Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
నునుపైన కేశ సౌందర్యానికి కొబ్బరి నూనెతో హెయిర్ మాస్క్
చాలా వరకూ కేశ సంరక్షణలో కొబ్బరి నూనె(కోకోనట్ ఆయిల్) గురించి అందరికీ తెలిసిందే.. కొబ్బరి నూనెలో యాబై శాతం లారిక్ ఆసిడ్ ఉంటుంది ...దీన్ని వంటల్లో అధికంగా ఉపయోగిస్తే గుండెకు రక్తప్రసరణ సక్రమముగా జరుగుతుంది. కొవ్వు శాతము పెరగదు, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొబ్బరి నూనే లో విటమిన్ 'ఇ ' అధికము... ఇది చర్మాన్ని కొమలముగా తాయారు చేస్తుంది. రోజూ రెండు చెంచాలు నూనే తీసుకుంటే జీర్ణ వ్యవస్తకు మంచిది. థైరాయిడ్ సమస్యలూ ఉండవు.
అందానికి: పొడి చర్మము ఉన్నవారు పచ్చికొబ్బరి తీసుకుంటే శరీరానికి సరిపడా తేమ అందుతుంది, కొబ్బరి పాలు చర్మానికి పట్టిస్తే మృతకనాలు, మురికి తొలగిపోతాయి. మేని ప్రకాశవంతముగా మెరుస్తుంది... ఇది జుట్టుకు మేలు చేస్తుంది ... కొబ్బరి పాలు తలకు పట్టిస్తే ... కేశాలు కాంతి వంతముగా తాయారు చేస్తుంది. అంతే కాదు కొబ్బరి నూనె కేశాలకు మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. చాలా మంది కొబ్బరినూనెతో హెయిర్ మసాజ్ చేసిన తర్వాతే మంచి షాంపూతో తలస్నానం చేస్తుంటారు. కొబ్బరి నూనెను వేడి చేసి తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగా కురుల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. వీటిన్నింటితో పాటు కొబ్బరి నూనెతో హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల కేశాలు ఆరోగ్యంగా సిల్కీగా మెరుస్తుంటాయి. అందుకు కొబ్బరి నూనెతో కొన్ని రకాల కాంబినేషన్లతో హెయిర్ మాస్క్ లు మీ కోసం..

కొబ్బరి నూనె మరియు తేనె హెయిర్ మాస్క్: కొబ్బరి నూనె మరియు తేనె కురుల ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రెండూ కూడా కేశాలకు మంచి మాయిశ్చరైజర్స్, వీటితో కేశాలు మంచి మెరుపును అందిస్తుంది. రెండు చెంచాల కొబ్బరినూనెలో ఒక చెంచా తేనె కలిపి బాగా మిక్స్ చేసి తలకు బాగా పట్టించాలి. ఇరవై నిముషాల తర్వాత షాంపూతో తలస్నానం చేసుకోవాలి.
కొబ్బరి నూనె - హెన్నా: హెన్నా తలకు పట్టించడం వల్ల హెయిర్ ఫాల్ ను అరికడుతుంది. అయితే అదే సమయంలో కురులను పొడిబారేలా చేస్తుంది. కాబట్టి కేశాల పొడిబారకుండా ఉండాలంటే ఒక చెంచా కొబ్బరి నూనెలో హెన్నామిక్స్ చేసి కొద్దిగా కొబ్బరి నీళ్ళు కూడా మిక్స్ చేసి తలకు మాస్క్ లా వేసుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేయడం వల్ల ఇది మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.
కొబ్బరి నూనె, పెరుగు మరియు నిమ్మరసం: ఒక మిక్సింగ్ బౌల్ లో ఒక గుడ్డును పగలగొట్టి తెల్ల సొన తీసుకొని, అందులో రెండు చెంచాలా పెరుగు, ఒక చెంచా కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కేశాలు మరింత షైనింగ్ తో నునుపుగా మారుతాయి. ఇది ఒక నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.
కొబ్బరి నూనె మరియు రీతా: ఇది ఒక అద్భుతమైన నేచురల్ హెయిర్ మాస్క్. రెండు చెంచాల కొబ్బరి నూనె మరియు మూడు లేదా నాలుగు చెంచాల రీతా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలడాన్ని అరికడుతుంది. అంతే కాదు కురుల చివర్లు చిట్లకుండా సహాయపడుతుంది.
కొబ్బరి నూనె మరియు నిమ్మరసం: కొద్దిగా కొబ్బరి నూనెను తీసుకొని అందులో అర చెంచా నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేసి తలకు మసాజ్ చేయాలి. ఇరవై నిముషాల తర్వాత తల శుభ్రం చేసుకోవడంతో కురులకు తగినంత తేమను అందించి, చుండ్రు రాకుండా, లేకుండా చేస్తుంది.
కొబ్బరినూనె నూనె -గుడ్డు: రెండు చెంచాల కొబ్బరి నూనెలో, గుడ్డు సొన మిక్స్ చేసి తలకు మాస్క్ వేయాలి. అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి. మంచి షాంపూతో తలస్నానం చేయడం వల్ల గుడ్డు వాసన లేకుండా ఉంటుంది. ఇది ఇక నేచురల్ హెయిర్ మాస్క్. దీన్ని వేసుకోవడం వల్ల కేశాలు సున్నితంగా.. నునుపు, షైనింగ్ తో మెరుస్తుంటాయి.



Click it and Unblock the Notifications
