Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
నిమ్మతో పాటు మరికొన్ని నేచురల్ రెమెడీస్ తో ఆర్మ్స్ వద్ద డార్క్ నెస్ ను తొలగించుకోవడం ఎలా
డార్క్ అండర్ ఆర్మ్స్ సమస్య తరచూ ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ సమస్య వలన స్లీవ్ లెస్ టాప్స్ ని ధరించడం ఇబ్బందిగా ఉంటుంది.
కొన్ని రకాల పదార్థాలతో స్కిన్ కాంటాక్ట్ జరిగినప్పుడు డార్క్ అండర్ ఆర్మ్స్ సమస్య తలెత్తుతుంది. షేవింగ్, తరచూ హెయిర్ రిమూవింగ్ క్రీమ్స్ ను వాడటం, చెమట ఎక్కువగా పట్టడం, అండర్ ఆర్మ్స్ కి గాలి సరిగ్గా ఆడకపోవడం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, ఆల్కహాల్ బేస్డ్ డియోడరెంట్స్ ను అలాగే యాంటీ పెర్సిపెరెంట్స్ ను వాడటం వలన ఈ సమస్య తలెత్తుతుంది.
అయితే, కొన్ని సందర్భాలలో, "ఆకంతోసిస్ నీగరికెన్స్" అనే సమస్య వలన కూడా అండర్ ఆర్మ్స్ వద్ద చర్మం డార్క్ గా మారవచ్చు. ఈ సమస్య ఇన్సులిన్ రెసిస్టెన్స్ తో అనుసంధానమై ఉంటుంది. ఒబెసిటీ, హార్మోన్ల లోపాలు, కొన్ని రకాల మెడికేషన్స్ ని వాడటం అలాగే క్యాన్సర్ వలన కూడా అండర్ ఆర్మ్ డార్క్ నెస్ సమస్య తలెత్తే అవకాశం కలదు.

కాబట్టి, మొదటగా అండర్ ఆర్మ్స్ సమస్య ఎందువలన తలెత్తిందో తెలుసుకుంటే ఈ సమస్యకు తగిన పరిష్కారాన్ని కనుగొనవచ్చు. ఏదైనా అనారోగ్యం వలన ఈ సమస్య తలెత్తితే వైద్యున్ని సంప్రదించి మెడికేషన్ ను తీసుకోవడం ఉత్తమం.
సాధారణంగా ఈ సమస్య తలెత్తితే కొన్ని నేచురల్ రెమెడీస్ ను పాటించి ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఇక్కడ అండర్ ఆర్మ్స్ ని కేవలం పది రోజుల్లోపే బ్రైటన్ చేయడానికి ఉపయోగపడే నేచురల్ రెమెడీస్ ను వివరించాము.

నిమ్మ:
నిమ్మ నేచురల్ బ్లీచ్ గా పనిచేస్తుంది. ఇందులో శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీలతో పాటు యాంటీసెప్టిక్ ప్రాపర్టీలు కూడా కలవు.
అండర్ ఆర్మ్స్ వద్ద డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించేందుకు ఒక నిమ్మకాయను కట్ చేసి నిమ్మ చెక్కతో ప్రభావిత ప్రాంతంపై కొద్ది నిమిషాలపాటు రుద్దండి. ఆ తరువాత నిమ్మరసాన్ని ప్రభావిత ప్రాంతంపై పదినిమిషాల పాటు ఉండనివ్వండి. కాసేపటి తరువాత నీటితో ప్రభావిత ప్రాంతాన్ని శుభ్రపరచండి.

