డబుల్ చిన్ నివారించడానికి ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ...!!

చాలా మందికి గెడ్డం కింద చర్మం సాగినట్లు ఉంటుంది. చూసే వాళ్ళు దాన్ని డబుల్ చిన్ అనుకుంటారు. ఇది పెద్ద సమస్య కాకపోయినా మన అందాన్ని దెబ్బతీస్తుంది. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి? అనుకునేవాళ్లకు సిం

చాలా మందికి గెడ్డం కింద చర్మం సాగినట్లు ఉంటుంది. చూసే వాళ్ళు దాన్ని డబుల్ చిన్ అనుకుంటారు. ఇది పెద్ద సమస్య కాకపోయినా మన అందాన్ని దెబ్బతీస్తుంది. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి? అనుకునేవాళ్లకు సింపుల్ గా చిట్కా ఉంది. డబుల్ చిన్ కు కారణం జన్యుపరమైన సమస్యలు, అధిక బరువు, వయసురీత్యా గడ్డం కింది భాగం కిందికి సాగుతుంది.

అందానికి చుబుకం కూడా ఓ కారణం. చాలామందికి గడ్డం కింద మరో చిరు గడ్డం వస్తుంటుంది. దాన్నే డబుల్ చిన్ అంటారు. కొంతమందికి ఇది వయసు పెరిగినప్పుడు వస్తుంది. మరికొందరికి జన్యులోపాల కారణంగా వస్తుంది. సౌందర్య స్పృహ ఎక్కువగా ఉన్నవారు ఈ డబుల్ చిన్‌తో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ కింది విషయాలను పాటిస్తే చాలు..మీ సమస్య దూరమవుతుంది.

వీట్ జర్మ్ ఆయిల్ :

వీట్ జర్మ్ ఆయిల్ :

వీట్ జర్మ్ ఆయిల్లో విటమిన్స్ విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. దీన్ని ఉపయోగించడం వల్ల డబుల్ చిన్ చాలా సులువుగా తొలగించుకోవచ్చు. వీట్ జర్మ్ ఆయిల్ ను గడ్డం క్రింది నుండి అప్లై చేసి అప్ వార్డ్ డైరెక్షన్ లో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బెస్ట్ రిజల్ట్ కోసం ఈ నూనెను రాత్రుల్లో అప్లై చేసి మసాజ్ చేయడం బెస్ట్ . గోధుమ మొలకల నుంచి తీసిన నూనె (వీట్ జెర్మ్ ఆయిల్) ఈ డబుల్ చిన్ సమస్యను త్వరగా దూరం చేస్తుంది. అందులోని విటమిన్-ఇ చర్మాన్ని బిగుతుగా మార్చడానికి ఉపయోగపడుతుంది. రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు 10-15 నిమిషాల పాటు ఈ నూనెతో గొంతుకు కింది నుంచి మీదకు మర్దన చేయాలి. ఆ నూనెను తుడుచుకోకుండానే నిద్రపోవాలి. ఉదయం లేచాక చల్లటి నీటిలో ముంచిన టిష్యూతో నూనెను తుడిచేయాలి.

మిల్క్ మసాజ్:

మిల్క్ మసాజ్:

అవును డబుల్ చిన్ తగ్గించుకోవడానికి మరో సులభమైన పద్దతి మసాజ్ . మసాజ్ కోసం పాలను ఉపయోగిస్తే మంచిది. ఇది చర్మంను టైట్ గా మార్చడానికి సహాయపడుతుంది . ఇది స్కిన్ ఎలాసిటి పెంచుతుంది. అంతే కాదు, పాలలో క్యాల్షియం, విటమిన్ డిలు అధికంగా ఉంటాయి. ఇవి బ్యూటిఫుల్ అండ్ స్మూత్ స్కిన్ ను పొందడానికి సహాయపడుతుంది.

