Latest Updates
-
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే!
నాజుకైన నడుము కావాలంటే ఈ చిట్కాలు పాటించండి...
ప్రతిరోజూ అల్లం టీ తాగడం వల్ల శరీర బరువు తగ్గుతుంది. అంతేకాదు ఆడవారి శరీర ఉష్ణోగ్రతను పెంచి కొవ్వును కరిగిస్తుంది.
ఆడవారికి అందం ఎంత ముఖ్యమో... నాజుకైన నడుము కూడా అంతే ముఖ్యం. అందుకే నడుము మడత అందం గురించి కవులు, రచయితలు రకరకాల పూలు, పక్షులతో పోలుస్తుంటారు. అయితే అందమైన నడుము అనేది ఎప్పుడూ సన్నగా ఉంటుంది అని చాలా మంది అనుకుంటారు. అయితే అందరూ అనుకునేది ఇక్కడ వాస్తవం.

ఎందుకంటే నడము వైపుకు రెండు పక్కలా కొవ్వు పేరుకుపోయి లావుగా ఉంటే.. చూసే వారికే కాదు.. మనకు కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు ఈ స్టోరీలో టిప్స్ ను ఫాలో అవ్వండి... నాజుకైన నడుమును సులభంగా పొందండి...

ఏ చీర కట్టుకున్నా...
ఈ రోజుల్లో అమ్మాయిలు ఏ చీర కట్టుకున్నా.. లేదా ఏ డ్రస్ వేసుకున్నా.. చాలా లావుగా కనబడుతూ ఉంటారు. దీంతో వారు బయటికి వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే పెళ్లి అయిన వారిలో ముఖ్యంగా పిల్లలు పుట్టిన వారిలో ఈ నడుము సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా డెలివరీ తర్వాత మహిళల్లో నడుము, పిరుదుల్లో కొవ్వు చాలా ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది.

ఆహారపు అలవాట్లు...
అయితే ఈ కొవ్వు పెరగడానికి మీ ఆహారపు అలవాట్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా చిరు తిళ్లు తినే వారికి, చల్లని కూల్ డ్రింక్స్ తాగేవారికి ఇలాంటి సమస్య ఎక్కువగా ఎదురవుతుంది. అయితే అందమైన నడుము కావాలంటే ఏమి చేయాలి.. దీనికి అసలు పరిష్కారం అనేదే లేదా? మగువలు చీరలు కట్టుకున్నప్పుడు మరీ లావుగా కనబడకుండా ఏమి చేయాలో కొందరు వైద్య నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు.

తేలిక పాటి వ్యాయామం...
అవేంటంటే అమ్మాయిలు అందమైన నడుము కావాలంటే.. ఆ భాగంలో కొవ్వును బాగా కరిగించాలంటే క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామం చేయాలంట. మోచేతులు, మోకాళ్ల మీద కూర్చుని, మడిచిన కుడి కాలును వెనక్కి పైకి లేపాలి. ఇదే తరహాలో ఎడమ కాలునూ లేపి దించాలి. ఇలా ఒక్కో కాలుతో 20 రెప్స్, 3 సెట్ల పాటు చేయాలి.

కొవ్వు ఆటోమేటిక్ గా కరుగుతుంది..
అలాగే నిటారుగా నిలబడి ఒక కాలును వంచకుండా వీలైనంత మేరకు వెనక్కి చేయాలి. అలాగే రెండో కాలితోనూ వీలైనంత ఎక్కువగా వెనక్కి చేయాలి. ఇలా ఒక్కో కాలితో 20 సార్లు రిపీట్ చేస్తే చేయాలి. ఇలా మొత్తం మూడు సెట్లు చేయాలి. ఇలా మీరు నిరంతరం చేయడం వల్ల మీ కొవ్వు ఆటోమేటిక్ గా కరుగుతుంది.

నడుము మడతను పెంచుకోండి...
ప్రతిరోజూ అల్లం టీ తాగడం వల్ల శరీర బరువు తగ్గుతుంది. అంతేకాదు ఆడవారి శరీర ఉష్ణోగ్రతను పెంచి కొవ్వును కరిగిస్తుంది. అయితే దీనిని పరిమితంగా తీసుకోవాలి. అలాగే హెర్బల్ టీ తాగడం వల్ల కూడా మీ శరీర బరువుని తగ్గించుకుని మీ నడుము మడతలను పెంచుకోవచ్చు.

ఫ్యాట్ ని కరిగిస్తాయి...
బాదం పప్పును ప్రతిరోజూ తింటే మీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి. అంతేకాదు మీ శరీర బరువును చాలా మేరకు తగ్గిస్తుంది. బాదంలోని ఒమేగా-3 ప్యాటీ యాసిడ్స్ శరీరంలో పేరుకుపోయిన ఫ్యాట్ ని కరిగిస్తాయి. అయితే ఈ బాదం పప్పులను ప్రతిరోజూ మీరు నిద్రించే సమయంలో వాటిని నీటిలో నానబెట్టాలి. తర్వాత రోజు ఉదయం నిద్రలేచి ఫ్రెషప్ తర్వాత బాదం పప్పుపై ఉన్న పొట్టు తీసి తినాలి.

గ్యాస్ సమస్యను సైతం...
ఇది కూడా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించడంలో బాగా శక్తివంతంగా పని చేస్తుంది. పొట్టలోని గ్యాస్ సమస్యను సైతం తగ్గిస్తుంది. ఇందులోని యాంటాక్సిడెంట్లు జీవక్రియ సక్రమంగా జరిగేటట్లు సహాయపడతాయి. పుదీనా, కొత్తిమీర ఆకులను కలిపి బాగా నూరి అందులో నిమ్మరసం వేసి పేస్టులా తయారు చేయాలి. ఆ పేస్టులో చిటికెడు ఉప్పు వేయాలి. రోటి, ఇడ్లీ, దోశలో ఈ చట్నీని వేసుకుని తింటే మీ జీర్ణశక్తికి ఎంతో మంచిది.

మీ విలువైన అభిప్రాయాలు..
ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే మీ బంధు మిత్రులకు, మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. ఇలాంటి అనేక ఆరోగ్మీ అయ, సౌందర్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం తెలుగు బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ ఆర్టికల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications