Latest Updates
-
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
వింటర్లో పాదాల సంరక్షణ..పాదాలు పగల కుండా డెడ్ స్కిన్ తొలగించే సింపుల్ టిప్స్ ..
వింటర్ సీజన్లో డ్రై స్కిన్ అండ్ డెడ్ స్కిన్ చాలా మేజర్ ప్రాబ్లెమ్ గా గుర్తిస్తారు . వింటర్ సీజన్లో ప్రతి ఒక్కరూ ఈ సమస్యను ఎదుర్కొంటుంటారు. వింటర్ సీజన్లో చర్మం మాయిశ్చరైజర్ ను కోల్పోతుంది . అందువల్ల, ఎప్పటికప్పుడు చర్మంలో తేమను నింపడానికి తగినంత మాయిశ్చైజర్స్, హోం రెమెడీస్ ను ఉపయోగించాల్సి ఉంటుంది.
కొంత మంది బ్యూటీ ఎక్స్ పర్ట్స్ ప్రకారం వింటర్ సీజన్లో పాదాల కోసం ఉపయోగించే నేచురల్ పదార్థాలను ఉపయోగించడం వల్ల పాదాల పగుళ్ళు తగ్గుతాయి మరియు చర్మం పగుళ్ళ నుండి విముక్తి పొందవచ్చు అని అంటున్నారు . వింటర్ సీజన్లో చర్మం రంగు కూడా మారిపోతుంటుంది. చర్మం చూడటానికి నిర్జీవంగా కనిపిస్తుంటుంది.
చలికాలంలో చర్మం పగుళ్ళు మాయం చేసే సాల్ట్ బాడీ స్క్రబ్
నేచురల్ అలోవెరనాను డైరెక్ట్ గా ఉపయోగించడం వల్ల చర్మం యొక్క క్వాలిటీ మరియు ట్రెక్చర్ పెరుగుతుంది. మరియు ఇది హోం రెమెడీస్ ను డ్రై ఫీట్ మీద అప్లై చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఈ నేచురల్ రెమెడీస్ ను అప్లై చేయాలంటే చర్మానికి డీప్ గా అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి, ఇలా డీఫ్ గా మాయిశ్చరైజర్స్ ను అప్లై చేయడం వల్ల చర్మంలో రక్తప్రసరణ మెరుగౌతుంది. దాంతో చర్మం హెల్తీగా మరియు కాంతివంతంగా కనబడుతుంది.
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా మార్చే హెల్తీ వింటర్ ఫుడ్స్
ముఖం, చేతులు మీద మాత్రమే కాదు, పాదాల మీద డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడానికి యాంటీసెప్టిక్ సోప్స్ ను లేదా మైల్డ్ షాంపును ఉపయోగించుకోవచ్చు. డ్రై స్కిన్ తొలగించుకోవడంతో పాటు, చర్మం పగుళ్ళ ద్వారా ఏర్పడ్డ చిన్ని చిన్న గాయాలను మరియు వింటర్లో వచ్చే స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవచ్చు . సోప్ తో పాదాలను శుభ్రం చేసుకొన్న తర్వాత , తడి పూర్తిగా ఆరనివ్వాలి. తర్వాత నేచురల్ హోం రెమెడీస్ ను అప్లై చేయడం వల్ల పాదాల మీద ఏర్పడ్డ డెడ్ స్కిన్ సెల్స్ ను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.
చలికాలంలో నీళ్లు తాగడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా ?
ఈ నేచురల్ హోం రెమెడీస్ ను పాదాలకు అప్లై చేయడానికి ముందు చిన్న ప్యాచ్ టెస్ట్ ను చేయడం మంచిది. దీని ద్వారా మీకు ఎలాంటి చీకాకు, లేదా దురద, ఇన్ఫెక్షన్ కలిగినా వాటికి దూరంగా ఉండవచ్చు. కొన్ని రకాల చర్మ తత్వాలకు ఇవి సరిగా సరిపడకపోవచ్చు. కాబట్టి ప్యాచ్ టెస్ట్ చేయడం వల్ల చర్మం డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు. మరి డెడ్ స్కిన్ సెల్స్ తొలగించే నేచురల్ హోం రెమెడీస్ ఏంటో చూద్దాం...

