Just In
- 34 min ago May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- 1 hr ago పుచ్చకాయ జ్యూస్ లో ఈ ఒక్కటి కలిపి తాగితే చాలు వేసవి ఆరోగ్య సమస్యలు బలాదూర్..మీ శరీరానికి శాంతం..ఉపశమనం
- 2 hrs ago కుబేర యోగం తో మే 1 నుంచి ఈ మూడు రాశుల వారికి ధనం, ఐశ్వర్యం, సంపదలు పెరుగుతాయి
- 4 hrs ago 24 ఏప్రిల్ 2024: ఈ రోజు రాశి ఫలాలు మీ రాశికి ఈ రోజు ఎలా ఉంటుంది ఏ పనులు చేస్తే మంచిది ఇక్కడ తెలుసుకోండి..
అల్లం పేస్ట్ తో పాదాల దుర్వాసనకు చెక్!
పాద సంరక్షణకు అల్లంపేస్ట్ గ్రేట్ రెమెడీ...ఆశ్చర్యం కలిగుతోందా..అయితే మీరు పాదాల సంరక్షణలో అల్లం పేస్ట్ ఎలా పనిచేస్తుందన్న విషయం గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే..మీరు ఖరీదైన పెర్ఫ్యూమ్ ని రాసుకుని, గదిలోకి వెళ్ళినపుడు, ఎంతో నమ్మకంతో కూర్చుంటారు. మీరు ఒక కుర్చీలో కూర్చుని, కళ్ళు బైటికి చాచినపుడు, మీ పక్కన కూర్చున్న వ్యక్తి మీ పాదాల వాసన వల్ల మూలకు జరుగుతాడు!
మీరు కొత్తగా కొనుకున్న పెర్ఫ్యూమ్ వాసన ఎక్కువగా ఉందా లేదా మీ పాదాల వాసనకు ముక్కుపుటాలు అదురుతున్నాయా? ఆ భయంకరమైన వాసన చూసి, తెలుసుకోడానికి కొంత సమయం పట్టొచ్చు. మీ పాదాలు నిజంగా దుర్గంధంగా ఉంటే, మీ వాసన పాదాల సమస్యకు చికిత్స అల్లాన్ని నిల్వ ఉంచుకోవడమే అని మేము సూచిస్తాము!
అల్లం ఉపయోగించి పాదాలకు ఔషధ౦ తయారుచేసే ముందు, పాదాలలో వాసన ఎందుకు ఒస్తుందో తెలుసుకోవాలి. ఇక్కడ ప్రధాన దోషి బిగుతుగా ఉన్న బూట్లు, గాలిబారక, పాదాలలో వాసన వస్తుందని సూచిస్తుంది!
అది కాకుండా, వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం, హార్మోన్ల అసమతుల్యత, అధిక వత్తిడి, హైపర్ హైడ్రాసిస్ వంటి వాటివల్ల కూడా పాదాలలో దుర్గంధం రావొచ్చు!
పచ్చి అల్లం తినడం వల్ల శరీరంలో జరిగే అద్భుత మార్పులు..
దాదాపు 5 గురు వ్యక్తులలో 1 రు పాదాల వాసనతో బాధపడుతున్నారు, అల్లం వేగంగా ఉపశమనం కలిగించే పదార్ధంగా మారింది, అది ఎలాగో ఇక్కడ చూద్దాము.
అల్లం యాంటీ బాక్టీరియా, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉండడం వల్ల, ఇది చెడు వాసనను తటస్దీకరించే, ఇన్ఫెక్షన్ కి కారణమైన బ్యాక్టీరియాని చంపుతుంది.
అంతేకాకుండా, చెమటను నియంత్రించి, చర్మంపై ఉన్న శిలీంధ్రాల పెరుగుదలను నిర్మూలించి డెర్మిసిడిన్ అనే ప్రోటీన్ ఉత్పత్తిని అల్లం అభివృద్ది పరుస్తుంది.
అల్లం టీ యొక్క 8 ఆరోగ్య ప్రయోజనాలు
వీటన్నిటిలో అగ్రస్థానంలో ఉన్న అల్లం, చెమటను పోగొట్టి, పాదాలను పొడిగా ఉంచుతుంది! కాబట్టి, మరింత శ్రమ లేకుండా, అల్లాన్ని ఉపయోగించి పాదాలలో దుర్వాసనను పోగొట్టే సహజ చికిత్స ఎలా చేయాలో ఇక్కడ చూడండి!
పాదల సంరక్షణలో అల్లం పేస్ట్ ఎలా ఉపయోగించాలి
1 పెద్ద ముక్క అల్లాన్ని తోలుతీసి, ముక్కలుగా తరగండి, ఒక టీస్పూన్ నీటిని ఉపయోగించి ఆ అల్లాన్ని తిక్ ప్యూరీ లాగా నూరండి.
పాదల సంరక్షణలో అల్లం పేస్ట్ తయారీ
ఒక ప్యాన్ లో కప్పు నీరు తీసుకుని వేడిచేయండి. నీరు వేడి అయిన తరువాత, నీటిలో ఈ ప్యూరీని వేసి, 10 నుండి 15 నిమిషాల వరకు ఉడికించండి.
పాదల సంరక్షణలో అల్లం పేస్ట్ నిల్వ చేసుకోవడం ఎలా
పొయ్యి కట్టేయండి. ఆ మిశ్రమాన్ని వడకట్టి, గది ఉష్ణోగ్రతకు వచ్చేవరకు పూర్తిగా చల్లార నివ్వండి. ఆ మిశ్రమాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో పోసి, పొడి స్ధలంలో ఉంచండి.
మీ ఉదయపు కాఫీ కప్పును జింజర్ టీ కి మార్చవలసిన కారణాలు
పాదాలకు అల్లం పేస్ట్ తో మసాజ్
వాసనతో కూడిన పాదాలకు చికిత్సగా ఈ అల్లం పల్ప్ తో మసాజ్ చేయండి. మీ చర్మం కొద్దిగా వెచ్చబడింది అనిపించేవరకు మర్దనా చేయండి.
పాదాలకు అల్లం మాస్క్
దానిపై పల్చని సాక్స్ జత ఉంచండి, రాత్రంతా వాసనతో కూడిన పాదాలకు అల్లం మాస్క్ వేయండి. ఎటువంటి మారకా లేకుండా, ఈ మిశ్రమం తేలికగా చర్మంలో ఇంకిపోతుంది.
పాదాలకు అల్లం మాస్క్ తర్వాత నూనె మర్దన
ఉదయానే, మీ పాదాలను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుని, కొద్దిగా కొబ్బరినూనె తో మీ పాదాలను మర్దనా చేసుకు౦టే, పాదాలు సున్నితంగా, మృదువుగా తయారవుతాయి!
డ్రై జింజర్ పౌడర్ లేదా సొంటితో అద్భుతమైన ప్రయోజనాలు..!
మీ పాదాల వాసనకు ఈ అల్లం మాస్క్ ని ప్రయత్నించి, దిగువ వ్యాఖ్యా విభాగంలో మీ ఫీడ్ బ్యాక్ ను మాకు తెలియచేయండి!