For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతి రోజు రాత్రి పడుకొనే ముందు అనుసరించవలసిన బ్యూటి అలవాట్లు

By Super
|

మనం ఎక్కువగా బయట తిరగటం వలన ఆ ప్రభావం మా జుట్టు,చర్మం మీద పడుతుంది. సూర్యుని యొక్క హానికరమైన కిరణాలు, పర్యావరణ కాలుష్యం,వాయు కాలుష్యం చర్మం,జుట్టును నాశనం చేస్తున్నాయి.

మనం నిద్ర పోయినప్పుడు చర్మంలో పునరుద్ధరించటం మరియు చైతన్యం కలుగుతుంది. అందువలన కొన్ని సాధారణ దశలను అనుసరించడం ద్వారా చర్మం మరింత ఆరోగ్యకరమైన మరియు దాని స్థితిస్థాపకత మరియు సున్నితత్వం నిర్వహించడానికి సహాయం చేయవచ్చు.

రాత్రి సమయంలో సరైన జుట్టు మరియు చర్మ సంరక్షణ వలన మెరుపు మరియు మృదుత్వం వస్తాయి. రాత్రి సమయంలో చర్మం మీద రసాయనాలు లేని మేకప్ ని ఉంచటం మంచిది.

చర్మం టోన్ మెరుగుపరచడానికి, చర్మంలో మచ్చలు తగ్గించడానికి మరియు చర్మం ఆర్ద్రీకరణ స్థితిలో ఉంచేందుకు సహాయపడతాయి. అందుకే రాత్రి సమయంలో జుట్టు,చర్మం సంరక్షణ ఎలా చేయాలో తెలుసుకుందాం.

రాత్రి పడుకొనే ముందు చేయవలసిన దశల గురించి తెలుసుకుందాం. అందువలన ఇప్పుడు Boldsky ఈ దశల గురించి వివరంగా ఈ వ్యాసంలో చెప్పుతుంది.

మేకప్ తొలగించాలి

మేకప్ తొలగించాలి

కొంత మంది మహిళలు మేకప్ తీయకుండానే పడుకుంటారు. ఈ అలవాటు చర్మాన్ని అధ్వాన్నంగా చేస్తుంది. ఈ విధంగా చేయుట వలన మొటిమలు,చర్మ రంద్రాలకు అడ్డుపడటం మరియు వృద్దాప్య ప్రక్రియ వేగవంతం అవుతుంది. అందువలన రాత్రి సమయంలో పడుకొనే ముందు తప్పనిసరిగా మేకప్ తొలగించాలి.

రెండు దిండ్లు ఉపయోగించాలి

రెండు దిండ్లు ఉపయోగించాలి

రెండు దిండ్లను ఉపయోగిస్తే కంటి ఉబ్బు తగ్గుతుంది. గురుత్వాకర్షణ కారణంగా శోష రసం మరియు రక్తం ముఖం మరియు కళ్ళ కింద పేరుకుపోకుండా ఉంటుంది. కాబట్టి నిద్ర పోయేటప్పుడు రెండు సన్నని దిండ్లను ఉపయోగించాలి.

పాదాలకు పెట్రోలియం జెల్లీ రాయాలి

పాదాలకు పెట్రోలియం జెల్లీ రాయాలి

రాత్రి పడుకొనే ముందు పాదాలకు పెట్రోలియం జెల్లీ రాయటం మర్చిపోకూడదు. ఈ విధంగా రాయటం వలన పాదాల పగుళ్ళు తగ్గటమే కాకుండా పాదాలు మృదువుగా మారతాయి. పాదాలను సాక్స్ తో కవర్ చేయాలి.

చేతులకు క్రీం రాయాలి

చేతులకు క్రీం రాయాలి

ప్రతి రోజు రాత్రి సమయంలో చేతులకు క్రీం రాస్తే చేతులు నునుపుగా మరియు మృదువుగా ఉంటాయి. అంతేకాక చేతులకు తేమ బాగా అందుతుంది. అయితే తేలికపాటి క్రీం ని ఉపయోగించాలి.

తల దువ్వుకోవాలి

తల దువ్వుకోవాలి

రాత్రి పడుకొనే ముందు తప్పనిసరిగా తల దువ్వుకోవాలి. జుట్టు తంతువుల నిర్వహణ బాగుంటుంది. అలాగే తల మీద చర్మంలో రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు పతనాన్ని ఆపుతుంది.

English summary

Beauty Habits To Follow Every Night

Our skin and hair are more prone to damage because we spend most of the time outdoors. The harmful rays of the sun, environmental factors and air pollutants play a major havoc to our skin and hair.
Desktop Bottom Promotion