కలబంద
ఫ్రెష్ గా ఉండే అలోవెర జెల్ ను కంట్ చేసి, ఈ జెల్ ను పాదాల మొత్తం అప్లై చేయాలి. అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ జెల్ తడి ఆరి డ్రైగా మారేవరకూ ఉండి, తర్వాత సాక్స్ లు ధరించి రాత్రి నిద్రించే ముందు కాళ్ళను శుభ్రం చేసుకోవాలి.

తేనె:
ఏలాంటి చర్మ తత్వానికైనా తేనెను ఒక గోల్డెన్ హోం రెమెడీగా ఉపయోగిస్తుంటారు . ఎందుకంటే తేనె యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇది ఇతర ఇన్ఫెక్షన్స్ కూడా నివారిస్తుంది . మీ డ్రై ఫీట్ మీద తేనెను మసాజ్ చేసి 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత సాక్స్ లను వేసుకోవాలి.

గ్లిసరిన్ :
గ్లిజరిన్ పాదాల పగుళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది. గ్లిజరిన్ మరియు నిమ్మరసం సమంగా తీసుకొని మిక్స్ చేయాలి. తర్వాత దీన్ని పాదాలకు పట్టించవచ్చు లేదా అరబకెట్ వాటర్లో మిక్స్ చేసి పాదాలను అందులో డిప్ చేసి, 20 నిముషాల పాటు అలాగే ఉండాలి . దీన్ని శుభ్రం చేయడానికి ముందు గోరువెచ్చని నీటితో కడిగేసుకొని తర్వాత శుభ్రం చేసుకోవాలి .ఈ హోం రెమెడీని నిద్రించడానికి ముందు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఎప్సమ్ సాల్ట్:
ఎప్సమ్ సాల్ట్ లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది స్కిన్ ను మరింత బెటర్ గా చేస్తుంది . ఎప్సమ్ సాల్ట్ ను వాటర్లో మిక్స్ చేసి ఆ నీటిని వారానికి రెండు సార్లు ఉపయోగిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ సాల్ట్ చర్మాన్ని స్మూత్ గా మార్చుతుంది మరియు డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది.

కొబ్బరి నూనె:
నిద్రించడానికి ముందు కొద్దిగా కొబ్బరి నూనెను చేతులకు రాసుకొని, రెండు చేతులతో డ్రైగా మారిన పాదాలను మసాజ్ చేయాలి. 15నిముసాల పాటు ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది . ఈ ఆయిల్ చర్మంలోపలికి చొచ్చుకుపోయే విధంగా చేసి తర్వాత సాక్స్ లను ధరించాలి. తర్వాత మరుసటి రోజు ఉదయం పాదాలను శుభ్రం చేసుకోవాలి.

ఆలివ్ ఆయిల్:
3 చెంచాల ఆలివ్ ఆయిల్ ను హీట్ చేసి, ఈ నూనెను డ్రైగా మారిన పాదాల మీద అప్లై చేసి మసాజ్ చేయాలి. 10 నిముషాల తర్వాత వాజలైన్ ను అప్లై చేయాలి . తర్వాత వార్మ్ సాక్స్ ధరించాలి. మరుసటి రోజు ఉదయం పాదాలను శుభ్రం చేసుకోవాలి.

. వింటర్ పెడిక్యూర్:
వింటర్లో ఈ సింపుల్ రెమెడీని చాలా ఎఫెక్టిగా పనిచేస్తుంది . ఒక నెలలో రెండు హేర్బల్ పెడిక్యూర్ పద్దతులను అనుసరించాలి. ఇది ఖచ్చితంగా చర్మాన్ని సంరక్షిస్తుంది మరియు ఇతర చర్మ సమస్యలను నిరోధిస్తుంది .



Click it and Unblock the Notifications