నిమ్మ మరియు షుగర్ స్క్రబ్
ఈ అద్భుతమైన స్క్రబ్ అనేది అండర్ ఆర్మ్స్ వద్ద డార్క్ నెస్ ను తేలికగా తొలగిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ షుగర్ లో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలిపి స్క్రబ్ ను తయారుచేసుకోండి. ఈ స్క్రబ్ ని ఆర్మ్ పిట్స్ పై సున్నితంగా అప్లై చేయండి. దీనిని పది నిమిషాల పాటు ప్రభావిత ప్రాంతంపై ఉండనివ్వండి. ఆ తరువాత సాధారణ నీటితో శుభ్రపరచండి.
నిమ్మతో పాటు మరికొన్ని నేచురల్ రెమెడీస్ తో ఏ విధంగా అండర్ ఆర్మ్స్ వద్ద డార్క్ నెస్ ను తొలగించుకోవాలో తెలుసుకోండి

షుగర్ మరియు కోకోనట్ ఆయిల్ స్క్రబ్
డెడ్ స్కిన్ సెల్స్ అనేవి డార్కర్ స్కిన్ సమస్యకు దారితీస్తాయి. కాబట్టి, డెడ్ స్కిన్ ను అండర్ ఆర్మ్స్ వద్ద చర్మం నుంచి తొలగించడం ముఖ్యం. ఒక టీస్పూన్ షుగర్ లో కాస్తంత కొబ్బరి నూనెను కలిపి ఈ మిశ్రమాన్ని అండర్ ఆర్మ్స్ వద్ద అప్లై చేయండి. కొన్ని సెకండ్ల వరకు స్క్రబ్ చేయండి. కొద్ది సేపటి తరువాత వాష్ చేయండి.

పొటాటో :
పొటాటో నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. తద్వారా, చర్మం కాంతివంతంగా మారుతుంది. పొటాటో స్లైస్ తో అండర్ ఆర్మ్స్ ని రబ్ చేయండి. పొటాటో ని గ్రేట్ చేసి జ్యూస్ తీసుకుని ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయాలి. ఆ తరువాత 15 నుంచి 20 నిమిషాల పాటు ఈ జ్యూస్ ను ప్రభావిత ప్రాంతంపై ఉండాలి. కాసేపటి తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రపరచుకోవాలి.

పాలు:
పాలలో విటమిన్స్ తో పాటు మినరల్స్ లభిస్తాయి. ఇవి చర్మాన్ని మృదువుగా మార్చి స్కిన్ టోన్ ని మెరుగుపరుస్తాయి. ఒక టేబుల్ స్పూన్ పచ్చిపాలని ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయాలి. కొద్ది నిమిషాలపాటు మసాజ్ చేయాలి. ఆ తరువాత 20 నిముషాలు అలాగే ఉంచాలి. తరువాత గోరువెచ్చటి నీటితో ప్రభావిత ప్రాంతాన్ని శుభ్రపరచుకోవాలి. ఈ ప్రాసెస్ ను రోజుకు రెండు మూడు సార్లు పాటిస్తే ఫలితం ఉంటుంది.

టమాటో:
డార్క్ ప్యాచెస్ ను సహజంగా తొలగించుకోవడానికి టమాటోను ఉపయోగించుకోవచ్చు. కాస్తంత తాజా టమాటో జ్యూస్ ను తీసుకుని ఈ జ్యూస్ ను ప్రభావిత ప్రాంతంపై రాయాలి. షేవింగ్ తరువాత ఈ పద్దతిని పాటించాలి. ఈ ప్రాసెస్ ని రోజుకు రెండు మూడు సార్లు ఒక వారం పాటు పాటిస్తే మంచిది.

దోశకాయ:
దోశకాయ నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. దీనిని వాడటం ద్వారా ఆర్మ్ పిట్స్ వద్ద డార్క్ ప్యాచెస్ ను తొలగించుకోవచ్చు. దోశకాయ రసాన్ని తీసుకుని అందులో చిటికెడు పసుపుని కాస్తంత నిమ్మరసాన్ని కలపాలి. ఈ పేస్ట్ ను డార్క్ ప్యాచెస్ పై అప్లై చేయాలి. కొద్ది సేపు అలాగే వదిలేయాలి. ఆ తరువాత నీటితో శుభ్రపరచాలి. ఇది వన్ టైం రెమెడీ కాదని గుర్తుంచుకోండి. ఈ ప్రాసెస్ ను రెగ్యులర్ గా ఫాలో అయితే మంచి ఫలితం లభిస్తుంది.



Click it and Unblock the Notifications