు, చల్లదాన్ని కలిగి స్తుంది. త్వరగానయం చేస్తుంది . మరియు ఆ ప్రదేశం ఎప్పుడు పొడిగా ఉండేలా చేస్తుంది. మరియు ఎటువంటి ఇన్ఫెక్షన్ కలగకుండా సహాయపడుతుంది. ఛాతీ భాగంను సోపు, గోరువెచ్చని నీటితో కడిగి, టవల్ తో తడిని పూర్తిగా ఆర్పి, కాటన్ తో కాలమైన్ లోషన్ ను అప్లై చేయాలి. రోజులో ఎన్ని సార్లైనా దీన్ని ఉపయోగించుకోవచ్చు.

7. టీ ట్రీఆయిల్:

7. టీ ట్రీఆయిల్:

టీట్రీ ఆయిల్లో యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మరియు ఇది బ్రెస్ట్ రాషెష్ ను చాలా సున్నితంగా తొలగిస్తుంది . మరియు ఇది ఫంగల్ మరియు ఇన్ఫెక్షన్ రాకుండా నిరోధిస్తుంది . నాలుగు చెంచాల ఆలివ్ ఆయిల్లో 6 చుక్కల టీట్రీ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత కాటన్ బాల్ ను ఈ మిశ్రమంలో డిప్ చేసి రాషెష్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి సున్నితంగా మర్ధన చేయాలి .అందువల్ల చర్మంలోపలికి ఆయిల్ షోషన చెందుతుంది . స్నానం చేసిన వెంటనే ఇలా చేయడం, మరియు నిద్రించడానికి ముందు కూడా ఇలా చేయడం వల్ల త్వరగా తగ్గిపోతుంది .

8. కలబంద:

8. కలబంద:

ఛాతీ క్రింది భాగంలో ఏర్పడే స్కిన్ రాషెష్ వల్ల వచ్చే దురద మరియు మంట వంటి సమస్యను కలబంద చాలా సున్నితంగా నివారిస్తుంది . తాజాగా ఉండే కలబంద రసాన్ని ప్రభావితమైన ప్రదేశంలోఅప్లై చేసి 15 నిముషాలు అలాగే ఉంచాలి. తర్వాత శుభ్రం చేసుకోవచ్చు,చేసుకోకపోయినా పర్వాలేదు. ఇంకా అలోవెరా జెల్లో, కొద్దిగా పసుపు చేర్చి బాగా మిక్స్ చేసి రాషెష్ మీద అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

9. వెల్లుల్లి:

9. వెల్లుల్లి:

కొన్ని వెల్లుల్లి రెబ్బలనుఅరకప్పు ఆలివ్ ఆయిల్లో వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఈ నూనెను రాషెష్ కు ప్రభావితం అయిన ప్రదేశంలో అప్లై చేసుకోవాలి. శుభ్రం చేసుకోవడానికి కొన్ని గంటల ముందు దీన్ని అప్లై చేసుకోవాలి. ఈ చిట్కాను రోజులో రెండు మూడు సార్లుఅనుసరించడం వల్ల ఉత్తమ ఫలితం ఉంటుంది. ఈ ఆయిల్ కు బదులుగా వెల్లుల్లిని మెత్తగా పేస్ట్ చేసి ఉపయోగించవచ్చు . పచ్చిఉల్లిపాయలను ఉపయోగించడం వల్ల త్వరగా నయం చేస్తుంది.

10. నిమ్మరసం:

10. నిమ్మరసం:

నిమ్మరసంలో విటమిన్ సి, ఇది ఒక పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ పెరుగుదలను నివారిస్తుంది మరియు త్వరగా నయం చేస్తుంది. మూడు చెంచాల నీటిలో రెండు చెంచాల నిమ్మరసం వేసి, కొద్దిగా తేనె మిక్స్ చేసి బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని రాషెష్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి 20 నిముషాల తర్వాత మంచి నీటితో కడిగేసుకోవాలి . ఈ చిట్కాను రోజుకు రెండు సార్లు, కొన్ని రోజుల పాటు చే్తే మంచి ఫలితం ఉంటుంది.

Desktop Bottom Promotion