Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
పురుషులకు అవసరం రెగ్యులర్ హెయిర్ కేర్....!

1. స్త్రీ లైనా, పురుషులైనా వారు కేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలోనే ఉంది వాటి ఆరోగ్యం. కాబట్టి క్లీనింగ్ అనేది ముఖ్యం. మీ హెయిర్ స్టైల్ కు తగినటువంటి హెయిర్ ప్రొడక్ట్స్ ను రెగ్యులర్ గా వాడాలి. తరచూ బ్రాండులను మార్చకూడదు. షాంపులను సున్నితమైన సువాసన కలిగిన వాటిని ఎంపిక చేసుకోవాలి. షాంపును డైరెక్ట్ గా తలకు రాయకుండా చేతులోనికి వేసుకొని ముని వేళ్ళతో తల మాడుకు మర్ధన చేయాలి. జిడ్డు, ఇతర దుమ్ము ధూళి మాడు మీద నిల్ల ఉంటుంది కాబట్టి మొదటా మాడును శుభ్రం చేసుకోవాలి. హెయిర్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించిన తర్వాత కేశాలను గోరు వెచ్చని నీటితో క్లీనింగ్ శుభ్రపరచుకోవాలి.
2. తలస్నానం చేసిన తర్వాత తడిగా ఉన్న జుట్టును టవల్ తో గట్టిగా రుద్దకూడదు. ఇలా చేయడం వల్ల వెంట్రుకు డామేజ్ అవ్వడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం. ముందుగా తలలోని నీటిని పూర్తిగా రాలిపోయేలా చూసి తర్వాత ఒకే డైరెక్షన్ టవల్ తో తుడుచుకోవాలి.
3. ముఖ్యంగా మగవారికి కురులు తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ షాంపూలను ఉపయోగించకూడదు. తగినంత మోతాదులో వేసుకొని వాష్ చేసుకోవాలి. ముఖ్యంగా మగవారు హెయిర్ కలర్స్, హెయిర్ స్టైల్స్ తరచూ మార్చుతుంటారు. అలా చేయడం వల్ల తలలోని వెంట్రుకలు, తల మాడుకు కూడా ప్రమాదమే.
4. పురుషుల కేశాలు నల్లగా నిగనిగలాడుతూ ఉండాలంటే ప్రతి రోజూ మంచి సమతుల ఆహారాన్ని తీసుకొంటూ, ఎక్కువ నీటిని త్రాగుతుండాలి. కురులు పొడి బారి ఉన్నట్లైతే స్నానానికి వెళ్ళే ముందు మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి
5. ముఖ్యంగా ఈ బిజీలైఫ్ లో మెదడుకు విశ్రాంతి అనేది చాలా అవసరం. ఒత్తిడి వలన కూడా కురులు ఎక్కువగా రాలిపోతాయి కాబట్టి. మెదడు తగిన విశ్రాంతిని కలిగించడానికి కంటి నిండా నిద్రపోవాలి. ఒత్తిడిని దూరం చేసుకొంటే కురులు ఒత్తుగా పెరగడానికి బాగా దోహదపడుతుంది.
6. ముఖ్యంగా బేస్ బాల్ క్యాప్స్ ను ఉపయోగించడం మానేయాలి. తలను టైట్ గా కవర్ చేయడం వల్ల కురులు తెగిపోవడం లేదా రాలిపోవడానికి అవకాశం ఉంది.
7. ప్రతి నాలుగు వారాలకు ఒక్కసారి మీ వెంట్రులకు ట్రిమ్ చేస్తుండాలి. సాధారణ పళ్లు ఉన్న దువ్వెనలను ఉపయోగించాలి. మీరు ఉపయోగించి దువ్వెనలు పదిహేను రోజులకో నెలకొక్కసారైనా శుభ్రం చేస్తుండాలి.
8. మగవారు హెయిర్ డ్రైయర్ ను ఉపయోగించక పోవడమే మంచిది. మీకు నచ్చిన, అతి సులభంగా మెయిన్ టైన్ చేయగల హెయిర్ స్టైన్ మాత్రమే ఎంపిక చేసుకోండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే తప్పకుండా మగవారి కురులు కూడా.



Click it and Unblock the Notifications
