Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
రూపాయి ఖర్చు లేకుండా ఇలా చేస్తే..తమన్నాలా తెల్లగా మారిపోతారు
చాలామందికి పొద్దున్నే కప్పు కాఫీ గొంతులో పడితే కానీ బెడ్ నుంచి కిందకి దిగరు. రోజు ప్రారంభంలో రీఫ్రెష్ గా, ఎనర్జిటిక్ గా ఉండటానికి కాఫీ అవసరమని భావిస్తారు. అయితే రోజు ప్రారంభానికి శక్తినిచ్చేది మాత్రమే కాకుండా మీ ముఖాన్ని కూడా కాఫీ ప్రకాశవంతం చేయగలుగుతుంది. అయితే కాఫీ తాగడం వల్ల కాదు. కాఫీ పౌడర్ తో చేసిన కొన్ని ఫేస్ మాస్క్‌లతో ఈ ముఖం మెరిసేలా చేసుకోవచ్చు. కాఫీ పౌడర్ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.
ముఖం కాంతివంతంగా లేదని బాధపడేవారు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని కాఫీ పౌడర్ తో ఫేస్ మాస్క్‌లని చాలా సులువుగా సిద్ధం చేసుకుని మీ ముఖానికి అప్లై చేయండి. ముఖం కడుక్కోగానే మార్పు కనిపిస్తుంది. కాఫీ పొడిని పాలు, తేనె, పెరుగు, నిమ్మ, పసుపు లేదా కలబంద వంటి పదార్థాలతో ఫేస్ ప్యాక్ రూపంలో ఉపయోగించవచ్చు.

కాఫీ పౌడర్ ఫేషియల్ మాస్క్ ఎలా చేసుకోవాలి,దీని ప్రయోజనాలు
కాఫీ మిల్క్ ఫేస్ ప్యాక్
కాఫీ పౌడర్, పాలు కలిపి తయారు చేసిన కాఫీ మిల్క్ మాస్క్ తో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. 1-2 టేబుల్ స్పూన్ల పాలలో ఒక టీస్పూన్ కాఫీ పౌడర్ మిక్స్ చేసి పేస్ట్ చేయాలి. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఆరోగ్యకరమైన,మెరిసే చర్మాన్ని పొందడానికి ఇది సులభమైన మార్గాలలో ఒకటి.
కాఫీ, పసుపు, పెరుగు ఫేస్ ప్యాక్
సులభంగా తయారు చేయగల ఈ ఫేస్‌మాస్క్ ఒక్క పైసా కూడా ఖర్చు చేయనవసరం లేకుండా చర్మాన్ని ప్రకాశవంతం చేసే మాస్క్. ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడి, సమాన మొత్తంలో పసుపు,పెరుగు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి తేలికగా మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ మూడు పదార్థాలు మీ ముఖాన్ని మెరిసేలా చేస్తాయి,మీ చర్మాన్ని ఫెయిర్ గా చేస్తాయి.
కాఫీ పౌడర్, నిమ్మకాయ ఫేస్ ప్యాక్
కాఫీ పొడి, నిమ్మకాయ మాస్క్ తక్షణ ఫలితాలను ఇస్తుంది. ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడిని నిమ్మరసంలో కలపండి. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ముఖంలో మెరుపును చూడవచ్చు. కాఫీ పౌడర్ లోని ఎక్స్ ఫోలియేటింగ్ సామర్థ్యం, నిమ్మకాయలోని గుణాలు ముఖంపై ఉన్న నల్ల మచ్చలను తొలగించి,ముఖాన్ని కాంతివంతంగా మార్చుతాయి.
పొడి చర్మం
కాఫీ పౌడర్, ఆలివ్ ఆయిల్ రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి మీ చర్మాన్ని అకాల వృద్ధాప్యం నుండి రక్షించడంలో సహాయపడతాయి. అర టీస్పూన్ కాఫీ పౌడర్‌లో 1 టీస్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని ముఖమంతా అప్లై చేయాలి. ఇది ఇతర పొడి శరీర భాగాలపై కూడా ఉపయోగించవచ్చు. దీన్ని 15 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత కడిగేయాలి.
UV కిరణాలు నుంచి రక్షణ
కాఫీ పౌడర్ లోని పాలీఫెనాల్స్ UV కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది, సూర్యరశ్మి వల్ల ఏర్పడే ఫైన్ లైన్లను తగ్గిస్తుంది. 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ లో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపండి. 15 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై మీ ముఖం కడగాలి.



Click it and Unblock the Notifications
