Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
బ్యూటిఫుల్ స్కిన్ సొంతం చేసుకోవడానికి 8 నేచురల్ రెమెడీస్
ముఖంలో మొటిమలు, మచ్చలు మరియు నిర్జీవమైన మీ చర్మం చూసి..చూసి అలసిపోయారా? వివిధ రకాల స్కిన్ సమస్యలతో సతమతమౌతున్నారా...? మరేం భయం లేదు అనేక స్కిన్ సమస్యలను నివారించడానికి కొన్ని పరిష్కార మార్గాలున్నాయి.
కొన్ని హోం రెమెడీస్ ఉపయోగించడం వల్ల అసాధ్యం కానిది కూడా...సుసాద్యం అయిన పరిస్థితులు చాలానే ఉన్నాయి..! చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడం వల్ల ఫ్రూట్ మాస్క్ నుండి ఓట్ మీల్ స్క్రబ్బింగ్ వరకూ..ఇంకా వెజిటేబుల్ తొక్కలు కూడా బ్యూటీని మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. ఇలాంటి నేచురల్ పదార్థాలను చర్మానికి అప్లై చేసినప్పుడు చాల తక్కువ సమయంలో ముఖం అందంగా మెరుస్తూ మరియు బ్యూటిఫుల్ గా కనబడుతుంటుంది.
సమ్మర్ సన్ టాన్ నివారించే హోం మేడ్ ఫేస్ ప్యాక్స్
ప్రస్తుత రోజుల్లో 80శాతం మంది మహిళలు కేవలం వంటగదిలోని నేచురల్ పదార్థాల మీద ఆధారపడి, చర్మ, కేశ సౌందర్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. బామ్మలు, అమ్మమ్మల కాలం నుండి కూడా ప్రక్రుతి పరంగా వచ్చిన నేచురల్ రెమెడీ పసుపును ముఖం, కాళ్ళు, చేతులకు అప్లై చేసుకొని సన్ టాన్ మరియు అవాంఛిత రోమాలను తొలగించుకుంటున్నారు .
నోరూరించే మామిడిపళ్లలో దాగున్న 12 బ్యూటీ సీక్రెట్స్
ఇంకా పసుపు స్కిన్ స్పాట్స్ మరియు స్కార్స్ ను తొలగించడానికి గాయాలను మాన్పడానికి గ్రేట్ గా సహాయపడుతుంది . పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అందుకు గ్రేట్ గా సహాయపడుతాయి. మరి పసుపుతో పాటు మరికొన్ని నేచురల్ రెమెడీస్ ఈ క్రింది లిస్ట్ లో తెలిపిన వాటిని మీ రెగ్యులర్ బ్యూటీ రింజింలో చేర్చుకోవడం వల్ల అతి తక్కువ సమయంలోనే డిఫరెన్స్ ను మీరు గమనిస్తారు . మరికెందుకు ఆలస్యం మీరూ ప్రయత్నించండి...అందమైన చర్మ సౌందర్యాన్ని పొందండి ...

అవొకాడో మరియు హనీ మాస్క్:
ఒక మిక్సింగ్ బౌల్లో అవొకాడో పేస్ట్ 2టీస్పూన్లు , ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు రోజులకొకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ హోం రెమెడీ స్కిన్ లైటనింగ్ కోసం, డ్రై స్కిన్ నివారించుకోవడం కోసం గ్రేట్ గా సహాయపడుతుంది . అవొకాడో చర్మానికి తేమనందిస్తే...తేని చర్మంను మెరిపిస్తుంది.

బ్లూ బెర్రీ మరియు స్ట్రాబెర్రీ :
ఒక గుప్పెడు స్ట్రాబెర్రీ మరియు బ్లూబెర్రీస్ ను తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి . ఇది డ్రై స్కిన్ కు గ్రేట్ గా పనిచేస్తుంది. తర్వాత రోజ్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి . ఇది చర్మానికి చాలా గ్రేట్ గా పనిచేస్తుంది. స్కిన్ టా తొలగిస్తుంది. ఈ కాంబినేషన్ స్కిన్ ప్యాక్ యూవీరేస్ నుండి స్కిన్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది మరియు చర్మానికి తగినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది.

లెమన్ జ్యూస్ మరియు బేసన్ పౌడర్:
మొటమలతో బాధపడే వారు ఈ సింపుల్ రిసిపితో మొటిమలు మరియు మచ్చలను చాలా ఎఫెక్టివ్ గా తొలగించుకోవచ్చు. ఒక బౌల్లో రెండు చెంచాల శెనగపిండి తీసుకొని దానికి కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించాలి. మొటిమలతో కూడిన మచ్చలు మాయం అవుతాయి. డ్రైనెస్ ను నివారిస్తుంది.

తులసి :
తులసి యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది మొటిమలకు కారణం అయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది మరియు బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది . గుప్పెడు తులసి ఆకులను బాయిల్ చేసి, వాటర్ వడగట్టుకొని , ఆకులను ఉడికించి ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. కొద్దిసేపటి తర్వాత డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే స్కిన్ సాఫ్ట్ గా ఉంటుంది.

అలోవెర మరియు నిమ్మరసం:
అలోవెర చర్మానికి చాలా మంచిది . సన్ టాన్ నివారించుకొని, అందమైన లుక్ సొంత చేసుకోవాలంటే...అలోవెర జెల్లో ఒక టీస్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి ఈ పేస్ట్ ను చర్మానికి అప్లై చేసి అరగంట తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. వ్యత్యాసం చూడండి మీకు ఆశ్చర్యం కలగక తప్పదు.

బాదం మరియు బ్రౌన్ షుగర్:
ముఖాన్ని రెగ్యులర్ గా ఎక్స్ ఫ్లోయేట్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. బౌల్లో బాదం మిల్క్ మరియు బ్రౌన్ షుగర్ మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. కొద్ది సేపటి తర్వాత బాగా మర్ధన చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతుంది . తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకుంటే అందంగా కనబడుతారు.

పంచదార మరియు కోకనట్:
ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ కోకనట్ పేస్ట్ మరియు షుగర్ మిక్స్ చేసి కొద్దిగా పాలు చేర్చి ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి 1 గంట అలాగే ఉండనివ్వాలి. తర్వాత స్క్రబ్ చేయడం వల్ల డ్రైగా మారుతుంది. తర్వాత రోజ్ వాటర్ తో శుభ్రం చేసుకోవడం వల్ల డ్రై స్కిన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. పాలు మరియు కొబ్బరి పాల మిశ్రమం స్కిన్ కు తగిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది.

కాఫీపౌడర్ మరియు అలోవెర:
ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ మరియు అలోవెర మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి స్క్రబ్ చేయాలి. డ్రై అయిన తర్వాత నార్మల్ ప్లెయిన్ వాటర్ తో శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.



Click it and Unblock the Notifications