మెడ నలుపును మాయం చేసే ఎఫెక్టివ్ హోం రెమెడీస్

By Super Admin

చాలా మంది మెడ మీద డార్క్ బ్లాక్ ప్యాచెస్ తో ఇబ్బంది పడుతుంటారు . దీన్నే కామన్ స్కిన్ పిగ్మెంటేషన్ అంటుంటారు. ఇది బాహ్య చర్మ యొక్క పొరలలో జీవకణములు దళసరియగుట వల్ల చర్మం నల్లగా మారుతుంది. ఇది ఒక సాధారణ సమస్య. ఇది అంటువ్యాధి కాదు. శరీరం అంతా తెల్లగా ఉండి, మెడ క్రింద చాలా నల్లగా ఉంటుంది. గీతలు, గీతలుగా ఉండి మందపాటి అట్టలాగా పేరుకు పోయిన నలుపుతో ఉన్న వారు నలుగురులోకి రావడానికి ఇబ్బంది పడుతుంటారు. తెల్లటి శరీర ఛాయ ఉన్నా, మెడ చుట్టూ నలుపు వల్ల అందరితో చొరవగా కలవలేకపోతుంటారు.

చాలా మందిమీద కనపరిచే శ్రద్ధ మెడమీద చూపించరు. మెడ నల్లగా ఉన్నా, ఆపరిశుభ్రంగా ఉన్నా పట్టించుకోరు. ముఖం అందంగా ఉంటే చాలు అని అనుకుంటారు. కానీ మెడ అందంగా పరిశుభ్రంగా లేకపోతే దాని ప్రభావం ముఖం అందం మీద కూడా పడుతుందని బ్యూటీషియన్లు అంటున్నారు. ముఖంతో పాటు మెడ అందం కూడా ముఖ్యమేనని వారు చెబుతున్నారు. ముఖంతో సమానంగా మెడ అందంగా ఉంచుకోవడాని కొన్ని సులభ చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. వీటితో మీ మెడ సౌందర్యంను పెంపొందించుకోవచ్చు. ...

బాదం:

బాదం:

బాదంలో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. బాదం చర్మంకు తేమ అందిస్తుంది. స్కిన్ పిగ్మెంటేషన్ తొలగిస్తుంది.

అరటి:

అరటి:

అరటిపండ్లలో సాలిసిలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది, ఇది నేచురల్ స్కిన్ బ్లీచర్ గా పనిచేస్తుంది. డార్క్ స్కిన్ సెల్స్ ను లైట్ గా మార్చుతుంది

అరటిపండును మెత్తగా చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ పంచదార , కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ హోం మేడ్ మాస్క్ తో మెడకు స్ర్కబ్ చేయాలి, 10 నిముషాలు చేసిన తర్వాత, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

కీరదోసకాయ

కీరదోసకాయ

కీరదోసకాయలో వాటర్ కంటెంట్, మినిరల్స్ విచ్ఛిన్నమైన చర్మకణాలను నయంచేస్తుంది. దాంతో స్కిన్ టోన్ మెరుగుపడుతుంది.

ఒక బౌల్లో కీరదోసకాయ జ్యూస్ తీసుకుని, అందులో ఒక టీస్పూన్ నిమ్మరసం వేసి, కాట్ బాల్ డిప్ చేసి, డార్క్ నెక్ మీద మర్ధన చేయాలి. డ్రైగా మారిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

వాల్ నట్స్ :

వాల్ నట్స్ :

వాల్ నట్స్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి, ఇవి స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ గా పనిచేస్తాయి, డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది, చర్మం క్రింద స్కిన్ క్లియర్ గా ఉంటుంది.

వాల్ నట్ ను మెత్తగా పౌడర్ చేసి, రోజ్ వాటర్ తో మిక్స్ చేసి మెత్తగా పేస్ట్ చేయాలి. దీన్ని మెడకు మొత్తం అప్లై చేయాలి. డ్రైగా మారిన తర్వాత స్ర్కబ్ చేసి, శుభ్రం చేసుకోవాలి. చివరగా ఐస్ క్యూబ్స్ తో మర్ధన చేయాలి.