షుగర్ లెస్ చూయింగ్ గమ్:

షుగర్ లెస్ చూయింగ్ గమ్:

చూయింగ్‌గమ్‌ను మరువకండి. మీ దవడకండరాలకు, బుగ్గులకు ప్రభావితమైన ఎక్సర్‌సైజ్‌. తరచూ గమ్‌ను నములుతుంటే డబుల్‌ చిన్‌ సమస్య పెరగదు. అయితే షుగర్‌ లేని చూయింగ్‌గమ్‌ను ఎంచుకోవడం మరువొద్దు.ఈ డబుల్ చిన్ నుంచి దూరమవ్వాలంటే ఫేషియల్ మజిల్స్‌కు పని చెప్పాల్సిందే. త్వరగా డబుల్ చిన్ సమస్య తొలగిపోవాలంటే రోజుకు వీలైనన్ని షుగర్ లెస్ గమ్స్‌ను నమలండి. ఎలాంటి దంత సమస్యలు రాకుండా మంచి ఫలితం కనిపిస్తుంది

వాటర్ ఎక్కువగా తాగాలి:

వాటర్ ఎక్కువగా తాగాలి:

రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్ళు తాగడం వల్ల హెల్తీగా ఉంటారు. వాటర్ సరిపడా తాగడం, వాటర్ కంటెంట్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల డబుల్ చిన్ ఏర్పడదు.

గ్రీన్ టీ :

గ్రీన్ టీ :

గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. గ్రీన్ టీ చర్మంలో ఎలాసిటిని పెంచుతుంది. చర్మంలో ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది. గ్రీన్ టీ బ్యాగ్స్ ను చర్మానికి అప్లై చేసి మసాజ్ చేయాలి.

.

గుడ్డు తెల్లసొనతో

గుడ్డు తెల్లసొనతో

గుడ్డు తెల్లసొనతో ప్యాక్ వేసుకుంటే డబుల్ చిన్ తగ్గే అవకాశాలు ఎక్కువే. ఓ గిన్నెలో రెండు కోడిగుడ్ల తెల్లసొనను తీసుకోవాలి. అందులో పాలు, తేనె, నిమ్మరసం కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్, మెడకు ప్యాక్ వేసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే స్కిన్ టైట్ అవుతుంది. దాంతో డబుల్ చిన్ మాయమవుతుంది.

వ్యాయామం ప్రధానం:

వ్యాయామం ప్రధానం:

ముందు ఒక కుర్చీలో వెన్నెముకను నిటారుగా పెట్టి కూర్చోవాలి. తర్వాత తలను పైకి ఎత్తి ఫ్యాన్‌ను చూస్తూ, అలకలో ఉన్నప్పుడు మూతిని ఎలా ముడుచుకుంటారో అలా పెట్టి పది సెకన్లు ఉండాలి. ఇలా కొన్ని వారాల పాటు రోజూ ఆరు సార్లు చేయాలి. దాంతో డబుల్ చిన్ తప్పకుండా మాయమవుతుంది.

కొకో బటర్

కొకో బటర్

కొకో బటర్ వాడకంతో కూడా డబుల్ చిన్ త్వరగా తగ్గుతుంది. ఇది చర్మం సాగుదలకు బాగా దోహద పడుతుంది. దాని కోసం కొకో బటర్‌ను కొద్దిగా వేడి చేసి చాలాసేపు గొంతు, డబుల్ చిన్ ప్రాంతంలో మర్దన చేయాలి. ఉదయం స్నానానికి ముందు, రాత్రి నిద్రపోవడానికి ముందు ఇలా రోజుకు రెండుసార్లు చేయడం మంచి పరిష్కారం.

 గ్లిజరిన్‌ మరొక పరిష్కారం.

గ్లిజరిన్‌ మరొక పరిష్కారం.

గ్లిజరిన్‌ అత్యధిక స్నిగ్ధత కలిగిన పదార్థం. ఇందులోకి కాస్త రోజ్‌వాటర్‌ కలుపుకుని ముఖానికి మాస్క్‌ వేసుకుంటే.. చర్మం బిగుతైపోతుంది.

Story first published: Saturday, November 5, 2016, 15:35 [IST]
Desktop Bottom Promotion