Latest Updates
-
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే
జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి 12 సూపర్ స్నాక్
ఆకాలేస్తోందా.. ఆకలి వేసేటప్పుడు చిరుతిండ్లు ఏవైన కడబడితే చాలు తినేస్తుంటారు కొందరు. అయితే అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయా.. హానీ చేస్తాయా అని ఏ ఒక్కరు ఆలోచించరు. ఆకలి వేసినప్పుడు చిరుతిండ్లలోనే ఆరోగ్యానికి అధికంగా ఉపయోగపడేవి తింటే అటు ఆరోగ్యానికి ఇటు ఆకలి తీర్చుకోవడానికి ఉపయోగపడుతాయి. కొన్ని ఆహారాలు తినడం వల్ల శరీరానికి కావలసిన శక్తిని అంధిస్తాయి. శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే వాటికి తగినంత ఆక్సిజన్ అందాలి. రక్తంలోని ఎర్రరక్త కణాల్లో ఉండే హిమగ్లోబిన్ ఆ పనిని నిర్వర్తిస్తుంది. రక్తం తగినంత ఆక్సిజన్‌ను సరఫరా చేయలేకపోయినా, ఎర్రరక్త కణాల సంఖ్య తక్కువగా ఉన్నా అది రక్తహీనతకు దారితీస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఇనుము లోపం. ఎందుకంటే ఎర్రరక్త కణాలు తయారుకావాలంటే ఇనుము, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బి12 వంటి పోషకాలు కావాలి.
ఇవి లోపిస్తే రక్తహీనతతో పాటు అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య తలెత్తకుండా వుండాలంటే మనం రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుంది. శరీరానికి అవసరమైన ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. కొన్ని స్పెషల్ గా తీసుకొనే ఆహారాల వల్ల చర్మం, కేశాలు ఆరోగ్యంగా ఉంటాయి. తినే చిరుతిండ్లే అయినా వాటి ఫలితం మెండుగా ఉంటుంది. అంటువంటి చిరుతుండ్లలో కేశాలకు ఉపయోగపడేవి కొన్ని మీకోసం.. వీటిని తినడం వల్ల శరీరానికి కావలసిన శక్తి, అందించడంతో పాటు ముఖ్యంగా జుట్టును సంరక్షించి, ఒత్తైన, పొడవైన కేశాలను మీకు అందిస్తుంది. మరి ఆ స్నాక్స్ ఏంటో ఒకసారి చూద్దాం....

బాదాం: ఇది చూడటానికి, తినడానికి చిన్న స్నాక్ అయినా ఇందుల్లో వున్న ‘విటమిన్ ఇ' తల మాడుకు, కేశాలకు కావలసిన పోషకాలు అందించే గుణాలు మెండుగా ఉన్నాయి.

వాల్ నట్స్: వాల్ నట్స్ చాలా మందికి తెలిసుండకపోవచ్చు. అయితే ఇది మనం చిరుతిండిగా తినేటటువంటి ఓ నట్. దీనిలో కూడా విటమిన్ ఇ అధికంగా ఉండి, తల మాడుకు రక్త ప్రసరణను బాగా అందజేస్తుంది. అంతే కాదు వాల్ నట్స్ లో జింక్ అధిక శాతం కలిగి ఉంటుంది. జింక్ శరీరానికి అంధించడం వల్ల కేశాలకు మంచి మెరుపు వస్తుంది.

సన్ ఫ్లవర్ సీడ్స్(ప్రొద్దుతిగుడు గింజలు
సన్ ఫ్లవర్ సీడ్స్(ప్రొద్దుతిగుడు గింజలు): సన్ ఫ్లవర్ సీడ్స్ లో ఎక్కువ ప్రోటీన్స్, బయోటిన్స్, పొటాషియం, జింక్, ఐరన్, విటమిన్ బి, విటమిన్ ఇ, మెగ్నీషియం మరియు కాల్షియం అధికంగా ఉంటాయి. కేశాలకు ఆరోగ్యంగా పెరగాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రోటీనులు కలిగి ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. కాబట్టి ఈ టేస్టీ స్నాక్ కేశాలకు అధిక శక్తినిస్తుంది. వీటిని తీసుకొనేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే కొన్నింటికి సోడియం(ఉప్పు) కలిపి ఉంటారు. ఉప్పు కలపని పచ్చి గింజలు కురులకు అధిక శక్తిని అంధిస్తాయి.

ఫిగ్: ఫిగ్ ఇది కూడా తినేటటువంటి ఒక పండు
ఫిగ్: ఫిగ్ ఇది కూడా తినేటటువంటి ఒక పండు. ఈ పండులో ఐరన్, మెగ్నీషియం, విటమిన్ ఏ, బి మరియు సి, ఫోలిక్ ఆసిడ్స్, జింక్, సోడియం, మరియు పొటాషియం అధికంగా ఉంటాయి. పొటాషియం ఇందులో కంటే అరటిపండులో 80శాతం అధికంగా ఉంటుంది. ఈ పండులో ఉన్నా ఈ విటమిన్స్, న్యూట్రిషయన్స్ అన్నీ కూడా కురులు పెరగడానికి బాగా దోహదపడుతాయి.

పీచెస్
పీచెస్: ఇందులో ఐరన్, హీమోగ్లోబిన్ పెంచడానికి ఎసెన్సియల్స్, ఎర్రరక్త కణాలకు ఆక్సిజన్ అందించుటలో ఈ ప్రూట్స్ బాగా ఉపయోగపడుతాయి. అనీమియాతో బాధపడేవారికి కావలసినంత ఐరన్ ను అందిస్తుంది. జు9ట్టు పెరగుదలకు, వెంట్రుకలకు కావలసిన విటమిన్స్ అందజేస్తుంది.

అరటి పండు
అరటి పండు: అరటి పండులో అమినో యాసిడ్స్ అధికంగా ఉండి శరీరానికి అధిక శక్తిని అంధించి, జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అరటి పండులో ఉన్న నేచురల్ ఆయిల్ కురులను సున్నితంగా చేస్తుంది. అరటిపండు గుజ్జును డైరెక్ట్ గా కురులకు అప్లై చేసి వాష్ చేయడం వల్ల చాలా లాభాలు చేకూరుతాయి. పొటాషియం కూడా కురులు మృదువుగా ఉండేలా చేస్తుంది.

రాస్ బ్రెరీ
రాస్ బ్రెరీ: బెర్రీస్ లో విటమిన్ ఎ మరియు విటమిన్ ఇ అధిక శాతంలో ఉంటుంది. తల మాడుకు కావలసినంత బ్లెడ్ సర్కులేషన్ ను అందిస్తుంది. కురులకు మంచి షైనింగ్ వస్తుంది.

ఆరెంజ్
ఆరెంజ్ : సిట్రస్ జాతికి చెందిన ఆరెంజ్ లో విటమిన్ సి అధికంగా ఉండి, శరీరానికి కావాలసినంత ఫైబర్ కంటెంట్ ను అంధించడంతో కురులకు కూడా బాగా ఉపయోగపడుతుంది. కేశలాను దృఢంగా పెరిగేలా చేసే రూట్ కెనాల్ కు కావలసినంత బీటా కెరోటిన్ అంధిస్తుంది.

ఎండు ద్రాక్ష
ఎండు ద్రాక్ష: ఎండు ద్రాక్షలో ఐరెన్ ఎక్కువగా ఉండి, రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచి శరీరానికికే కాకుండా కేశాలకు అందజేస్తుంది. కేశాలకు తగినంత రక్త ప్రసరణ జరిగేందుకు కావల్సిన హెయిర్ పాలిసెల్ కు కావల్సిన న్యూట్రియట్స్ ను అందజేస్తుంది.

ఫ్రూనె
ఫ్రూనె: ఫ్రూనె లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండి, అనీమియా రాకుండా చేస్తుంది. బరువును తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. నిర్జీవమైన చర్మానికి తేమను అందించి మెరిసేలా చేస్తుంది. గోర్లు చిట్లడం అరికడుతుంది. దాంతో కేశాలు తెగిపోకుండా కాపాడుతుంది.

పాలు
పాలు: ఆవు పాలు విటమిన్ ఎ మరియు విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. ఇంకా ఇందులో బయోటిన్, ప్రోటీన్ శాతం ఎక్కువ. కేశాలకు కావలసినంత బలాన్ని అందిస్తుంది.

హోల్ గ్రైన్ స్నాక్ బార్
హోల్ గ్రైన్ స్నాక్ బార్: ఇందులో విటమిన్ బి5 మరియు ఇనోసిటోల్, కెమికల్ కాంపౌండ్ అధికంగా ఉండి, హెయిర్ ఫోలిసెల్స్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది.



Click it and Unblock the Notifications











