Latest Updates
-
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్‌షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట!
తలను దువ్వే విధానంలో... మీ కేశ సంరక్షణ...
మహిళల అందాన్ని మరింతగా పెంచే వాటిలో జుట్టు కూడా ఒకటి. వారి జుట్టును వివిధ రకాలుగా అలంకరించుకుంటారు. సాధారణంగా భారతీయ మహిళలు జడ వేసుకోవడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అయితే ప్రాశ్చాత్య పోకడతో ఇప్పుడు భారతీయ మహిళలు కూడా వివిధ రకాలుగా తమ జుట్టును అలంకరించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే జుట్టు అలంకరిచుకోవాలంటే దాన్ని సంరక్షించుకోవలసిన అవసరం ఉంది.

జుట్టు సంరక్షణ గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా సరిపోవు. నిరంతరం ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంటుంది. ముఖ్యంగా జుట్టు సంరక్షణలో హెయిర ప్యాక్ లు, తలస్నానం, నూనెలు పెట్టుకోవడం, దువ్వడం ప్రధాన పాత్ర వహిస్తాయి. అయితే కొంత మందికి దువ్వడం కూడా సరిగా తెలియదు. ఎలా పడితే అలా దువ్వేసి అయిపోయింది దువ్వేశాం అంటుంటారు. అందుకు సమయం లేకపోవడం, లేదా జుట్టుపైన ఆసక్తి లేకపోవడం వంటి కారణాల చేత జుట్టు ఊడిపోవడం జురుగుతుంది. అలా కాకుండా ప్రతి రోజూ ఒక క్రమ పద్దతిలో తల దువ్వు కోవడం కూడా ఒక మంచి పనే. కాబట్టి జుట్టును దువ్వడానికి కొన్ని బేసిక్స్ తెలిసి ఉండాలి అవేంటో చూద్దాం...
1. తడి జుట్టును ఎప్పటికీ దువ్వకూడదు: జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వడం మంచిది కాదు. నిజానికి తడిగా ఉన్నప్పుడు దువ్వడం వల్ల జుట్టు దెబ్బతినే అవకాశం ఎక్కువ. తలస్నానం చేసిన వెంటనే మాత్రం దువ్వకూడదు. 80శాతం టవల్‌తో జుట్టును ఆరబెట్టాలి. ఆ తరువాతే జుట్టును దువ్వాలి. ఇలా చేయడం వల్ల జుట్టు తక్కువగా రాలుతుంది. జుట్టు తడిచి ఎప్పుడూ అంటుకుపోయినట్లుగా ఉంటుంది. దానివల్ల డాండ్రఫ్ కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి వారంలో మూడుసార్లు తలస్నానం తప్పనిసరి. ఎన్ని సార్లు చేస్తే జుట్టు అంత నిగారింపుగా ఉంటుంది.
2. జుట్టు దువ్వడం చాలా ముఖ్యం: ప్రతి రోజూ ఖచ్చితంగా జుట్టు దువ్వుకోవాలి. అందువలన రక్తప్రసరణ పెరుగుతుంది. అలాగని అస్తమాను దువ్వుతూ ఉండకండి మొదటికే ప్రమాదం. సాధ్యమైనంత వరకు మన దువ్వెన వేరేవారు వాడకుండా చూసుకోవాలి. చుండ్రు రాకుండా ఇది సహాయ పడుతుంది. దువ్వెన యొక్క దంతాలు విడివిడిగా ఉండేటట్టుగా జాగ్రత్త పడాలి. వెంట్రుకల మందం, పొడవును బట్టి దువ్వెనెలను ఎంపిక చేసుకోవాలి. ఒక రోజుకు కనీసం 80-100 తలమీద దువ్వినంత ప్రెషర్ ఇవ్వాలి. అప్పుడే తలకు ప్రెషర్ కలిగి రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టును రక్షిస్తుంది. జుట్టును మృదువుగా దువ్వాలే తప్ప, బలంగా లాగడం, దువ్వడం చేయరాదు.
