మీరు తప్పకుండా ప్రయత్నించాల్సిన హోమ్మేడ్ యాంటీ-సెల్యులైట్ బాడీ స్క్రబ్స్

మీ చర్మంలో అంతర్లీనంగా కొవ్వు నిల్వవుండటంవలన చర్మం ముడతలు పడినట్లు మరియు చూడటానికి చాలా కఠినమైందిగా కనిపిస్తుంది. దీనినే సెల్లులైట్ గా పిలుస్తారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో ఎక్కువగా ఇది రావడం సాధారణం

By Ashwini Pappireddy

మీ చర్మంలో అంతర్లీనంగా కొవ్వు నిల్వవుండటంవలన చర్మం ముడతలు పడినట్లు మరియు చూడటానికి చాలా కఠినమైందిగా కనిపిస్తుంది. దీనినే సెల్లులైట్ గా పిలుస్తారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో ఎక్కువగా ఇది రావడం సాధారణం. ఇలాంటి చర్మ పరిస్థితి ఎదుర్కోవడం అనేది నొప్పి తో కూడుకున్నది.

మీ తొడలు మరియు హిప్స్ ప్రాంతంలో అధిక మొత్తం లో కొవ్వుని కలిగివున్న వారిలో

Homemade Anti-cellulite Body Scrubs You Should Try

మీరు కూడా ఒకరు అయితే మీరు తప్పకుండా దీనిని చదవాల్సి వుంది.

దీనికోసం మీరు తప్పకుండా ప్రయత్నించాల్సిన హోమ్మేడ్ యాంటీ-సెల్యులైట్ బాడీ స్క్రబ్స్

బోల్డ్ స్కై లో మీకోసం ప్రత్యేకంగా మీరు ఇంట్లోనే సులభంగా తయారుచేసుకునే ఆంటీ సెల్లులిట్ స్క్రబ్స్ గురించి తెలియజేయడం జరిగింది మరియు ఈ స్క్రబ్స్ మీ చర్మంలో కొవ్వు నిల్వలను ఎదుర్కోవడంలో అత్యంత సమర్థవంతంగా సహజ పదార్ధాలతో తయారు చేస్తారు.

సులభంగా అందుబాటులో వున్నా మరియు ఎంతో చవకైన, క్రింద పేర్కొన్న స్క్రబ్స్ ని ఉపయోగించడం వలన ఇది ఇందులో వుండే అనామ్లజనకాలు మీ చర్మాన్ని ఎక్సఫోలియాట్ చేసి మరియు సెల్లులైట్ ని తగ్గించడానికి సహాయపడుతుంది.

ఈ సులభమైన ఇంకా ప్రభావవంతమైన యాంటీ-సెల్యులైట్ స్క్రబ్లను ఎలా తయారుచేయాలో మరింత తెలుసుకోవడానికి చదవండి:

1. కాఫీ - ఆలివ్ ఆయిల్ + లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్

1. కాఫీ - ఆలివ్ ఆయిల్ + లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్

ఒక గిన్నె లో 3-4 టీస్పూన్ల కాఫీ విత్తనాలని తీసుకొని దానికి 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె మరియు 6-7 చుక్కల లావెండర్ ముఖ్యమైన నూనె ని కలపండి. సమస్యాత్మక ప్రాంతం లో దీనిని మొత్తం రాసుకొని కొన్ని నిముషాల పాటు మసాజ్ చేయండి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. గమనించదగ్గ ఫలితాలు కోసం స్కర్బ్ ని ఒక వారంలో 2-3 సార్లు ఉపయోగించవచ్చు.

2. వోట్మీల్ - కొబ్బరి నూనె + నిమ్మ రసం

2. వోట్మీల్ - కొబ్బరి నూనె + నిమ్మ రసం

4-5 టీస్పూన్ల కొబ్బరి నూనె మరియు 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం లో 2 టేబుల్ స్పూన్ల వండిన వోట్మీల్ ని కలపండి. సెల్యులైట్-ప్రభావిత ప్రాంతం మొత్తం దీనిని రాసి కాసేపు మసాజ్ చేయండి. తరువాత, గోరు వెచ్చని నీటితో కడిగేయండి. వేగవంతమైన ఫలితాల కోసం కనీసం వారానికి రెండు సార్లు దీనిని ప్రయత్నిచండి.

3. ఆల్మాండ్ పౌడర్ - శనగ పిండి+ అలో వెరా జెల్

3. ఆల్మాండ్ పౌడర్ - శనగ పిండి+ అలో వెరా జెల్

2 టీస్పూన్ల బాదం పొడి, 1 టేబుల్ స్పూన్ శనగ పిండి మరియు యొక్క 3-4 టేబుల్ స్పూన్ల అలో వెరా జెల్ మిశ్రమాన్ని బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని తొడలు మరియు హిప్ ప్రాంతంలో అప్లై చేసి 5-10 నిమిషాల పాటు మసాజ్ చేయండి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఈ యాంటీ-సెల్యులైట్ స్కబ్ ని వీక్లీ అప్లికేషన్మీ గా మీ చర్మానికి ఉపయోగించడం వలన గొప్ప ఫలితాలను పొందవచ్చు.

4.బ్రౌన్ షుగర్ - గ్రేప్ఫ్రూట్ ఎస్సెన్షియల్ ఆయిల్ + విటమిన్ E ఆయిల్

4.బ్రౌన్ షుగర్ - గ్రేప్ఫ్రూట్ ఎస్సెన్షియల్ ఆయిల్ + విటమిన్ E ఆయిల్

2 టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగర్ లో 4-5 టీస్పూన్లు విటమిన్ ఎ ఆయిల్ మరియు 4-5 డ్రాప్స్ ద్రాక్షపండు ఎస్సెన్షియల్ నూనెతో కలపడం ద్వారా ఈ స్కర్బ్ ని తయారుచేయవచ్చు. ఒకసారి సిద్ధం చేసిన తరువాత, ప్రభావిత్తా ప్రాంతాలలో అప్లై చేసుకొని కాసేపు మసాజ్ చేయండి. తరువాత, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. అనుకూలమైన ఫలితాల కోసం ఈ సెల్యులైట్- స్క్రబ్ ని ప్రతివారం వాడవచ్చు.

5. కోకో పౌడర్ - హనీ + బియ్యం పిండి

5. కోకో పౌడర్ - హనీ + బియ్యం పిండి

ఒక గాజు గిన్నె లో 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ ని తీసుకొని 3-4 టేబుల్ స్పూన్ల తేనె మరియు 1 టీస్పూన్ బియ్యం పిండి ని కలపండి. ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి 10-15 నిమిషాల పాటు మర్దనా చేయండి. తరువాత, మృదువైన నీటితో కడిగేయండి. సెల్లులైట్ ని పోగొట్టడానికి మీ ఇంట్లో తయారుచేసిన ఈ స్కర్బ్ ని వారానికి రెండుసార్లు వుపయోగించి మంచి ఫలితాలను పొందవచ్చు.

6. గ్రాన్యులేటెడ్ షుగర్ - థైమ్ ఎసెన్షియల్ ఆయిల్ + ఆల్మాండ్ ఆయిల్

6. గ్రాన్యులేటెడ్ షుగర్ - థైమ్ ఎసెన్షియల్ ఆయిల్ + ఆల్మాండ్ ఆయిల్

2 టేబుల్ స్పూన్ల గ్రాన్యులేటెడ్ షుగర్, 3-4 టేబుల్ స్పూన్ల బాదం నూనె మరియు 5-6 డ్రాప్స్ ఎసెన్షియల్ ఆయిల్ ని ఒక గిన్నెలో తీసుకొని బాగా కలిపి ఒక మిశ్రమంలా సిద్ధం చేయండి. ఈ మిశ్రమాన్ని మీ తొడలు మరియు హిప్ భాగంలో రాసి 5-10 నిమిషాల పాటు మర్దనా చేయండి. తరువాత దానిని మంచినీటి నీటితో కడిగేయండి. సెల్లులైట్ సమస్య తో పోరాడేందుకు ఈ స్కర్బ్ ని వారానికొకసారి ప్రయత్నించండి.

7. ఎప్సోమ్ సాల్ట్ + గ్రీన్ టీ

7. ఎప్సోమ్ సాల్ట్ + గ్రీన్ టీ

కేవలం 2-3 టీస్పూన్ల ఎప్సోమ్ సాల్ట్ మరియు 2 టేబుల్ స్పూన్ల గ్రీన్ టీ ని ఒక చిన్న గిన్నెలో తీసుకొని

బాగా కలపాలి. సమస్యాత్మక ప్రాంతం అంతటా ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకొని గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయడానికి ముందు 10 నిమిషాల పాటు మర్దనా చేయడం కొనసాగించండి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. సెల్లులైట్ తో పోరాడటానికి ఒక నెలకి మూడుసార్లు ఈ ఇంట్లోనే తయారుచేసుకునే

స్కర్బ్ ని ప్రయత్నించండి.

Desktop Bottom Promotion