Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వేసవిలో కురుల సంరక్షణ...కురుల సొగసులు

కొబ్బరినూనె వేడి చేసి అందులో నిమ్మరసం కలిపి దాన్ని తలకి పట్టించుకుంటే 5, 6 గంటలు ఆగి ఆ తరువాత శీకాయతో తలస్నానం చేస్తే వెంట్రుకల చివరలు చిట్లిపోకుండా ఉంటాయి.
తలకు క్యాబేజీ ఆకుల రసం పట్టించి గంటసేపు ఆగి తలస్నానం చేస్తే శిరోజాలు బాగా పెరుగుతాయి. తల స్నానం చేసిన తర్వాత తలకు సాంబ్రాణి పొగవేసుకుంటే శిరోజాలకు మంచి సువాసన కలుగుతుంది.
తలస్నానానికి ముందు కొద్దిగా ఉసిరికపొడి నీటిలో నానబెట్టి వుంచి స్నానం పూర్తయ్యాక ఉసిరిక పొడి నానపెట్టిన నీటిని చిలకరించి పైతేటను తలపై పోసుకుంటే శిరోజాలు ఎర్రబడకుండా నిగనిగలాడతాయి.
వేసవిలో వేడినీళ్లతో స్నానం చేయకపోవడమే మంచిది. తలస్నానం అసలే వద్దు. జుట్టు పొడిబారిపోకుండా వారానికి ఒకటి రెండుసార్లయినా నూనె రాసుకోవాలి. ఇక స్విమ్మింగ్ ఫూల్స్ లోని నీళ్లలో క్లోరిన్ కలుపుతారు. క్లోరిన్ కేశసౌందర్యానికి శత్రువు. ఇంటికి రాగానే మంచి షాంపూతో తలస్నానం చేయడం మంచిది.
జుట్టు ఒత్తుగా పెరగాలంటే తల స్నానం చేయబోయే గంట ముందు గోరువెచ్చని కొబ్బరినూనెను తలకు పట్టించాలి. తగినన్ని మందార ఆకులను శుభ్రంగా కడిగి గ్రైండ్ చేయాలి. ఆ ముద్దను కూడా తలకు పట్టించి గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే జుట్టుకి పోషణ లభించి నల్లగా ఉంటుంది.
గుడ్డు, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, టీ స్పూన్ నిమ్మరసం, టేబుల్ స్పూన్ కుంకుడుకాయ రసం, కప్పు హెర్బల్ టీ, ఎసెన్షియల్ ఆయిల్ ఐదు చుక్కలు కలిపి బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, వేళ్లతో మాడును వలయాకారంగా రుద్దుతూ, శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండు రోజులు ఈ విధంగా చేస్తుంటే జుట్టు పెరుగుతుంది.
పెద్ద పళ్ళు ఉన్న దువ్వెనతో ముందు చిక్కు తీసుకొని, తర్వాత మామూలు దువ్వెనతో దువ్వుకోవటం ద్వారా వెంట్రుకలు రాలటాన్ని అరికట్టుకోవచ్చును. శిరోజాలను సంరక్షించుకోవటంలో శ్రద్ధ వహించిన మీరు మరింత ఆకర్షణగా కనబడగలరు. శిరోజాలే స్ర్తీలకు అందం.



Click it and Unblock the Notifications