3. మొదటి నుండి దువ్వడం: మొదటి నుండి దువ్వడం అంటే ఇది ముఖ్యంగా పొడవాటి జుట్టు ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది. జుట్టు పొడవుగా ఉన్నప్పుడు ఎక్కువ చిక్కుపడి, ముడులు ఏర్పడుతాయి. వీటిని తొలగించి కురులు సాప్ట్ గా ఉండటానికి జుట్టు దువ్వటాన్ని మొదళ్ళ నుంచి మొదలు పెట్టాలి. చిక్కు ముడులు తీసుకుంటూ జుట్టును తిప్పుతూ క్రిందికి అలాగే దువ్వుకొంటూ రావాలి. అప్పుడే చిక్కు వీడి పొడవాటి జుట్టు మీ సొంతం అవుతుంది. అలా కాకుండా ఎలా పడితే అలా దువ్వడం వల్ల మద్యలో వెంట్రుకలు తెగిపోవడం, లేదా రాలిపోవడం వంటివి జరుగుతాయి.
4. రెండు బాగాలుగా చేసి దువ్వడం: జుట్టు పొడవు, మందం ఉండటం వల్ల ఒకేసారి దువ్వడానికి, చిక్కు తీయడానికి వీలుపడదు. అంటువంటప్పుడు జుట్టు పొడవు, మందంను బట్టి, రెండు బాగాలుగా చేసి నిదానంగా ప్రతి భాగాన్ని దువ్వుకోవాలి. తర్వాత రెండు భాగాల్ని కలిపి దువ్వితే సులభం అవుతుంది.
5. ఒక్కోసారి దువ్వడంలో పద్దతిని మార్చాలి: ఎప్పుడూ ఒకే పద్దతిలో దువ్వుతుంటారు. అలా కాకుండా అప్పుడప్పుడు పద్దతి మార్చి దువ్వడం మంచిది. ఎందుకంటే ఎప్పుడూ ఒకే విధంగా దువ్వడం వల్ల అక్కడ లైన్ ఏర్పడి మొదట అక్కడి నుండే వెంట్రుకలు రాలడం మొదలు పెడుతాయి. ఒకసారి కుడి ప్రక్క నుండి మొదలు పెడితే మరొ కొన్ని రోజలకి ఎడమ పక్కన నుండి మొదలు పెట్టాలి.
6. ముడి వేసిన జుట్టును-అల్లిన జుట్టును దువ్వకూడదు: చాలా మంది ముందుగా ముడి పెట్టేసి తర్వాత పైపైన దువ్వేస్తుంటారు. అలా చేయకూడదు. ఇది మంచి పద్దతి కాదు. పోనీ టైల్ వేసేసి దువ్వడం వల్ల వెంట్రుకలు కట్ అయ్యే ప్రమాదం ఉంది. మానసిక ఆందోళన, అనారోగ్య కారణాల వలన ఎక్కువ మొత్తంలో జుట్టు సడన్‌గా రాలడం జరుగుతుంది. కొన్ని రకాలయిన హెయిర్ స్టైల్స్‌లో, జుట్టు గట్టిగాను, నిడివిగాను వుండేందుకు ఉపయోగించే కొన్ని కెమికల్స్‌వలన కూడా రాలే అవకాశం వుంది. బిగించి పోనీటైల్ కట్టుకోవడం, చిక్కుగా వున్నపుడు తల దువ్వడం వంటివి కూడా ఇబ్బందిపెడతాయి.
8. దువ్వడంలో పద్దతులు: తల దువ్వుడంలో రెండు సులభమైన పద్దతులు కలవు. ఒకటి పెద్ద పళ్ల దువ్వెనతో దువ్వడం, రెండవది చిన్న పళ్ల దువ్వెనతో దువ్వడం. చిక్కు ఎక్కువగా ఉన్నప్పుడు మొదట పెద్ద పళ్లదువ్వెనతో దువ్వేసి, తర్వాత సాదారణ దువ్వెనతో దువ్వుకోవాలి. అప్పుడే జుట్టు సంరక్షించబడుతుంది.



Click it and Unblock the Notifications