Latest Updates
-
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా?
మీవయస్సు చిన్నది కానీ ఏజ్డ్ గా కనిబడుతారు ఎందుకనీ....
మీ వయస్సు చిన్నదే అయినా మీరు పెద్దగా కనబడుతారు ఎందుకు? మనలో చాలా మందిలో వయస్సు చాలా త్వరగా పెరుగుతున్నట్లు అనిపిస్తుంటుంది. మీరు చిన్న వయస్సులో ఉన్నా వయస్సైన వారిలా కనిపిస్తుంటే అందుకు కొన్ని లక్షణాలున్నాయి. మీ వయస్సు చిన్నదే అయినా, 30ఏళ్ళలోపు వారిలో పెద్దవారిలా కనిపించేలా చేసే లక్షణాలు కొన్ని ఉన్నాయి.
యంగ్ గా కనబడాలంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. అలా ఉండటం గ్రేట్ గా అనిపిస్తుంటుంది. మీరు ఎనర్జిటిక్, డైనమిక్, స్ట్రాంగ్ అండ్ ఫవర్ ఫుల్ గా కనబడాలనుకుంటున్నారా?
మనలో చాలా మంది ఓల్డ్ ఏజ్ అనేది చాలా ఏళ్ళ తర్వాత వచ్చేది అని ఆలోచిస్తుంటారు. అయితే అకస్మాత్తుగా మీరు వయస్సైన వారిలా కనబడేలా చేస్తుంటే మీరు చేస్తారు?
సాధారణంగా వయస్సైన వారిలా కనబడుటకు మంచి ఉదాహరణ చిన్న వయస్సులోనే జుట్టు తెల్లగా మారడం, ముఖంలో ముడుతలు ఈ లక్షణాలు కనబడితే ఎవ్వరైనా వయస్సైన వారిలానే కనిబడుతారు.
అయితే అందుకు శాస్త్రీయంగా ఎలాంటి నిర్ధారాలు లేవు, కానీ, రీసెంట్ గా జరిపిన కొన్ని పరిశోధన ద్వార హార్మోనుల్లో మార్పులు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ మరియు ఫుడ్ హ్యాబిట్స్ మరియు కొన్ని సంవత్సరాలుగా బాధ్యతల్లో మునిగితేలడం వల్ల సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల ఇలాంటి లక్షణాలు కబడుతుంటాయి.

1. జుట్టు రాలడం:
చాలా మంది పురుషుల అభిప్రాయం ప్రకారం 30 ఏళ్ళు దాటక ముందే ఎక్కువ జుట్టు రాలిపోతుందని చెబుతుంటారు. అందుకు హార్మోనుల్లో మార్పులు మరియు ఇతర కారణాల వల్ల జుట్టు అధికంగా రాలడానికి కారణం అవుతుంది.

2. పీరియడ్స్:
కొంత మంది మహిళలల్లో రుతుక్రమ సమస్యలుంటాయి. రుతుక్రమ సమస్యల వల్ల చిన్న వయస్సులోనే మోనోపాజ్ లక్షణాలను ఎదుర్కోవల్సి వస్తుంది . ఇర్రెగ్యులర్ ఈస్ట్రోజెన్ లెవల్స్ మరియు ప్రొజెస్ట్రాన్ లెవల్స్ వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది.

3. ఫుడ్ అలర్జీలు:
చాలా మంది ఇది ఏజింగ్ ఫ్యాక్టర్ గా అంగీకరించకపోయినా, ఇది వాస్తవం. ఎందుకంటే కొందరిలో వారికి నచ్చిన ఫేవరెంట్ ఫుడ్స్ తినడానికి ఇష్టకలగకపోవడం, తినడానికి నిరాకరించడం లేదా చిన్న వయస్సులోనే అలర్జీలకు గురికావడం జరుగుతుంది.

4. చర్మం:
చాలా మందిలో స్కిన్ ఎలాసిటి సమస్య ఉంటుంది. చర్మం వదులవ్వడం మరియు ఇతర మెడికల్ కండీషన్స్ వల్ల ముఖంలో చాలా తర్వగా ముడుతలు ఏర్పడుతాయి . ఏజింగ్ స్కిన్ వల్ల చిన్న వయస్సులోనే పెద్దవారిగా కనబడేలా చేస్తుంది.

5. ఆర్థరైటిస్:
కొన్ని సందర్భాల్లో కొంత మంది చిన్న వయస్సులో వీక్ బోన్స్ మరియు జాయింట్ పెయిన్స్ ఇంకా ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతుంటారు.



Click it and Unblock the Notifications
