Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్‌వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.!
ఫేస్ ప్యాక్ లు, హెయిర్ ఆయిల్స్ ఏమీ అక్కర్లేదు..జస్ట్ ఇది తింటే దట్టమైన జుట్టు, మెరిసే చర్మం
ఆరోగ్యవంతమైన జుట్టు, అందమైన చర్మం ప్రతీ ఒక్కరి కల. ఈ కలను నిజం చేయడానికి కొందరు అయితే చేయని ప్రయత్నం ఉండదు. రకరకాల క్రీమ్స్, ఆయిల్స్, షాంపూలు, సీరమ్స్,మార్కెట్లో ఏది కొత్తగా వచ్చినా వెంటనే కొనేసి ప్రయత్నించేస్తుంటారు. కొన్నిసార్లు ఫలితం ఉంటుంది, మరికొన్నిసార్లు నిరాశే మిగులుతుంది. అయితే మీ అందాన్ని రెట్టింపు చేసే అద్భుతమైన పరిష్కారం మీ వంటగదిలోనే దాగి ఉందని మీకు తెలుసా? ఎలాంటి దుష్ప్రభావాలు, రసాయనాల బెడద లేని ఒక సహజసిద్ధమైన ఫుడ్ మీ చర్మాన్ని, జుట్టును లోపలి నుండి పోషించి, ఆరోగ్యంగా మారుస్తుంది.
పోషకాహార నిపుణురాలు సిమ్రాన్ చోప్రా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఓ వీడియోలో..జుట్టు, చర్మ ఆరోగ్యానికి సామయపడే ఆరోగ్యకరమైన స్నాక్ గురించి తెలియజేశారు. అదే ఫైనాఫిల్ రైతా. పెరుగు, పైనాపిల్ కలయికతో చేసే పైనాపిల్ రైతా.. మన చర్మ, కేశ సౌందర్యానికి అవసరమైన పోషకాలను అందించి, వాటిని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం ఆరోగ్యకరమైనదే కాదు, తినడానికి కూడా ఎంతో రుచిగా ఉంటుంది.

పైనాపిల్ రైతా స్కిన్, హెయిర్ కి ఎలా మేలు చేస్తుంది?
ఫైనాఫిల్ ఇలా
పైనాపిల్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ సి మన శరీరంలో 'కొల్లాజెన్' అనే ప్రొటీన్ ఉత్పత్తికి అత్యంత అవసరం. కొల్లాజెన్ అంటే మన చర్మానికి ఒక ఆధారం లాంటిది. ఇది చర్మాన్ని బిగుతుగా, మృదువుగా ఉంచుతుంది, ముడతలు రాకుండా కాపాడుతుంది. వయసు పెరిగే కొద్దీ తగ్గే కొల్లాజెన్ ఉత్పత్తిని పైనాపిల్ ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా కొల్లాజెన్ జుట్టు కుదుళ్లను బలపరిచి, జుట్టు రాలడాన్ని తగ్గించి ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. జుట్టుకు మెరుపునిస్తుంది. పైనాపిల్ లో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఒక శక్తివంతమైన యాంటీ ఇన్ ఫ్లమేటరీ (వాపును తగ్గించే) ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది చర్మంపై మంట, ఎరుపుదనం, మొటిమల వల్ల కలిగే వాపును తగ్గిస్తుంది. చనిపోయిన చర్మ కణాలను తొలగించి చర్మాన్ని శుభ్రంగా, మచ్చలు లేకుండా, కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది.
పెరుగు అలా
ఇంట్లో తయారుచేసిన పులియని పెరుగు ఒక అద్భుతమైన ప్రోబయోటిక్. మన జీర్ణవ్యవస్థకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా ఇందులో ఉంటుంది. చాలా చర్మ, జుట్టు సమస్యలకు మూలం మన కడుపులోని అసమతుల్యతే. జీర్ణవ్యవస్థ సరిగ్గా లేకపోతే పోషకాలు సరిగా అందవు, వ్యర్థాలు పేరుకుపోతాయి. ఇది మొటిమలు, చర్మం నిర్జీవంగా మారడం, జుట్టు రాలడం వంటి సమస్యలకు దారితీస్తుంది. పెరుగులోని ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి ఈ సమస్యల నుండి మనల్ని కాపాడతాయి. కడుపు చల్లగా ఉంటే చర్మం కూడా ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. పెరుగులో ప్రోటీన్, విటమిన్ బి కాంప్లెక్స్ (ముఖ్యంగా B2, B5, B12) సమృద్ధిగా ఉంటాయి. ప్రోటీన్ చర్మ కణాల మరమ్మత్తుకు, కొత్త కణాల ఉత్పత్తికి అవసరం. ఇది జుట్టు కుదుళ్లను బలపరిచి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. B-విటమిన్లు చర్మానికి తేమను అందించి, ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టుకు మెరుపునిచ్చి, చిట్లడాన్ని తగ్గిస్తాయి.
సిమ్రాన్ చోప్రా తన పోస్ట్‌లో పంచుకున్న ఈ రైతా రెసిపీలో పెరుగు, పైనాపిల్‌తో పాటు మరికొన్ని పదార్థాలను(పిస్తా,చియా సీడ్స్,తేనె) చేర్చడం ద్వారా దాని పోషక విలువలను, రుచిని మరింత పెంచుకోవచ్చని సూచించారు.
నోరూరించే పైనాపిల్ రైతా తయారీ విధానం
ఒక గిన్నెలో గట్టి పెరుగును తీసుకుని ఉండలు లేకుండా బాగా గిలకొట్టండి.
ఇప్పుడు అందులో నానబెట్టిన చియా విత్తనాలను (నీటితో సహా లేదా నీరు వంపేసి), తేనెను వేసి బాగా కలపండి.
తర్వాత అందులో తురిమిన లేదా చిన్న ముక్కలుగా కోసిన పైనాపిల్ ముక్కలను, సన్నగా తరిగిన పిస్తా పప్పులను వేసి నెమ్మదిగా కలపండి.
చివరగా వేయించిన జీలకర్ర పొడి, కావాలనుకుంటే చిటికెడు నల్ల ఉప్పు చల్లుకుంటే చల్లని, రుచికరమైన, ఆరోగ్యకరమైన పైనాపిల్ రైతా రెడీ. దీన్ని భోజనంతో పాటు లేదా అల్పాహారంగా కూడా తీసుకోవచ్చు.



Click it and Unblock the Notifications