Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
ముఖంలో ముడుతలు నివారించడానికి కూడా ఫేస్ మాస్క్ లున్నాయి...
మీరు ఎలా మేకప్ చేసుకుంటారు, ఎలా డ్రెస్సెప్ అవుతారన్నది పెద్ద విషయం కాదు, ముడుతలు కలిగిన ముఖం మీ ఎఫెర్ట్ అంతా క్షణాల్లో మాయం అవుతుంది . ముఖంలో ముడతలు కనబడుటం ఎవరికీ ఇష్టం ఉండదు. అవును, ముడుతలు వయస్సును తెలియజేయడం ఒక లక్షణం. అయితే ఈ లక్షణాల్ని అతి త్వరగా చిన్న వయస్సులోనే పొందడం లేదా, అలా కనబడే లక్షణాలు ఎక్కువగా ఇబ్బంది పడేవరకూ తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు.
ముఖం మరియు శరీరం మీద ముడుతలను నివారించుకోవడానికి వివిధ రకాల మాస్క్ లు ఉన్నాయి . ఈ ఫేస్ మాస్క్ లు మిమ్మల్ని యంగ్ గా మరియు బ్యూటిఫుల్ గా ఉంచుతుంది. చాలా తక్కువ ఎఫోర్ట్ తోనే ఇలా ముఖంలో ముడుతలను నివారించుకోవచ్చు.
READ MORE: ముఖం మీద ముడుతలు కనిపిస్తే వయసు మళ్ళిందని బెంగా...?
వివిధ రకాల ఫేస్ మాస్క్ లు ముడుతలకు వ్యతిరేఖంగా పనిచేసేవి మనకు అందుబాటులో ఉంటాయి . అయితే ముఖం మీద మాత్రమే ఏకాగ్రత పెడితే పూర్తి ప్రయోజనాలను పొందలేరు . శరీరం మొత్తం మీద ఏకాగ్రత అవసరం . చేతులు, కాళ్ళు, ముఖం, ప్రధాణంగా ఈ భాగాలే మీ వయస్సును తెలిపేవి. కాబట్టి, మీరు ముడుతలను నివారించుకోవడానికి మాస్క్ లను వేసుకోవడం ఒక ఉపాయం.
చర్మం యొక్క ఎలాసిటి(స్థితిస్థాపకతను) మరియు చర్మం తేమగా ఉంచుకోవాలంటే, చర్మంలో ముడుతలు లేకుండా చూసుకోవాలి. . కాబట్టి ముడుతలు లేని స్వచ్చమైన చర్మ సౌందర్యం పొందడానికి మీ స్నేహితులను ఆశ్చర్యపరచడానికి ఇది ఒక ఉత్తమ సమయం. మరి ఆ ఎఫెక్టివ్ అండ్ మోస్ట్ పాపులర్ వ్రింకిల్ ఫేస్ మాస్క్ ఏంటో ఒకసారి ఈ క్రింది స్లైడ్ ద్వారా చూద్దాం...

విటమిన్ సి మాస్క్:
ఇది చర్మానికి ఒక అద్భుతమైనటువంటి పరిష్కార మార్గం. ముఖ్యంగా వయస్సైనవారిలా కనబడుతుంటే, ఆరెంజ్ ఆయిల్ మరియు బాదం ఆయిల్ ను పెరుగులో వేసి మిక్స్ చేసి పేస్ట్ లా చేయాలి . ఈ మిశ్రమాన్ని ముఖం మరియు శరీరానికి అప్లై చేసి తడి ఆరిన తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి.

తేనెతో మాస్క్:
ఇది ఖచ్చితంగా చాలా సులభమైన మరియు ఎఫెక్టివ్ ఫేస్ మాస్క్ ఇది ముడుతలను తొలగించుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది. తేనె ముఖానికి అవసరం అయ్యే తేమను అందివ్వడానికి బాగా సహాయపడుతుంది. తేనెను ముఖం మరియు శరీరానికి అప్లై చేసి, అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా ప్రతి రోజూ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

అవొకాడో మాస్క్:
అవొకాడో ఫ్రూట్ మాస్క్ నేచురల్ యాంటీ వ్రింకిల్ ఫేస్ మాస్క్. అవొకాడో గుజ్జు తీసుకోవాలి, కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ ను మెత్తగా పేస్ట్ చేసి ఈ రెండింటిని మిక్స్ చేసి ముఖం మరియు శరీరానికి పట్టించి ముఖం మరియు ఇతర బాడీ పార్ట్స్ కు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

బొప్పాయి -బనానా ఫేస్ మాస్క్:
స్కిన్ పిగ్మెంటేషన్ మరియు ముడుతలను నివారించే గుణాలు బొప్పాయిలో పుష్కలంగా ఉన్నాయి . బొప్పాయి గుజ్జులో అరటిపండు గుజ్జు మిక్స్ చేడయం వల్ల మరింత ఎఫెక్టివ్ ఫలితాలను అంధిస్తుంది. ఈ రెండింటి మిశ్రమం యొక్క మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, 20నిముషాలు తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

గుడ్డు:
తేనె మాస్క్ మరియు ఎగ్ వైట్ లో స్కిన్ ఫ్రెండ్లీ ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి . ఎగ్ వైట్ చర్మాన్ని టైట్ చేస్తుంది . అదే క్రమంలో ముడుతలను పోగొడుతుంది. ఈ మిశ్రమానికి కొద్దిగా తేనె కూడా మిక్స్ చేసి అప్లై చేస్తే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . అప్లై చేసిన అరగంట తర్వాత ముఖం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆలివ్ ఆయిల్ మరియు పైనాపిల్ మాస్క్ :
ఆలివ్ ఆయిల్ మరియు పైనాపిల్ చర్మానికి పోషణను అందిస్తుంది . వీటిలో ఉండే విటమిన్ సి తీసుకొని మిక్సీలో వేసి బ్లెడ్ చేసి శరీరం మరియు ముఖానికి పట్టించి, 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications