Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
దీపావళి స్పెషల్: కాలిన గాయాలకు తక్షణ ఉపశమనం కలిగించే కలబంద, పెరుగు, తేనె..
దీపావళి స్పెషల్: కాలిన గాయాలకు తక్షణ ఉపశమనం కలిగించే కలబంద, పెరుగు, తేనె..
సంవత్సరంలో వచ్చే అతి పెద్ద పండుగ దీపావళీ. దేశం మొత్తం చాలా ఉత్సహాంగా, ఆనందోత్సవాలతో 5 రోజు పాటు జరుపుకునే ఈ పండుగ నాడు టపాకాయలను కాల్చడం సంప్రదాయం. దీపావళి రోజున పిల్లలు మరియు పెద్దలు అందరూ క్రాకర్స్ కాల్చడం పరిపాటి. అయితే ఈ ఆనంద సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. టపాకాయలను కాల్చనడం వల్ల ఏర్పడే చిన్న చిన్న కాలిన గాయాలకు వెంటనే చికిత్స చేస్తే కాలిన గాయాలు వెంటనే మానిపోతాయి. మంట నుండి విముక్తి కలిగిస్తాయి.

మీ కాలిన గాయాలకు ఉపశమనం కలిగించడానికి కొన్ని ఆయుర్వేద చిట్కాలున్నాయి. క్రాకర్స్ కాల్చడం వల్ల కాలిన గాయాలు చిన్నవైతే వాటిని ఈ సింపుల్ చిట్కాలతో నయం చేసుకోవచ్చు. ఇవి చాలా ప్రభావంతంగా మరియు సున్నితంగా నయం చేస్తాయి. కాలడం వల్ల చర్మంపై ఏర్పడ్డ బొబ్బలు, చర్మంలో మంట, అసౌకర్యాన్ని వెంటనే తగ్గిస్తాయి. ఆ సింపుల్ చిట్కాలు ఏంటో మీరే చూడండి.

అలోవెర జెల్ :
అలోవెర జెల్ చాలా ప్రభావవంతమైన హోం రెమెడీ. ఇది చర్మంలో మంటను వెంటనే తగ్గిస్తుంది. దీని ఉండే చల్లబరిచే గుణాలు కాలిన గాయం వల్ల ఏర్పడే చర్మంలో చీకాకును, కాలిన గాయాలను తగ్గిస్తుంది. అందుకోసం అందులో కొద్దిగా చన్నీటిని పోయాలి. తర్వాత అలోవెర ఆకు తీసుకుని ఫ్రిడ్జ్ లో ఉంచాలి. 5 నిముషాల తర్వాత జెల్ తీసుకుని కాలిన గాయం మీద 10-15నిముషాల పాటు అప్లై చేయాలి.చర్మంపై కాలిన గాయం మంట నుండి వెంటనే ఉపశమనం కలిగిస్తుంది.

తేనె:
మరో ప్రభావంతమైన హోం రెమెడీ తేనె. ఇది చాలా సులభంగా అందరి వంటింట్లో ఉండేది. కాలిన వెంటనే ఆ ప్రదేశంలో చల్లటి నీటితో తేనె కలిపి కాలిన గాయాలపై అప్లై చేయాలి.

పెరుగు:
పెరుగును ప్రభావంతమైన ప్రదేశంలో అప్లై చేయడం వల్ల వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. కాలిన గాయాల వల్ల ఏర్పడ్డ మచ్చలు, గాయాలను పెరుగు ప్రభావవంతంగా తొలగిస్తుంది. అవసరం అనుకుంటే రోజుకు ఎక్కువ సార్లు అప్లై చేస్తుండండి.

కీర దోసకాయ:
కీరదోసకాయను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి, అవసరం అయితే దీన్ని ఫ్రిడ్జ్ లో కొద్ది సేపు ఉంచాలి. ఇలా చల్లగా ఉన్నది కాలిన గాయాలపై లేపనంగా రాయడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. పేస్ట్ చేసే సమయం లేకపోతే, స్లైస్ గా కట్ చేసి కాలిన గాయాలపై ఎక్కువ సమయం అప్లై చేయడం వల్ల వెంటనే ఉపశమనం కలుగుతుంది. దీన్ని కాలిన గాయాలపై రోజులో ఎన్నిసార్లైనా మర్ధన చేయవచ్చు.



Click it and Unblock the Notifications
