చెవులు సంవత్సరాల పాటు ఆరోగ్యంగా ఉండాలంటే 10 స్టెప్స్!

By: Lakshmi Perumalla
Subscribe to Boldsky

చెవి నుండి వినండి కానీ గుండె ద్వారా వినండి అనే సామెత ఉంది. ఏది ఏమైనా మానవులు అద్భుతమైన వినగలిగిన శక్తిని కలిగి ఉన్నారు. కొన్ని అందమైన గాత్రాలు,నవ్వుల శబ్దాలు మరియు మన ప్రియమైనవారికి మరియు మన ప్రశంసలను వినటానికి ఎంత మధురంగా ఉంటాయో కదా. అలాగే మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది.

మన చుట్టూ ఈ అద్భుత శబ్దాలు వినిపించకపోతే జీవితం చప్పిడి మరియు ప్రాణము లేనిదిగా ఉంటుంది.

హానికరమైన వాహన శబ్దాలు, మహిళల అరుపులు,స్కూల్ గంట,ప్రవహించే నది,పక్షుల కిలకిలరావాలు, ప్రేమ సంభాషణలు, ఓదార్పు మాటలు అనేవి మన జీవితంలో వింటూ ఉంటాం. వాటిలో చాలా అర్ధాలు ఉంటాయి.

మీరు వినలేకపోతే మీ జీవితంలో ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారో ఎప్పుడైనా ఆలోచించారా? మన చుట్టూ పాక్షిక లేదా శాశ్వత వినికిడి లోపాలు ఉన్న వారు చాలా మంది ఉన్నారు. ప్రతి రోజు వారికీ ఒక సవాలుగా ఉంటుంది.

ప్రజలు వినికిడి కోల్పోవటానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో తల్లితండ్రుల వారసత్వం,కొన్ని రకాల మందులు,మందుల రియాక్షన్, పెద్ద పెద్ద సౌండ్స్ వినటం మరియు చెవిని శుభ్రం చేయటానికి ఉపయోగించే కొన్ని వస్తువుల కారణంగా వినికిడి కోల్పోవవచ్చు.

అందువల్ల, ఈ రోజు, మీ చెవుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీకు సహాయపడే కొన్ని ఆలోచనలను మీతో పంచుకుంటున్నాము. ఒకసారి చూడండి.

1. డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి

1. డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి

మీ ENT స్పెషలిస్ట్ దగ్గరకు ప్రతి ఆరు నెలలకు వెళ్ళాలి. శుభ్రపరిచే సెషన్ ద్వారా మీ చెవులు రోగ నిర్ధారణ చేసుకోండి. అపరిశుభ్రత కారణంగా బ్యాక్టీరియా పెరుగుదల మరియు వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు నైపుణ్యం ఉన్న ENT స్పెషలిస్ట్ దగ్గరకు మాత్రమే వెళ్ళాలి.

2. మీ నాయనమ్మ డైరీలో ట్రిక్స్ చూడండి

2. మీ నాయనమ్మ డైరీలో ట్రిక్స్ చూడండి

మీ చిన్నతనంలో మీ నాయనమ్మ మీ చెవిలో నూనె వేసి గులిమి తీసిన రోజులు గుర్తు ఉన్నాయా? చెవిలో నూనె లేదా సర్టిఫికేట్ ఇయర్ డ్రాప్స్ కొన్నిచుక్కలను వేసి సులభంగా గులిమి తీసి చెవిని శుభ్రం చేయవచ్చు.

3. చెవి బడ్స్ ఉపయోగించండి

3. చెవి బడ్స్ ఉపయోగించండి

చెవులలో దురద వచ్చినప్పుడు చెవులను శుభ్రం చేయటానికి పెన్సిల్స్,క్లిప్లు,పటకారులు వంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు. మీరు ఎప్పుడు చెవిని శుభ్రం చేయటానికి కాటన్ తో తయారుచేసిన చెవి బడ్స్ ని మాత్రమే ఉపయోగించాలి. చెవి బడ్స్ ని ఉపయోగించే ముందు ఏదైనా ద్రావణంలో ముంచండి.

4. చెవి కెనాల్ లో ఎంటర్ కాకూడదు

4. చెవి కెనాల్ లో ఎంటర్ కాకూడదు

చెవిని శుభ్రం చేసినప్పుడు లోపలి చెవిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే లోపలి చెవిలో శుభ్రం చేసినప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా లోపలి డ్రమ్ గాయం అయ్యే అవకాశం ఉంది. గులిమి బయట చెవిలో తీయవచ్చు. లోపలి చెవిలో తీసినప్పుడు జాగ్రత్తగా లేకపోతే వినికిడి సమస్య వస్తుంది.

5. స్నానం చేసిన తర్వాత చెవులను శుభ్రం చేయాలి

5. స్నానం చేసిన తర్వాత చెవులను శుభ్రం చేయాలి

స్నానము చేసిన తర్వాత చెవులను శుభ్రం చేయటానికి మంచి సమయం. మీ చెవులు తడిగా ఉండుట వలన ఇయర్ బడ్స్ సాయంతో గులిమి సులభముగా తీసేయవచ్చు. అయితే ప్రతి రోజు ఈ విధంగా చేయకూడదు. వారానికి ఒకసారి మాత్రమే చేయాలి.

6. చాలా సున్నితంగా ఉండండి

6. చాలా సున్నితంగా ఉండండి

మీ చెవులను శుభ్రం చేస్తున్నపుడు ఉపయోగించే పరికరాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. చెవులను శుభ్రం చేసుకొనే సమయంలో స్థిరంగా ఒకచోట కూర్చోవాలి. ఆకస్మిక ధ్వనులకు స్పందించకూడదు. మీరు ఇయర్ బడ్స్ ని ఉపయోంచినప్పుడు లోపలి చెవిలోకి వెళ్లలేదని నిర్ధారించుకోండి. చాలా సున్నితంగా చేయాలి.

7. భాగస్వామ్యం చేయవద్దు

7. భాగస్వామ్యం చేయవద్దు

మీకు ఎంత దగ్గరి సంబంధం ఉన్నా సరే మీ ఇయర్ ఫోన్స్ భాగస్వామ్యం చేయకండి. ఏ వ్యక్తి చెవి క్రమరాహిత్యం లేదా ఒక బాక్టీరియా పెరుగుదలతో బాధపడుతున్నాడో తెలియదు. ఇయర్ ఫోన్స్ భాగస్వామ్యం కారణంగా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఇయర్ ఫోన్స్ బాగస్వామ్యం చేయకుండా ఉంటేనే మంచిది.

8. పెద్ద సౌండ్ తో మ్యూజిక్ వినటాన్ని మానేయాలి

8. పెద్ద సౌండ్ తో మ్యూజిక్ వినటాన్ని మానేయాలి

పెద్ద సౌండ్ తో రెండు గంటల కంటే ఎక్కువ సేపు మ్యూజిక్ వింటే చెవి డ్రమ్ కి గాయం అయ్యే అవకాశం ఉంది. పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చే ప్రదేశాలకు వెళ్ళకూడదు. తీవ్రమైన ధ్వని ఉన్న ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చెవి ప్లగ్స్ లేదా చెవి టోపీలు ధరించి వెళ్ళాలి.

9. పొగ త్రాగరాదు

9. పొగ త్రాగరాదు

విపరీతమైన ధూమపానం లేదా డోపింగ్ అనేది వినికిడి నష్టానికి దారి తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి.అలాగే ఔషధ ప్రతిచర్య కూడా చెవుడుకు దారితీస్తుంది.అందువల్ల పొగను వదిలేయడం మంచిది.

10. ఈతగాళ్ల చెవి కండిషన్

10. ఈతగాళ్ల చెవి కండిషన్

స్విమ్మర్స్ స్విమ్ చేసినప్పుడు చెవిలోకి నీళ్లు వెళ్ళటం వలన బ్యాక్టీరియా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అది చెవి లోపలి డ్రమ్ కి హాని కలిగిస్తుంది. అందువల్ల పాక్షిక లేదా శాశ్వత వినికిడి లోపంకి దారి తీయవచ్చు.

కాబట్టి మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు మరియు బాధగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ENT స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళాలి.

English summary

Ten Simple Steps For A Healthy Ear

Taking care of your ears is very important. In this article, we shall brief you about ways to take care of your ears. Read to know more.
Story first published: Saturday, November 18, 2017, 9:00 [IST]
Subscribe Newsletter