Latest Updates
-
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.!
పాదాల పగుళ్లు మాయం చేసే ఎఫెక్టివ్ టిప్స్
పాదాలు చిట్లిపోయి చిరాగ్గా కనిపిస్తున్నాయా ? ఎలాంటి చెప్పులు వేసుకున్నా.. మీ పాదాల మీ అందాన్ని దెబ్బతీస్తున్నాయా ? చలికాలంలో అందరినీ వేధించే సమస్యే ఇది. చర్మం పొడిబారడం, జుట్టు చిట్లిపోవడం, పాదాలు పగలడం వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి. అయితే.. పాదాల పగుళ్లకు చెక్ పెట్టడానికి కెమికల్ క్రీమ్స్ కంటే.. ఇంట్లోనే చక్కటి పరిష్కారాలు పాటించడం చాలా మంచిది.

కొబ్బరినూనె:
పాదాల పగుళ్లకు చెక్ పెట్టడానికి సులువైన మార్గం కొబ్బరినూనె. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సహజసిద్ధమైన సౌందర్యాన్నిస్తుంది. ప్రతి రోజూ రెగ్యులర్ గా పాదాలకు రాత్రిపూట కొబ్బరినూనెతో మసాజ్ చేయడం వల్ల మీ పాదాలు స్మూత్ గా తయారవుతాయి. ఇది చిటికెలో మీ పాదాల పగుళ్లను మాయం చేస్తుంది.
ఆలివ్ ఆయిల్:
పాదాలను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఆలివ్ నూనె రాసుకోవాలి. తర్వాత సాక్స్ వేసుకుని పడుకుంటే.. ఉదయానికి చర్మం స్మూత్ గా తయారవుతుంది. ఉదయాన్నే ఫ్యూమిన్ స్టోన్ తో రుద్దుకోవడం వల్ల పాదాలలో ఉండే డెడ్ స్కిన్ ఊడిపోతుంది. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల పాదాల పగుళ్లు తగ్గిపోతాయి.

గోరింటాకు:
గోరింటాకు పాదాల పగుళ్లు మటుమాయం చేయడంలో చక్కగా పనిచేస్తుంది. గోరింటాకును రుబ్బుకుని పగుళ్లు ఉన్న చోట రాసుకుని తర్వాత కడిగేస్తే.. పగుళ్లు తగ్గిపోతాయి. గోరింటాకు శరీరంలో ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది. శరీరంలో వేడి ఎక్కువైనప్పుడు పాదాలు పగుళ్లు కనిపిస్తాయి.



Click it and Unblock the Notifications