నిమ్మరసం & రోజ్ వాటర్ :

నిమ్మరసం & రోజ్ వాటర్ :

హెర్బల్ మాస్క్ లో నేచురల్ బ్లీచింగ్ లక్షణాలు మరియు సిట్రిక్ యాసిడ్ ఉన్నాయి.ఈ మాస్క్ వేసుకవడం వల్ల మెడ మీద డార్క్ నెస్ ను తొలగిస్తుంది. కొత్త కణాలను రీజనరేట్ చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి, అదే పరిమాణంలో రోజ్ వాటర్ మిక్స్ చేయాలి. అందులో కాటన్ డిప్ చేసి, మెడ మీద మర్ధన చేయాలి. ఇది మెడ మొత్తం పీల్చు, స్కబ్ చేసి శుభ్రం చేసుకోవాలి.

పెరుగు , పసుపు :

పెరుగు , పసుపు :

ఈ మాస్క్ లో ఉండే అసిటిక్ యాసిడ్, యాంటీఆక్సిడెంట్స్ చర్మంను స్మూత్ గా మార్చుతాయి. చర్మంలో మలినాలను తొలగిస్తాయి, చర్మం లోపల నుండి క్లియర్ స్కిన్ అందిస్తుంది.

ఒక టేబుల్ స్పూన్ పెరుగులో ఒక టేబుల్ స్పూన్ పసుపు మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను మెడకు మొత్తం అప్లై చేయాలి. 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

అలోవెర :

అలోవెర :

అలోవెరలో ఉండే అలోసిన్ , ముఖ్యమైన విటమిన్స్ నేచురల్ స్కిన్ బ్లీచర్ గా ఉపయోగపడుతుంది. ప్యూర్ అలోవెర జెల్ ను మెడకు అప్లై చేయాలి. ఒక గంట అలాగే ఉండనిచ్చి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఓట్ మీల్ :

ఓట్ మీల్ :

ఓట్ మీల్లో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది స్కిన్ ఎక్సఫ్లోయేట్ చేస్తుంది. స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది మరియు స్కిన్ సాస్ట్ గా మార్చుతుంది.

ఓట్స్ పొడి తీసుకుని, అందులో టమోటో గుజ్జును మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను మెడ మొత్తానికి అప్లై చేయాలి. 30 నిముషాలు ఆగిన తర్వాత, స్క్రబ్ చేసి శుభ్రం చేసుకోవాలి

బంగాళదుం :

బంగాళదుం :

బంగాళదుంపలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ ఎ , డార్క్ స్కిన్ ను తొలగించడంలో గొప్ప బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది, ఇది స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. స్కిన్ పిగ్మెంటేషన్ నివారిస్తుంది. బంగాళదుంపను సన్నగా స్లైస్ గా కట్ చేసి, మెడకు మెత్తానికి అప్లై చేయాలి. 5 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

స్ట్రాబెర్రీస్ మరియు బొప్పాయి:

స్ట్రాబెర్రీస్ మరియు బొప్పాయి:

నేచురల్ ఎంజైమ్స్ మరియు విటమిన్ సి, హోం మేడ్ మాస్క్ వల్ల డార్క్ నెక్, డ్యామేజ్ స్కిన్ టిష్యులు , చర్మాన్ని లైట్ గా మార్చి, స్మూత్ గా మార్చుతాయి.

ఒక టేబుల్ స్పూన్ బొప్పాయి , 2 స్ట్రాబెర్రీలు, మెత్తగా పేస్ట్ చేసి, దీన్ని మెడకు అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

శెనగలు:

శెనగలు:

డార్క్ నెక్ నివారించడంలో శెనగపిండి చాలా ఎఫెక్టివ్ గా మార్చుతుంది. ఇది సాలిసిలిక్ యాసిడ్ , స్కిన్ పిగ్మెంటేషన్ ను లైట్ చేస్తుంది, స్కిన్ టోన్ లైట్ చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ శెనగపిండిని తీసుకుని, అందులో చిటికెడు పసుపు మిక్స్ చేయాలి. వాటర్ మిక్స్ చేసి, స్మూత్ పేస్ట్ లా తయారుచేసి, మెడకు అప్లై చేసి 20 నిముషాల తర్వాత స్ర్కబ్ చేసి, వాష్ చేయాలి.

బియ్యం నీళ్ళు:

బియ్యం నీళ్ళు:

బియ్యం గంజి స్కిన్ పిగ్మెంటేషన్ ను నివారిస్తుంది . ఫ్రెష్ గా వంచిన గంజి తీసుకుని, చల్లారిన తర్వాత కాట్ బాల్ డిప్ చేసి, మెడకు మసాజ్ చేయాలి. 5 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

Story first published: Tuesday, September 27, 2016, 21:00 [IST]
Desktop Bottom Promotion